ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
1 కొరింథీయులు 15 మరియు థెస్సలోనీయుల అనుబంధంలో ప్రదర్శించినట్లుగా, పౌలు తన నిరంతర బోధనలో, మరణం నుండి పునరుత్థానం యుగయుగాలలో ఉన్న ప్రతి భక్తుని నిరీక్షణకు మరియు ఓర్పుకు గల అంతిమ మరియు ఏకైక ఆధారమని స్పష్టంగా తెలియజేసాడు. భవిష్యత్తులో విశ్వాసుల యొక్క పునరుత్థాన దినాన, ప్రభువైన యహూషువః క్రీస్తు పరలోకం నుండి దిగి వస్తాడు. క్రీస్తునందుండి మరణించినవారు లేపబడుదురు మరియు "ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు." (కొలస్స. 3:4). అదే సమయంలో జీవించి ఉన్న క్రైస్తవులందరూ వారిని ఆకాశంలో కలుసుకుంటారు (1 థెస్సలోని 4:13-18). “రెప్పపాటులో” ప్రతి భక్తుని శరీరం అక్షయతను ధరించుకొనును. వారు ఆత్మీయమైన, శక్తివంతమైన, మహిమగల, పరలోక వ్యక్తులుగా లేపబడుట ద్వారా అమర్త్యతను ధరించుకుంటారు (1 కొరింథీ 15:42-44, 51-54).
ఈ అద్భుతమైన సంఘటనలు “ఆయన రాకడ సమయంలో” (1 థెస్స. 5:23; 1 కొరిం. 15:23), “తగిన సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు” (1 తిమో. 6:14-15), “అంత్య దినాన” (యోహాను 6:40) "మృతుల పునరుత్థాన దినాన" సంభవిస్తాయి (యోహాను 5:29). కాబట్టి "యహూషువః క్రీస్తు యొక్క ప్రత్యక్షత" కొరకు (1 పేతురు 1:5, 7, 13; రోమా. 8:18-19; 1 కొరిం. 1:7) "మనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము" (ఫిలిప్పీ 3:20), ఆయన "కనిపించు దినం" కోసం, (1 తిమో. 6:14; తీతు. 2:13; 1 యోహాను 3:2-3), భూమిపై తన రాజ్యాన్ని స్థాపించుటకు మహిమ గల అతని రాకడ (పరోసియా) కోసం ఎదురుచూస్తున్నాము.
నీతిమంతులు “ఆయన ప్రత్యక్షమైనప్పుడు... ఆయన రాకడయందు ఆయనవలె ఉందురు” మరియు క్రీస్తును “ఆయన ఉన్నట్లు” చూచెదరు (1 యోహాను 2:28; 3:2). మరణించిన నీతిమంతులు ఆయన రాకడకు ముందే పరలోకంలో ఉన్నట్లయితే, భవిష్యత్తులో ఆయన తిరిగి వచ్చునప్పుడు, క్రీస్తును వారు “ఆయన ఉన్నట్లు” చూస్తారని చెప్పుచూ యోహాను తప్పుగా మాట్లాడుతున్నట్లే కదా. పరిశుద్ధులు పునరుత్థాన దినాన "కడ బూర" సమయంలో మహిమ శరీరాలను పొందినప్పుడు మాత్రమే క్రీస్తులా ఉంటారు (ఫిలి. 3:20-21; 1 కొరి. 15:50-55). అలా "క్రీస్తు వలె" మారని వారందరూ రాజ్యాన్ని పొందలేరు (50వ వచనం చూడండి). కాబట్టి, మరణించిన వెంటనే ఎవరూ “పరలోకం”లోకి ప్రవేశించలేరు, అయితే భవిష్యత్తులో క్రీస్తు తన మహిమతో ప్రత్యక్షమయ్యే దినాన రాజ్య ప్రవేశం కోసం వేచి ఉంటారు. అప్పుడు మొట్టమొదటిసారి సమస్త యుగాల నుండి రక్షణ పొందినవారందరూ యహూషువఃపై దృష్టి ఉంచుతారు, అంతకంటే ముందు కాదు.
అలా అంత్యక్రియల సమయంలో చదివి వినిపించే మరియు పునరావృతమయ్యే ప్రసిద్ధిగాంచిన విధానం అత్యంత తప్పుదారి పట్టించేదిగా ఉంది. బైబిలు మనలను విశ్వసించమని ప్రోత్సహిస్తున్న "దైవిక కార్యం యొక్క బైబిలు అవగాహనను" ఇది నిరుత్సాహపరుస్తుంది!
సాంప్రదాయం పునరుత్థాన దినం యొక్క దృశ్యం నిజంగా అసహ్యకరమైనది, ఇక్కడ నీతిమంతుల యొక్క "ఆత్మలు" పరలోకం నుండి యహూషువఃతో పాటు వస్తాయని మరియు అందే సమయంలో ఆ ఆత్మల యొక్క భూసంబంధమైన శరీరాలు సమాధుల నుండి లేస్తాయని చెప్పబడుతుంది. ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే, "ఆత్మలు" వాస్తవానికి ఆయన కంటే ముందుగా బయలుదేరి, దేహాలు సమాధుల నుండి బయటకు వచ్చుటకు ముందు వాటిలోనికి ప్రవేశించాలి! ఇది ఎలా జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడానికి సంప్రదాయం బాధ్యత వహించాలి. కాబట్టి, ఆ సంప్రదాయం అది మాట్లాడే వాక్యం ద్వారా, జనాదరణ పొందిన మరియు అధికారిక మార్గం ద్వారా మరియు వ్రాతపూర్వకంగా (ప్రతి సాధ్యమైన మార్గాల ద్వారా) దీనిని నిర్ధారణ చేయుటకు ప్రయత్నించింది.
దీనికి పూర్తి విరుద్ధంగా, తమ ప్రియమైన వారిని కోల్పోయిన థెస్సలొనీకలోని విశ్వాసుల మనసులను తేలిక పరుచుటకు పౌలు వ్రాస్తూ, భవిష్యత్తు పునరుత్థాన దినాన ప్రభువైన యహూషువః క్రీస్తు ఒంటరిగా "ప్రధాన దూత శబ్ధముతో పరలోకం నుండి దిగివచ్చునని మరియు నీతిమంతులు సమాధుల నుండి లేచి ఆయనను ఆకాశంలో ఎదుర్కొనెదరు అని చెప్పాడు.” (1 థెస్స. 4:16-17). మనం "ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకోవాలి" అని పౌలు కోరుకున్నాడు (18వ వచనం).
రాజ్యంలోని పరిస్థితుల గురించి యహూషువః మాట్లాడినప్పుడు (లూకా 20:34-36), "పునరుత్థాన సమయంలో" (మత్తయి 22:30) పునరుత్థానమైన వారిలో ఏమి జరుగుతుందో వివరించాడు. జనాలు అనుకుంటున్నట్లుగా మరణం విశ్వాసులను "పరలోకానికి" తీసుకువెళితే, ప్రభువు వారిని "పునరుత్థానమైనవారు" అని ఎందుకు పిలుస్తున్నాడు? పునరుత్థానం మరియు తీర్పు అనేవి దేహరహిత ఆత్మగా "పరలోక" ఉనికి కలిగియున్న తర్వాత ఏర్పడే చిన్న అంతరాయం తప్ప మరేమీ కానట్లయితే ఇది పూర్తిగా అర్థరహితంగా ఉంటుంది.
మరణం, తీర్పు, ప్రతిఫలం మరియు పునరుత్థానాలను గూర్చిన జనాదరణ పొందిన దృక్పథాన్ని లేఖనాల యొక్క స్పష్టమైన వచనాలతో పోల్చి చూసినప్పుడు అది నిరాశాజనకంగా గందరగోళంగా కనిపిస్తుంది.
సత్క్రియలకు ప్రతిఫలం క్రీస్తు భవిష్యత్తు రాకడలో "నీతిమంతుల పునరుత్థాన సమయంలో" (లూకా 14:14), ఇవ్వబడుతుంది. అయితే, పరిశుద్దులు పునరుత్థాన దినానికి ముందే శతాబ్దాలు తరబడి "పరలోకాన్ని" అనుభవిస్తూ ఉంటే, ఇక ఏ ప్రతిఫలం అందించబడుతుంది? పౌలు పునరుత్థానాన్ని పొందాలని ఆశించాడు (అపొస్తలుల కార్యములు 23:6; 24:15; ఫిలిప్పీ 3:11). పౌలు తన మరణానంతరం "పరలోకాన్ని" పొందుకొని మరియు పునరుత్థాన దినానికి ముందే క్రీస్తుతో పాటు పరలోకంలో నివసించినట్లయితే, తన పై ప్రకటన తప్పుతుంది కదా.
యహూషువః భూమి పైనుండి ఆరోహణమైన తరువాత (అపొస్తలుల కార్యములు 1:11), ఇద్దరు దేవదూతలు కనబడి ఆయన వెళ్లిన రీతినే మరల తిరిగి వస్తాడనే వాస్తవం వైపు అపొస్తలుల దృష్టిని మళ్లించారు. (రెండవ రాకడ 1914 లో జరిగిందనే యెహోవాసాక్షుల వాదన స్పష్టంగా అబద్ధం.) మన ప్రభువు భవిష్యత్తులో తిరిగి వచ్చినప్పుడు సమాధుల నుండి పరిశుద్ధులను మేల్కొలుపుట అనే అంశం యుగయుగాలుగా ఉన్న భక్తులందరి యొక్క నిరీక్షణ మరియు ఓర్పు యొక్క ధృవతార. కానీ మరణం మరియు పునరుత్థాన దినం మధ్యగల విరామంలో విశ్వాసులు పరలోకంలో యహూషువఃతో నివశించుదురనే సాంప్రదాయం ద్వారా ఈ దృశ్యం ఆటంకపరచబడింది మరియు పట్టాలు తప్పింది. జనాదరణ పొందిన ఈ దృక్పథం అసంబద్ధంగా ఉంది. చాలామంది దీని గురించి ఆలోచించలేదు.
తన పరిచర్య ముగింపులో, యహూషువః తన శిష్యులకు భవిష్యత్తు స్థలాన్ని సిద్ధం చేయుటకు వెళ్తున్నట్లు చెప్పాడు (యోహాను 14:2; కీర్తనలు 115:16). అంతకుముందు, "నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరు" (యోహాను 13:33) అని ఆయన వారితో చెప్పాడు. ఆయన ఈ ప్రకటనను మృదువుగా చేసాడు, నేను మరల వచ్చి "నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును" (యోహాను 14: 3) అని వారికి హామీ ఇచ్చాడు, అప్పుడు తానున్న స్థలమునే వారును ఉందురు. స్పష్టంగా, శిష్యులు యహూషువః వద్దకు వెళ్లలేకపోయారు. బదులుగా ఆయనే పునరుత్థాన దినాన వారి వద్దకు వస్తాడు. భక్తులు మరణానంతరం తక్షణమే పరలోక నివాసాన్ని కలిగి ఉంటే, ఆయన మరలా భూమిపైకి రావడం దేనికి? వారు ఇప్పటికే తనతో ఉన్న స్థలానికి “వారిని స్వీకరించుట” యహూషువఃకు అసాధ్యం! కొత్త నిబంధనను చాలా గందరగోళంగా మరియు అస్థిరంగా మార్చే పథకంతో యహూషువః ఎంత సంతోషిస్తాడు?
మరణించిన నీతిమంతులకు మరణం నుండి పునరుత్థానం (క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, కేవలం అప్పుడు మాత్రమే) విషయంలో ఆందోళన లేనట్లయితే, యోహాను మరియు ప్రకటన గ్రంథ పాఠకులను ఆ విషయంలో ధైర్యపరుస్తూ మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు క్రీస్తు స్వాధీనములో ఉన్నవని (ప్రకటన 1:18) చెప్పుటలో ఎటువంటి ఉపయోగం ఉండదు. మరణం నుండి బయటకు వచ్చుటకు ఒకే ఒక మార్గం ఉంది, అది మొత్తం మనుష్యుల యొక్క పునరుత్థానం. దావీదు మరియు యహూషువః "మరణ నిద్ర" గురించి మాట్లాడుటలో ఆశ్చర్యం లేదు (కీర్తనలు 13:3; యోహాను 11:11, 14). ఇది (ఈ నిద్ర) మరణం మరియు పునరుత్థానం మధ్యగల నిజమైన మధ్యంతర సమయం. నిద్ర అనేది అపస్మారక స్థితి. బైబిల్ విశ్వాసంపై ప్లేటోనిక్ తత్వశాస్త్రం యొక్క భయంకరమైన ప్రభావాలు ఎంత వికలాంగంగా ఉన్నాయి? ప్లేటో మరియు యహూషువఃలను ఎప్పుడూ కలపకూడదు.
బలహీనమైన మరియు మర్త్యమైన మనందరికీ అమరత్వము, శాశ్వతంగా మరణం లేకుండా ఉండుట, నాశనం లేని జీవితం కోసం తపన అనేవి మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి! చక్కనైన పదాలలో క్రైస్తవ విశ్వాసాన్ని గూర్చి పౌలు వ్రాశాడు. సువార్తను విశ్వాసించుటలోని మొత్తం సారాంశం ఏమిటంటే, “సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును” (రోమీయులకు 2:7).
సువార్తలో బయలుపరచబడిన నిత్యజీవాన్ని (2 తిమో. 1:10) మనం వెతకాలి మరియు అది అంతము వరకు పట్టుదలతో ఉన్నవారికి ఇవ్వబడుతుంది (మత్త. 24:13; రోమా. 13:11). యహూషువః తిరిగి వచ్చినప్పుడు మాత్రమే నిత్యజీవం అనే బహుమానం అందించబడునని మనము ఎదురుచూచు చున్నాము, అయినప్పటికీ యహువః యొక్క ఆత్మ ద్వారా నిరీక్షణ ద్వారా ఇప్పటి జీవితంలో కూడా దానిని రుచి చూడవచ్చు.
ఇది స్టాన్ పహెర్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.