యహూషువః ''నేను'' అనే పదాన్ని ఉపయోగిస్తే దానికి అతడు యహువః అని అర్థమా?
ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
యహూషువః తనను గూర్చి "I am/నేను ఉన్నాను" ప్రకటనలను (యోహాను పుస్తకం అంతటా నమోదు చేయబడినట్లుగా) చేస్తున్నప్పుడు ఉపయోగించిన "I am/నేను ఉన్నాను" అనే అవే రెండు గ్రీకు పదాలను యోహాను 9:9లో పూర్వం గుడ్డివానిగా ఉండి అద్భుతంగా స్వస్థత పొందిన వ్యక్తి ఖచ్చితంగా చెప్పాడు. మొదటగా, ఆ అంధుడు గ్రీకు భాషలో "ఇగో ఈమి/“ego eimi," అని చెప్పినప్పుడు, అది సాధారణంగా మరియు సరిగ్గా "అతడు నేనే" అని అనువదించబడుతుందని గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది, వాస్తవానికి అది "అవును! ఆ వ్యక్తి నేనే; నేనే - పూర్వం అంధుడిని, కానీ ఇప్పుడు స్వస్థత పొందాను అని అందరికీ స్పష్టం చేయడానికి అతను చేసిన ప్రయత్నాన్ని సూచిస్తుంది. అయితే, తనను తాను మెస్సీయగా (యోహాను 4:26) గుర్తించడానికి యహూషువః అదే విషయాన్ని చెప్పినప్పుడు, అది సాధారణంగా "నేను" అని అనువదించబడుతుంది. ఇది జనాదరణ పొంది, కానీ చాలా తప్పుగా, యహూషువః ఏదో ఒకవిధంగా తానే యహువఃనని చెప్పుచున్నాడనే అబద్ధాన్ని సమర్ధించడానికి ఉపయోగించబడింది, ఎందుకంటే పాత నిబంధనలో యహువః మోషేతో “నేనే ఉన్నవాడను” అని చెప్పాడు (ఉదా 3.14, అక్షరాలా, “నేను ఉన్నవాడను/నేను ఉండు వాడను అని అర్థం).
యహూషువః సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు తాను మెస్సీయ అని అద్భుతమైన వాదనను చేస్తున్నాడు, వెంటనే తరువాతి (4:25) వచనంలో క్రీస్తును గూర్చి ఆ స్త్రీ యొక్క ప్రకటన కూడా ఉన్నది. యోహానులో మరొక చోట, యహూషువః తాను "జీవపు రొట్టె/జీవాహారమును" (6:35) మరియు "పునరుత్థానమును మరియు జీవమును" (11:25) అని పేర్కొన్నట్లు నమోదు చేయబడింది. కానీ "ఇగో ఈమి జీవాహారం" అని చెప్పడం అంటే "నేను ఉన్నవాడను/నేను ఉండు వాడను" అని మోషేతో చెప్పినట్లు (నిర్గమ. 3:14) ప్రకటించడం లాంటిది కానేకాదు.
ఇది యహువః యొక్క స్వీయ-బయల్పాటు యొక్క "ఇగో ఈమి" (యహూషువఃయే యహువః అని చెప్పే వారి దృష్టి) కాదని గమనించండి. తరువాతి రెండు పదాలు — “ఓ ఓహ్న్”1 అనేవి నిజమైన ప్రకటన దృష్టి — దైవిక గుర్తింపుదారులు అని మనం చెప్పవచ్చు. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో యహువః మోషేతో ఇలా అన్నాడు: "నేను [ఇగో ఈమి] ఉన్నవాడను/అనువాడను [ఓహ్న్]." "నేనే స్వయంగా ఉనికిలో ఉన్నవాడను." “నీవు ఇశ్రాయేలీయులకు చెప్పవలసినది ఏమనగా: 'నేను [ఓ ఓహ్న్] నన్ను మీ వద్దకు పంపాను.” కానీ ఆంగ్ల అనువాదాలు రెండు తప్పు పదాలను గొప్ప చేయుచున్నాయి, అంటే, ఇగో ఈమి కి బదులుగా అది ఓ ఓహ్న్/o ohn అని: “ఓహ్న్ [స్వయంగా ఉన్నవాడు] నిన్ను పంపాడు. (cp. ఫిలో, లైఫ్ ఆఫ్ మోసెస్, వాల్యూమ్. 1.75: "హి హూ ఈజ్").
కొత్త నిబంధన రచయితలు యహూషువఃను గురించి ఎప్పుడూ "ఓ ఓహ్న్/o ohn" ఉపయోగించి గ్రంథస్థం చేయలేదు. ఇంకా, యహూషువః తనను తాను గుర్తించుకోవడానికి ఏ ఇతర పదాలను ఉపయోగించినట్లు మీరు చూసారు? ఉదాహరణకు, మీరు "నేను ఉపాధ్యాయుడిని" లేదా "నేనే బాబ్ ని" లేదా "ఆ తలుపు యొక్క తాళం చెవిని కలిగి ఉన్న వ్యక్తిని నేను మాత్రమే" అని చెప్పినప్పుడు, మీరు వాటిని గ్రీకులో వ్రాయాల్సివస్తే అదే పదాలు స్వీయ-గుర్తింపుదారులుగా ఉపయోగించబడతాయి: "ఇగో ఈమి." మిమ్మల్ని గుర్తించడానికి సులభమైన మరియు స్పష్టమైన మార్గం ఏదీ లేదు! “నేను ఉన్నాను” లేదా “నేను ఉన్నవాడను అనువాడను” లేదా “నేను ఉన్నవాడను/నేను ఉండు వాడను/నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను” అని యహూషువః ఎప్పుడూ చెప్పలేదు. అతడు కేవలం, “నేను మంచి కాపరిని; నేనే మార్గమును, సత్యమును, మరియు జీవమును; నేనే ద్రాక్షవల్లిని”; "నేను మెస్సీయను" (యోహాను 4:25-26) మొదలైనవి చెప్పాడు. స్వస్థత పొందిన అంధుడు చేసినట్లే, యహూషువః తనను అడిగే లేదా వెతుకుతున్న వారి కోసం తనను తాను ఆ విధంగా గుర్తించుకున్నాడు (యోహాను 18:4-8 పోల్చండి).
యహూషువః మొదటి నుండి వాగ్దానం చేయబడిన మెస్సీయ అని చెప్పుకున్నాడు. అతడు ఎప్పుడూ ఇశ్రాయేలు దేవుడు (యహూషువః దేవుడు కూడా!) అని చెప్పుకోలేదు. అతడు పాత నిబంధన యొక్క "గొప్ప ఉన్నవాడను" అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఏది ఏమైనప్పటికీ, ఆయన మెస్సీయ ప్రభువు (లూకా 2.11, క్రిస్టోస్ కురియోస్/kristos kurios) తప్ప ప్రభువైన యహువః కాదు అని పదేపదే చెప్పుకున్నాడు. యహూషువః లూకా 2:26లో వ్రాసినట్లు ఒకే ప్రభువైన యహువఃకు సంబంధించినవాడు, అక్కడ అతడు అభిషిక్తుడైన (మెస్సీయ) ప్రభువు. లూకా మనకు అందించే రెండు-లేఖనాలలోనూ (లూకా మరియు అపొస్తులలు) తన కథనం యొక్క కథానాయకుని మరియు ప్రధాన "పాత్రధారుని" అద్భుతంగా మరియు ఖచ్చితంగా పరిచయం చేశాడు. లూకా కొత్త నిబంధనలో దాదాపు మూడో వంతు రాశాడు.
ఎంత ధన్యమైన విజయం! ఇద్దరూ దేవుళ్ళుగా గల ఇద్దరు వ్యక్తులు ఉన్నారని లూకా గాని యహూషువః గాని ఒక్క క్షణం కూడా నమ్మలేదు. అది యహువః ఒకనికంటే ఎక్కువమంది అని చెప్పుటను నిషేధించే గొప్ప ఆజ్ఞను విచ్ఛిన్నం చేస్తుంది (మార్కు 12:29; యోహాను 17:3; 5:44; మలాకి 2:10). తాను యహువఃనని చెప్పుకునే దైవదూషణను యహూషువః తిరస్కరించాడు! (యోహాను 10:33-36).
ఇది అలనే రోజెల్లే రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.