సర్వనామాల సిద్ధాంతం క్రీస్తు యొక్క స్వీయ వాంగ్మూలానికి వర్తించబడుతుంది
ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
నెం. 1. సర్వనామాల సిద్ధాంతం పేర్కొంది.
సర్వనామాలు అనేవి ఒకే పదాన్ని లేదా ధ్వనిని అత్యంత తరచుగా పునరావృతం చేయకుండా ఉండటానికి వ్యక్తుల లేదా వస్తువుల పేర్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే పదాలు. వ్యక్తిగత సర్వనామం అనేది ఒక వ్యక్తి యొక్క పేరు లేదా శీర్షికకు ప్రత్యామ్నాయం, మరియు దానిని ఆ పేర్ల స్థానంలో ఉపయోగించినట్లయితే పేరు లేదా శీర్షిక సూచించే అన్నింటినీ అది సూచిస్తుంది.
ఉదాహరణ: అబ్రాహాము మంచి వ్యక్తి, అతడు యహువఃకు స్నేహితుడు, మరియు యహువః అతడిని ప్రేమించి అతడితో నిబంధన చేసాడు. ఈ వాక్యంలో, అబ్రాహాము అనే పేరుకు ప్రత్యామ్నాయంగా అతడు అని ఒకసారి మరియు అతడిని రెండుసార్లు ఉపయోగించబడింది. ఈ క్రింది రూపంలో కూడా అర్థం అదే విధంగా ఉంటుంది: అబ్రాహాము మంచి వ్యక్తి, అబ్రాహాము యహువఃకు స్నేహితుడు, మరియు యహువః అబ్రాహామును ప్రేమించి అబ్రాహాముతో నిబంధన చేసాడు. ‘అతడు’ మరియు ‘అతడిని’ అనేవి సర్వనామాలు. వ్యక్తి అనే పదం ఏదైనా తెలివైన జీవికి వర్తిస్తుంది — యహువఃకు, క్రీస్తుకు, ఎవరైనా దేవదూతకి లేక ఏదైనా మనిషికి వర్తిస్తుంది, అది దేహంలో ఉన్నా లేదా శరీరం వెలుపల ఉన్నా.
నెం. 2. సర్వనామాల సిద్ధాంతం వర్తింపజేయబడింది.
మునుపటి వ్యాఖ్యలను యహువఃపై తాను ఆధారపడి ఉండుటను గురించి క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని త్రిత్వ వాదుల వివరణకు అన్వయించనివ్వండి. క్రీస్తు యహువః అనియు మరియు ఒక “వ్యక్తి” లో మనిషి అనే పరికల్పనను త్రిత్వ సిద్ధాంతం అవలంబిస్తుందని అందరికీ తెలుసు. ఇక్కడ ఒకే శరీరానికి రెండు విభిన్నమైన మనస్సులు ఉన్నాయని, అవి ఒకే వ్యక్తి, యహూషువః క్రీస్తులో, ఐక్యమై మరియు గుర్తించబడి ఉన్నాయని బోధిస్తుంది. అటువంటి ఐక్యత యొక్క సంభావనీయతను నేను తిరస్కరించను లేదా చర్చించను. ఆ విషయంపై నాకు అవగాహన లేదు. కానీ ఈ ఆలోచన సరైనదని ఒప్పుకుంటే, ఈ వ్యక్తిలో దైవంతో మానవుడు లేడని స్పష్టమవుతుంది. క్రీస్తు యొక్క సమృద్ధి, కార్యకలాపాలు మరియు మహిమకు సంబంధించిన విషయాలలో దైవత్వం అన్నింటిలోనూ ఉండాలి. ఈ సందర్భంలో, ముందు పేర్కొన్నదానిలో కొన్ని విషయాలు వ్యక్తి యొక్క ఒక భాగానికి సంబంధించి యథార్థంగా ధృవీకరించబడవచ్చు, కానీ ఇది మరొక భాగాన్ని గురించి సముచితంగా ధృవీకరించబడదు. కానీ క్రీస్తు గాని లేదా మరే వ్యక్తి గాని నేను చేయగలను అనిగాని, నేను దీనిని లేదా దానిని చేయలేను అనిగాని చెప్పినప్పుడు "నేను" అనే సర్వనామం ఆ వ్యక్తి యొక్క అన్ని సామర్ధ్యాలను సూచిస్తుంది. నేను నా శరీరం గురించి లేదా నా చిటికెన వ్రేలు గురించి మాత్రమే మాట్లాడాను అని ప్రశ్నించడం ద్వారా అబద్ధం నుండి బయటపడాలని ఆశించి, "నేను ఆలోచించలేను" అని చెప్పడం సరికాదని అందరికీ తెలుసు. క్రీస్తు మాటలను వివరించుటలో అనుసరించిన పద్ధతి ఎంత దురదృష్టకరం. ఆయన ఇలా అన్నాడు, “నా అంతట నేనే ఏమియు చేయలేను; నాలోని తండ్రి, సమస్తమును చేస్తాడు." "నా తండ్రి నాకంటే గొప్పవాడు." క్రీస్తు తనకుతానుగా యహువః కాదు అనుటకు రుజువుగా అటువంటి మాటలను ఆయన నొక్కిచెప్పుచున్నప్పుడు, త్రిత్వవాదులు మాత్రం ఆ ప్రకటనలలో, “క్రీస్తు తన మానవ స్వభావం గురించి మాత్రమే మాట్లాడాడు” అని చెప్పే సాహసం చేస్తారు. ఒక వ్యక్తిగా అతడు ఆధారపడి ఉన్నాడు, అతడు దేవుడిగా లేడు.
ఉదాహరణకు, యూదుల సన్హెద్రిన్ యెదుట క్రీస్తు విచారించబడుతున్నప్పుడు, తాను యహువఃపై ఆధారపడుతున్నట్లు తరచుగా ప్రకటించుటలో తన అర్థమేమిటని ప్రశ్నించబడిందని అనుకుందాం; అతడు త్రిత్వ వాదుల కోణంలో ఇలా వివరణ ఇచ్చాడని కూడా అనుకుందాం, “నేను యహువఃనై తండ్రితో సమానంమై యుండియు, నేను అలా మాట్ట్లాడిప్పుడు నా మానవ స్వభావం గురించి మాత్రమే మాట్లాడాను; నేను అబ్రాహాము దేవుడను, మీ పితరులచే పూజింపబడిన మరియు మీరు ఆరాధించుచున్న వాడిని అని సమాధానం ఇచ్చియుంటే? ఈ సమాధానం అతని న్యాయమూర్తుల సమక్షంలో అతను యహువః కుమారుడని చెప్పుకొనిన వాదన కంటే మరి తీవ్రమైన ఆరోపణకు కారణం కాదా? వారు అతనితో చాలా న్యాయంగా ఇలా చెప్పకపోయి ఉండవచ్చా — “నువ్వు ప్రజలకు చేసిన బోధలో నువ్వు అనుసరించిన భాష వివాదాస్పదమైనది మరియు మోసపూరితమైనదిగా ఉండవచ్చో లేదో గానీ, నువ్వు ఇప్పుడు చెప్పినది మాత్రం ఖచ్చితంగా తప్పు. నువ్వు చెప్పినట్టు, యహువఃగా పరిగణించబడునట్లు పూర్తిగా ప్రకటించుటకు నీకు ఎటువంటి వ్యాజ్యము లేదు, చేయలేవు. అలాంటప్పుడు నువ్వు తండ్రితో సమానమైన దేవుడని చెప్పడాన్ని మనుష్యులు నమ్ముటను ఇప్పుడు ఎలా ఆశించగలవు? అంతేకాకుండా, అబ్రాహాము దేవుని యొక్క తండ్రిని గురించి ఇంతకు ముందు ఎవరు విన్నారు?”
కానీ అటువంటి “నమ్మకమైన మరియు నిజమైన సాక్షి” పై అతని శత్రువులు అలాంటి భయంకరమైన ఆరోపణ ఏమీ చేయలేదు. నేను నమ్ముతున్నాను, మెస్సీయ, అతను ఒకే వ్యక్తిలో ఉన్న దేవుడు మరియు మనిషి అని తెలియజేసేందుకు గానీ, అతడు తండ్రిపై ఆధారపడుటకు సంబంధించి గానీ, లేదా అతడు ఏ కోణంలోనూ స్వతంత్ర యహువః అని గానీ తన సాక్ష్యాన్ని ఏ ఒక్క సందర్భంలోనూ విరుద్ధంగా చేయలేదు (అతని అపొస్తలులకు కూడా). అతని స్వాతంత్ర్యం(దైవత్వం) మరియు స్వీయ-ఉనికి కోసం నొక్కిచెప్పినట్లు అతని అపొస్తలులు కూడా ఎప్పుడూ అర్థం చేసుకున్నట్లు కనిపించడం లేదు.
నెం. 3. తప్పుడు అవగాహనలను నివారించడానికి యోహాను యొక్క జాగ్రత్త.
యోహాను, యహూషువః ప్రేమించిన శిష్యుడు, ఆయన చరిత్రను వ్రాసిన సువార్తికులలో చివరివాడు మరియు క్రీస్తు తన పరిచర్య మరియు అధికారం, తన జ్ఞానం మరియు శక్తి కోసం యహువఃపై ఆధారపడటాన్ని చాలా స్పష్టంగా నొక్కిచెప్పిన ప్రసంగాలను నమోదు చేసినవాడు. అనేక సందర్భాల్లో, క్రీస్తు మాటలను సరిగ్గా అర్థం చేసుకొనుటకు లేదా ఆయన అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి యోహాను ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అతడు కేఫా, తోమా, సిలోయము, రబ్బీ మరియు మెస్సీయ వంటి అనేక పేర్లు మరియు శీర్షికల అర్ధాలను వివరించడమే కాకుండా, అతను అనేక సందర్భాల్లో క్రీస్తు యొక్క అర్థాన్ని కూడా చెప్పాడు, అందులో అతడు తనను వినువారిచే తప్పుగా గ్రహించబడ్డాడు మరియు అతని చరిత్రను చదివేవారు కొన్నింటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.
రెండవ అధ్యాయంలో, యూదులు యహూషువఃతో ఇలా అన్నారు: “కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా; యహూషువః ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు తమ సమాధానం ప్రకారం, ఆలయం గూర్చి ఆయన ఉద్దేశించిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని పూర్తిగా నిరూపించారు. వారి తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని అప్పుడు యహూషువః భావించలేదు. కానీ పాఠకులు క్రీస్తు అర్థాన్ని గౌరవించకుండా ఉండకూడదని, యోహాను ఇలా వివరించాడు: “అయితే ఆయన తన శరీరమను దేవాలయమును గూర్చి యీ మాట చెప్పెను." (18-21 వచనాలు).
6:64 వచనంలో, యహుషువ తన ప్రేక్షకులతో ఇలా అన్నాడు, “మీలో విశ్వ సించనివారు కొందరున్నారని” వారితో చెప్పెను. యోహాను ఇలా వివరించాడు: “విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యహూషువఃకు తెలియును”.
యోహాను 7:38, 39: “నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
ఈ రూపక భాషలో, యోహాను గమనిస్తాడు, “తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యహూషువః ఇంకను మహిమ పరచబడలేదు [అనగా, లేచిన క్రీస్తు నుండి ఇవ్వబడలేదు], గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి యుండలేదు.
యోహాను సువార్త 11:11,12,13: ఆయన యీ మాటలు చెప్పిన తరువాత, “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా.” శిష్యులు “ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి”. యోహాను ఇలా వివరించాడు: “యహూషువః అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.”
యోహాను 12:32: యహూషువః “నేను భూమి మీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.” అప్పుడు యోహాను ఇలా చెప్పెను, తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.
యోహాను 13:10, 11: తన శిష్యుల పాదాలను కడుగుతున్నప్పుడు, “మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. ఈ వ్యాఖ్యకు కారణాన్ని యోహాను చెప్పారు: “తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.
యోహాను 21:18: యహూషువః పేతురుతో ఇలా అన్నాడు: “నీవు యౌవనుడవైయుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను." ఇక్కడ యోహాను ఇలా జతచేస్తున్నాడు, “అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను.”
ముందు ప్రస్తావించబడిన అధ్యాయంలో, యోహాను ఇలా వివరించాడు, “పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యహూషువఃను అడిగెను. యహూషువః నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమనెను.” ప్రశ్న మరియు సమాధానాన్ని వివరించి, యోహాను జరిగిన పొరపాటును ఇలా పేర్కొన్నాడు మరియు సరిదిద్దాడు: “కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యహూషువః అతనితో చెప్పలేదు గాని నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.
ఇప్పుడు క్రీస్తు తన యహువః పై ఆధారపడుతున్నట్లు లేదా స్వయం సమృద్ధిని నిరాకరిస్తున్నట్లు ప్రత్యక్ష రూపంలో ఎంత తరచుగా ప్రకటించాడు — మరియు క్రీస్తు తనకుతానుగా యహువః కాదనే నమ్మకానికి అనుగుణంగా అలాంటి భాష ఉపయోగించబడిందని యోహానుకు ఎంత ఖచ్చితంగా తెలుసి ఉండాలి. యోహాను ఎందుకు ఈ విధంగా వివరణ ఇవ్వలేదు, అనగా "ఈ విషయాలు మాట్లాడినప్పుడు క్రీస్తు తన మానవ స్వభావం గురించి మాత్రమే మాట్లాడాడు కాబట్టి తాను దేవుడనే విషయాన్ని చెప్పలేదు అని ఎందుకు వివరణ ఇవ్వలేదు? అని మనం అడగవచ్చు.” క్రీస్తు స్వతంత్ర వ్యక్తి లేదా జీవి అని యోహానుకు తెలిసి ఉంటే లేదా విశ్వసించినట్లయితే, అటువంటి వివరణ ఇప్పుడు తన సువార్తలో కనుగొనబడిన దానికంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉండాలని కూడా అతనికి తెలిసి ఉండాలి. అతను త్రిత్వ బోధ ప్రకారం ఉన్నట్లయితే, ఆధునిక కాలాల మాదిరిగానే, అతడు క్రీస్తు యొక్క వ్యక్తిగత మరియు సంపూర్ణ పరాధీనతను వివరించే సాక్ష్యాలను కొంత వివరణతో తటస్థీకరించడానికి ప్రయత్నించకుండానే విడిచిపెట్టేవాడు కాదు. యోహాను క్రీస్తును యహువఃగా పరిగణించినట్లయితే, అతనిని ఆశ్రిత జీవిగా సూచిస్తూ మరియు తన సమృద్ధిని తండ్రి నుండి పొందాడు అనే వంద భాగాల ద్వారా తాను ఏమి అర్థం చేసుకున్నాడో చెప్పడంతో పోలిస్తే, లాజరు యొక్క నిద్ర లేదా ఆయన మూడు రోజులలో కట్టబోయే దేవాలయం ద్వారా క్రీస్తు అంటే ఏమిటో వివరించడానికి అతనికి ఎంత తక్కువ ప్రాముఖ్యత కనిపించి ఉండేది!
నా త్రిత్వ స్నేహితుల నీతి నిజాయితీలను ప్రశ్నించడం నా హృదయాలోచన కాదు. అయినప్పటికీ, మన ప్రభువు మాటల గురించిన వారి వివరణ ఇతర వ్యక్తి యొక్క స్వభావాన్ని నాశనం చేసే విధంగా సందేహాస్పదమైన మరియు మోసపూరితమైన భాషను ఉపయోగించే అలవాటును కలిగి ఉందని వారు చూడకపోవుటను చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను. ఆయన స్వతంత్ర వ్యక్తి అయితే, యోహాను చెప్పిన, నమోదు చేసిన అనేక విషయాల కంటే వేరుగా తాను అబద్ధం మరియు మోసపూరితంగా ఏ భాషను ఉపయోగించగలిగి ఉండేవాడో నాకు తెలియదు. అయినప్పటికీ, ఈ భాషను యహూషువః స్వయంగా వివరించలేదు, లేదా అతని శ్రద్ధగల మరియు స్నేహపూర్వక శిష్యుడు వివరించలేదు. స్వయంగా లేదా యోహాను ద్వారా అది అంతగా తెలియజేయబడలేదు, తన పరాధీనత గురించి మాట్లాడేటప్పుడు, మోషే అదే భాషని ఉపయోగించడంలో చేసినట్లుగా అతను తన మొత్తం వ్యక్తి గురించి చెప్పలేదు. ఆయన యథార్థతను పణంగా పెట్టి తన స్వాతంత్య్రాన్ని దేవుడిగా నొక్కిచెప్పడం మెస్సీయను అగౌరవించే పద్ధతి కాదా? అయినప్పటికీ ఇది అతని త్రిత్వ శిష్యులచే చాలా గొప్ప సాహసంతో చేయబడినట్లు కనిపిస్తుంది. అయితే త్రిత్వ విశ్వాసం గల ఏ వ్యక్తైనా తన పెదవులలో, ఎలాంటి మోసపూరితమైన నైజం లేని యహూషువఃకు ఈ సిద్ధాంతాన్ని ఆపాదించినట్లుగా, వివరణ లేకుండా, అటువంటి మోసపూరిత భాషను తరచుగా ఉపయోగించడంలో తాను సురక్షితంగా ఉంటానని తనకు తాను అనుకోగలడా? ఒక మంచి మనిషి అలాంటి పద్ధతిని అవలంబించాలనే ఆలోచనవద్ద భయంతో కుంచించుకుపోతాడని నేను చెప్పలేదా?
నెం. 4. త్రిత్వ వివరణ అతని స్వంత పరికల్పనకు అనుగుణంగా లేదు.
నేను ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేయవచ్చు. ఒక కోణంలో త్రిత్వవాదులు వాదించినట్లు యహూషువః క్రీస్తు తనకుతానుగా స్వతంత్ర దేవుడైతే, తండ్రిపై ఆధారపడే అతని ప్రకటనలు ఖచ్చితమైనవి కావు. వారి పరికల్పన ఏమిటంటే, మానవ స్వభావం తండ్రితో ఐక్యమైందని కాదు, కానీ రెండవ వ్యక్తి, తండ్రి వలె స్వతంత్రంగా ఉన్నాడు. ఇప్పుడు, స్వీయ-సమృద్ధి అనేది వ్యక్తిగతంగా ఆధారపడే అవకాశాన్ని నిరోధిస్తుందని ఎవరు చూడలేరు? క్రీస్తు వ్యక్తిగతంగా స్వయం సమృద్ధిగా ఉన్నట్లయితే, అతని మానవ స్వభావానికి మరొక వ్యక్తి నుండి సహాయం ఎలా అవసరమవుతుంది? అయినప్పటికీ క్రీస్తు తండ్రిపై తన ఆధారాన్ని నొక్కి చెప్పాడు. "నా మానవ స్వభావము తనంతట తానుగా ఏమీ చేయజాలదు, అయినను నేను దేవునిగా ఆ పని చేస్తాను" అని ఆయన చెప్పలేదు. కానీ తనను తాను వేరైన, ఒంటరి వ్యక్తిగా, మెస్సీయగా, యహువః కుమారునిగా చెప్పుకుంటూ, "నా అంతట నేనే ఏమీ చేయలేను" అని చెప్పాడు. "నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు." "తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు." "నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను...”
క్రీస్తు తండ్రిగా, స్వయం సమృద్ధిగా మరియు స్వతంత్రంగా ఉంటే అటువంటి ప్రకటనలు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందా? క్రీస్తు తన శిష్యులు తనను దైవంగా భావించుకోకుండా తమను రక్షణలో ఉంచడం అనేది క్రీస్తు యొక్క ప్రత్యేక విషయం అయితే, అటువంటి ఉద్దేశానికి అనుగుణంగా అతడు ఇంతకంటే ఏ భాషను ఉపయోగించగలడో నాకు తెలియదు. “నేను దేవుణ్ణి కాను, యహువఃపై ఆధారపడ్డ కుమారుడిని మరియు రాయబారిని” అని ఆయన చెప్పినట్లయితే, త్రిత్వ వాదులు ఇప్పటికీ “అతడు తన మానవ స్వభావం గురించి మాత్రమే మాట్లాడాడు” అని చెప్పవచ్చు.
మరొక ప్రశ్న తలెత్తుతుంది. మెస్సీయ వ్యక్తిగతంగా సజీవుడైన దేవుడైతే, వేరొక వ్యక్తిపై తన మానవ స్వభావం ఆధారపడటం గురించి అతను ఏ సందర్భం లేదా ఉద్దేశ్యంలో మాట్లాడవలసి ఉంటుంది? అతని మానవ స్వభావంలోని అన్ని లోపాలు మరియు కోరికలను తీర్చడానికి అతని అనంతమైన జ్ఞానం మరియు సర్వశక్తి సరిపోలేదా? అంతేకాకుండా, అతను తన మానవ స్వభావం యొక్క “ఆధారపడటం” గురించి మాట్లాడటానికి ఏ ఉద్దేశ్యం కలిగి ఉండవచ్చు, అది అతని మొత్తం వ్యక్తి యొక్క ఆధారపడటాన్ని సూచిస్తుందా? అతను ఆశ్రితుడా లేదా స్వతంత్ర వ్యక్తా అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ రోజు అతని అన్ని తెగల/సిద్ధాంతాల స్నేహితులు దీనిని వీక్షించారు. ఇది మెస్సీయ మరియు అతని అపొస్తలులచే పరిగణించబడలేదు. అలాంటప్పుడు, మానవాళికి చాలా తీవ్రమైన మరియు ఆసక్తికరమైన విషయంపై, అతడు అలవాటైన భాషలో చాలా సందేహాస్పదంగా, మోసపూరితంగా, తెలిసినవారిని మరియు తెలియనివారిని తప్పుదారి పట్టించేలా (పూర్తిగా స్వీకరించేలా) మాట్లాడగలిగితే, ఇతర విషయాలను గూర్చి అతను చెప్పేదానిపై ఎలాంటి విశ్వాసం ఉంచబడుతుంది? "నా అంతట నేనేమీ చేయలేను" అని అతను పదే పదే చెప్పగలిగితే, (వాస్తవానికి, అతను తనంతట తానుగా ప్రతిదీ చేయగలిగియుండియు అలా చెబితే), అతడు తన మాటలు సహజంగా తెలియజేసే దానికి నేరుగా వ్యతిరేకమైన దాగి ఉన్న అర్థాన్ని చెప్పలేదనడానికి మనకు ఏ సాక్ష్యం ఉంది? నా దృష్టిలో, ప్రస్తుత పరిశీలన ప్రకారం, మెస్సీయ యొక్క సహజ గౌరవం స్థానంలో చాలా తీవ్రమైన విషయం ప్రవేశించి ఉంది — అంటే, అతని నైతిక దయ, అతని నిజాయితీ, అతని ధర్మగుణము మరియు యహువః నుండి పంపబడిన గురువుగా అతని యథార్థత స్థానంలో.
నెం. 5. రెండు ముఖ్యమైన లేఖనాలు పరిగణించబడ్డాయి.
సిలువ వేయబడటానికి కొంచెం ముందు క్రీస్తు మరియు అతని అపొస్తలుల మధ్య ఆప్యాయతతో కూడిన సంభాషణలో, "మీరు నన్ను ప్రేమించి, నేను యహువః యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు." అని చెప్పాడు. వెంటనే తన ప్రార్థనలో, అపొస్తలుల గురించి మాట్లాడుతున్నప్పుడు, క్రీస్తు తండ్రితో ఇలా అన్నాడు, “నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు.
ఈ వాక్యాలు క్రైస్తవుల ప్రాముఖ్యమైన శ్రద్ధకు అర్హమైనవి. క్రీస్తు “యహువః యొద్దనుండి వచ్చాడు” అని తెలుసుకోవడం మరియు “యహువః అతనిని పంపాడని నమ్మడం” అనేది మరియు క్రీస్తు దేవుడని, తండ్రితో సమానమని తెలుసుకోవడం మరియు అతను స్వతంత్ర జీవి అని నమ్మడం చాలా భిన్నంగా ఉండాలి. ఇది త్రిత్వ వాదులచే అంగీకరించబడాలి, ఎందుకంటే వారు ఏకదైవవాద విశ్వాసాన్ని మతబ్రష్ఠమని లేదా లోపము గలదని విమర్శించారు. అయినప్పటికీ, క్రీస్తు "యహువః యొద్దనుండి వచ్చియున్నాడని" మరియు యహువః ద్వారా పంపబడ్డాడని వారు నిజంగా నమ్ముతారు. అయితే, క్రీస్తు తన ప్రార్థనలో తన అపొస్తలుల విశ్వాసాన్ని "నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక" అని చెప్పడంలో వారి విశ్వాసాన్ని ఆమోదించారని నేను భావిస్తున్నాను — పైగా ఈయనే సజీవ దేవుడు అని వారు ఎప్పుడైనా విశ్వసించినట్లుగానీ లేదా ఎప్పటికైనా విశ్వసించునట్లుగానీ కనీస సమాచారం కూడా లేదు.
మొదట ఉల్లేఖించిన భాగంలో, క్రీస్తు వారి పట్ల యహువఃకు ఉన్న ప్రేమ గురించి గంభీరమైన హామీని ఇచ్చాడని మరియు వారు యహువఃకు ఎందుకు అంత ప్రియమైనవారో స్పష్టంగా చెప్పారని నేను మరింత వ్యాఖ్యానించగలను. "నేను దేవుడనని మరియు అతనితో సమానమని మీరు విశ్వసించారు కాబట్టి తండ్రి మిమ్మును ప్రేమిస్తున్నాడు" అని ఆయన చెప్పలేదు - కానీ ఆయన మాటలు ఇవి: "మీరు నన్ను ప్రేమించి, నేను యహువః యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.” క్రీస్తు యహువః కాదని తండ్రి ద్వారా నియమించబడిన మరియు పంపబడిన "యహువః యొద్దనుండి వచ్చిన" ప్రియమైన కుమారుడని విశ్వసించే వారందరిపై అనేకమైన మరియు భయంకరమైన దూషణలను విన్న తరువాత; ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి వచనం లాంటిది బైబిల్లో దొరుకుతుందని ఎవరు ఊహించారు? అపొస్తలుల పట్ల యహువఃకు ఉన్న ప్రేమను ఆమోదించే విషయంలో క్రీస్తు తప్పు చేయనట్లయితే, యహువఃకు మరియు చాలా మంది త్రిత్వవాదులకు మధ్య ఖచ్చితంగా అభిప్రాయ భేదం మరియు భావనలో గణనీయమైన తేడా కనిపిస్తుంది. యహువః మరియు అతని కుమారుని ద్వారా ఆమోదించబడిన విశ్వాసం, మెస్సీయాను గూర్చిన వారి దృక్కోణాలలో వారు నిజమైన సనాతనవాదులని భావించే అనేకమంది త్రిత్వవాదులచే దూషించబడుతుంది.
“యహువః నుండి వచ్చాడని అపొస్తలులు విశ్వసించినది కేవలం మానవ స్వభావాన్ని మాత్రమే” అని చెప్పడం ఇక్కడ ప్రయోజనకరం కాదు.” క్రీస్తు పట్ల వారికున్న ప్రేమ మరియు ఆయన యహువః యొద్దనుండి వచ్చాడనే వారి విశ్వాసం మాత్రమే దీనికి కారణం. "తండ్రి స్వయంగా మిమ్మును ప్రేమిస్తున్నాడు" అని చెప్పబడింది. అంతేకాకుండా, క్రీస్తు "యహువః యొద్దనుండి వచ్చాడు" అని నమ్మడం అనేది వచనంలో పేర్కొన్న విశ్వాసం యొక్క ఏకైక పదార్థము. క్రీస్తు స్వతంత్ర దేవుడనే సిద్ధాంతం సత్యమైనా అసత్యమైనా, అపొస్తలులకు తండ్రి ప్రేమను అందించిన విశ్వాసం మాత్రం ఈ సిద్ధాంతంలో ఖచ్చితంగా లేదు.
ఇది నోహ్ వోర్సెస్టర్, D.D., 1827లో వ్రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.