యోహాను 3:16: అస్పష్టమైన అపార్థం పట్ల జాగ్రత్త వహించండి
ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
"యహువః లోకాన్ని ఇలా ప్రేమించెను: ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, తద్వారా ఆయనయందు విశ్వాసముంచే ప్రతి వ్యక్తి నశించక, రాబోయే యుగపు జీవితాన్ని పొందుకొనును." —యోహాను 3:16, వన్ గాడ్ ది ఫాదర్ అనువాదం (OGF).
ఆధునిక కాలంలో యోహాను 3:16 బహుశా మొత్తం బైబిల్ అంతటిలో చాలా తరచుగా చూపబడుచున్న వచనం (సందర్భంతో సంబంధం లేకుండా), ఎందుకంటే ఇది అమెరికా క్రీడా కార్యక్రమాలలో కనబడుతుంది (పోస్టర్లపై), మరియు మంచి ఉద్దేశ్యం గల ఉత్సాహవంతులైన సువార్తీకులచే క్లుప్తమైన సారాంశంగా పదేపదే ఉపయోగించబడుతుంది. ఈ వాక్యం తన కుమారుని అనుగ్రహించు విషయంలో యహువః యొక్క అపారమైన ప్రేమ మరియు లక్ష్యాన్ని గూర్చిన ఒక అందమైన ప్రకటన అయితే, అది నేడు ప్రమాదకరంగా తప్పుదారి పట్టించే విధంగా ఉపయోగించబడుతుంది! ఈ వాక్యాన్ని ఉపయోగించి రక్షణ కొరకు తక్షణ-సులభమైన సూత్రాన్ని తయారుచేయుటను సువార్తల యొక్క అసలు సందర్భాలు నిషేధిస్తున్నాయి.
చాలా సుపరిచితమైన ఈ వచనం యొక్క అసలైన అర్థాన్ని పూర్తిగా గ్రహించాలంటే, దీనిని "పైనుండి పుట్టుట" (లేదా మరలా జన్మించుట) ను గురించి యహూషువః నికోదేముతో సంభాషించిన సందర్భంతో జాగ్రత్తగా పోల్చి, అలాగే రానైయున్న యహువః రాజ్య సువార్తను ప్రకటించిన యహూషువః పరిచర్య యొక్క విస్తృత సందర్భంతో పోల్చి చూడాలి. ఈ కొత్తగా జన్మించుటను గూర్చిన బోధన (యోహాను 3వ అధ్యాయం) యొక్క అవగాహన విత్తువాని (మార్కు 4:13-20) ఉపమానం ద్వారా తెలియజేయబడిన ముఖ్యమైన సత్యానికి వేరుగా ఉండకూడదు. మీరు యహూషువః రాజ్య సువార్తను విశ్వసించలేనట్లైతే "యహూషువఃను విశ్వాసించలేనట్లే".
“మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు.” (మార్కు 4: 13,14)
లూకా 8:10-11 ప్రకారం “వాక్యము” అనగా “యహువః యొక్క వాక్యం”, ఇది “యహువః రాజ్య మర్మములకు” పర్యాయపదంగా ఉంటుంది. మత్తయి 13:19, మార్కు 4:14 లలోని “వాక్యము” “రాజ్య వాక్యానికి” సమాంతరమని సులభంగా గ్రహించవచ్చు. విత్తువాని ఉపమానాన్ని గూర్చిన ఈ మూడు భాగాలలో, రాబోయే రాజ్య సువార్త సందేశానికి చెప్పబడిన నాలుగు రకాల నేలలలో చివరి నేల సరైన ప్రతిస్పందనగా ఉందని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, "వాక్యాన్ని" తప్పుగా అర్థం చేసుకొనుట మరియు దానిని వెంటనే దుష్టుడు లాక్కొనటానికి బదులు; లేదా నిజానికి దానిని స్వల్పకాలిక ఆనందంతో స్వీకరించి మరియు వాక్యం నిమిత్తం కలిగే కష్టాలు/హింసల కారణంగా తొట్రిల్లిపోవడం, లేదా "లోక సంబంధమైన జాగ్రత్తలు మరియు ధన మోసం ద్వారా ఉక్కిరిబిక్కిరి అయ్యే విధంగా వాక్యాన్ని స్వీకరించి ఫలించని వారిగా ఉండుటకు బదులు"; విశ్వాసి నాల్గవ వర్గంలో ఉండడాన్ని ఎంచుకోవాలి! ఒకరు రాజ్య వాక్యాన్ని స్వీకరించాలి మరియు దానిని మంచి, నిజాయితీగల హృదయంతో అర్థం చేసుకోవాలి - మరియు "అక్కడే ఉండిపోవాలి", ఒకరు సువార్త సందేశానికి అవసరమైన క్రియలను పట్టుదలతో చేయుటలో జీవితాంతం క్రియాశీలకంగా ఉంటూ, నిరంతరం ఫలాలను అందజేయాలి!
ఫుట్నోట్ నుండి క్రింది మాటలలో (వన్ గాడ్, ది ఫాదర్, వన్ మెస్సీయ అనువాదం, పేజీ 245) యోహాను 3వ అధ్యాయానికి సంబంధించి కొన్ని సంబంధిత సంబంధాలు సూచించబడ్డాయి:
“పై నుండి పుట్టుట అనేది, ఈ పునర్జన్మకి రచయితయైన యహువః ద్వారా కలుగుతుంది మరియు అది సత్యము [రాజ్య సువార్త] మరియు పశ్చాత్తాపాలపై గల మన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. క్రైస్తవునిగా మారుటకు తిరిగి జన్మించుట అనేది వివాదాలకు ఆస్కారం లేని ఆధారం. సారాంశ సారూప్య సువార్తలైన మత్తయి, మార్కు మరియు లూకాలలో, నూతనంగా జన్మించుట అనేది సువార్త విత్తనం నుండి పుట్టుకొచ్చే కొత్త జీవితంగా వర్ణించబడింది (లూకా 8:11). అలా యహూషువః నికోదేముతో జీవ రూపకాన్ని మరియు విత్తువాని ఉపమానాన్ని విన్న ప్రజలతో వ్యవసాయ రూపకాన్ని ఉపయోగించాడు. ఇవి 1వ పేతురులో చక్కగా జతచేయబడ్డాయి. 1:22-25 ప్రకారం తిరిగి జన్మించుట అనేది సువార్త [రాజ్యం] అనే విత్తనంపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా విశ్వాసిగా మారే వారికి కొత్త నిబంధన ఒకే ఒక్క ఐక్య వేదాంతాన్ని కలిగి ఉంది. ఇది యహూషువః రాజ్య సువార్త (మార్కు 1:1-2, 14-15) పై గల విశ్వాసంతో మొదలవుతుంది.
పాఠకులు యోహాను 3వ అధ్యాయంలోని యహూషువః యొక్క అలంకారిక భాష యొక్క వాస్తవ సందర్భాన్ని, స్వారూప్య సువార్తలలోని “విత్తన” రూపకాలతో పాటుగా “తిరిగి జన్మించుట” అనే మొత్తం కొత్త నిబంధన ఇతివృత్తాన్ని పరిగణలోకి తీసుకొనుట ద్వారా, యోహాను 3:16 యొక్క సందర్భం కూడా నిజమైన క్రియాశీల ప్రతిస్పందన యొక్క క్లిష్టమైన అవసరాన్ని నిర్ధారిస్తుంది అని తెలుసుకోగలరు. అది నిరంతర పశ్చాత్తాపపూర్వకమైన విధేయత యొక్క నిర్ణయాత్మక ప్రయత్నం, (విత్తువాని యొక్క ఉపమానంలో వలె).
"అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. యహువః లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా (లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు యహువః ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు యహువః అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు (లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు( మూలభాషలో-తన క్రియలు గద్దింపబడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు యహువః మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును." (యోహాను సువార్త 3:14-21).
ఒకడు యోహాను 3:16ని దాని తక్షణ సందర్భంగా అంగీకరించడం ద్వారా, "యహూషువఃను విశ్వసించుట" అనేది యహూషువఃను యహువః పంపెను అనే ఒక క్షణికమైన అంగీకారానికి సంబంధించినదానిలా, వట్టి తేలికైన అనుభూతిని కలిగించే అనుభవాన్ని సూచిస్తున్నదానిలా ఇతరులను తప్పుదారి పట్టించు విషయంలో అపరాధిగా ఉండడు. యహూషువఃను నిజంగా విశ్వసించుట అనగా ఒకడు తన క్రియల విషయంలో నిర్ణయాత్మకంగా వెలుగులోకి రావడం. వెలుగులోకి రావడం అనేది చీకటి యొక్క మునుపటి క్రియలను మార్చడానికి మరియు ఆపివేయడానికి నిరంతర ఎంపికలను కలిగి ఉంటుంది. బాప్తీస్మం అనేది పశ్చాత్తాపంతో కూడిన నిబద్ధత యొక్క చర్య, అది ఈ విధేయతా సూత్రం యొక్క అనుకూలమైన, కీలకమైన భాగం, అలాగే ఈ లేఖనాల (యోహాను 3:22-30 మరియు 4:1-3) యొక్క తక్షణ సందర్భానికి సంబంధించిన భాగం. ఫలవంతమైన, ఎదుగుతున్న మార్గంలో ఉండాలంటే, విశ్వాసులు నిరంతరం సవాళ్లను ఎదుర్కొనుటలో జయించువారుగా ఉండాలి (అపోస్తలు 14:22).
వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచూ చీకటి జీవితపు మార్గాలలో ఉండువారి కోసం, అదే విధమైన పదజాలంతో కూడిన మరొక లేఖనాధార సందర్భం 1 యోహాను 1:5-2:2. విశ్వాసులు రాజ్య సువార్తను (మార్కు 4:11-12) విశ్వసించడం ద్వారా మొదట పశ్చాత్తాపం పొందిన తర్వాత, తప్పుగా భావించే దేని గురించీ స్పష్టంగా పశ్చాత్తాపపడకుండా, నిజంగా వెలుగులోకి వచ్చిన తర్వాత (చీకటి కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పుడు) కూడా వారి దారిని తప్పించే పాపాల ద్వారా ఇప్పటికీ ఆకర్షించబడుతూ ఉండవచ్చు. అయితే, మనం పొరపాటున కాంతికి దూరమైనప్పటికీ — మన నిబద్ధతను వదులుకోవద్దని మనము అద్భుతంగా ఆహ్వానించబడ్డాము. చీకటిలో ఉంటూ, ఇంకా మార్గంలో ఉన్నట్లు నటిస్తూ మనతో మనం (మరియు ఇతరులకు) అబద్ధం చెప్పుకొనే బదులు, మన నమ్మదగిన యహువః, యహూషువః యొక్క త్యాగ రక్తం ద్వారా మన పాపాలను క్షమించి, కడుగుతున్నాడని నమ్మకంగా గ్రహించి, మన పాపాలను వినయంగా ఒప్పుకోవచ్చు. మనలో సరికాని వాటన్నిటి నుండి మనం శుద్ధి చేయబడతాము. యహూషువః యొక్క పరిపూర్ణమైన పాపపరిహారార్థ బలి యొక్క విస్తృతమైన ప్రభావం ద్వారా, యహువః మనలను ఈ విధంగా క్షమించి, కడుగుతున్నప్పుడు ఆయన పూర్తిగా న్యాయంగా ఉంటాడు!
మన క్లిష్ట పరిస్థితులు మరియు మన మానవ బలహీనతలు మనకి ఉన్నప్పటికీ, మన నమ్మదగిన ఎలోహిమ్ మరియు ఆయన నమ్మకమైన కుమారుడు మనకు వెన్నుదన్నుగా ఉన్నారు, ఎందుకంటే మనం బైబిల్ యొక్క ప్రేమపూర్వక జీవన విధానాన్ని (రాబోయే యహువః రాజ్య సువార్త ప్రకారం) విడిచిపెట్టడానికి నిరాకరించాము.
పై కథనంలోని కొన్ని పదాలు మరియు పదబంధాల స్పష్టమైన అర్థంపై WLC ప్రత్యేక గమనిక.
[a] “పాపం = చీకటి = మనలో సరిగ్గా లేనివన్నీ”
1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు (ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
"పాపం" అనగా ఏదైనా అతిక్రమం లేదా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం = సమస్త ఆజ్ఞలు = తోరా, ఇది యహువః రాజ్యంలో పౌరులందరూ గైకొనడానికి అవసరమైన నియమాలను మరియు నిబంధనలను కలిగి ఉంటుంది.
[b] “బైబిలు అనుసారమైన, ప్రేమగల జీవనశైలి” = ఆజ్ఞలను పాటించడం.
ద్వితీయోపదేశకాండము 7:9 కాబట్టి యహువః, ఆయనే G-d, నమ్మకమైన G-d అని తెలిసికొనుము, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును;
యోహాను 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.
యోహాను 14:23 యహూషువః ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.
మొదటి యోహాను 5:2-4: మనము యహువఃను ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా యహువః పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే యహువఃను ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యహువః మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే
ఇది కెన్నెత్ లాప్రేడ్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.