చంద్రుడు ఎప్పుడు సృష్టించబడెను? దినము నిజంగా అవసరమా?
సృష్టికర్త కేలండరు, లేఖనాల్లో పేర్కొన్నట్లుగా చంద్రుని మరియు సూర్యునిపై ఆధారపడియుంటుంది. నిజమైన కేలండరుకు ఆదరణ ఎలాగైతే పెరుగుతుండెనో, దీనికి వ్యతిరేకంగా వెర్రి వాదనలు కూడా అలాగే పెరుగుతుండెను. చంద్రుడు వాస్తవానికి ఎప్పుడు సృష్టించబడెను మరియు అది పరలోకం యొక్క ఖచ్చితమైన సమయపు కొలమానిగా ఉండునట్లు దాని సామర్థ్యంను ఎలా ప్రభావితం చేస్తుంది? మనం ఆదికాండములో ఉంచబడిన జ్ఞానాన్ని, నమూనాను నిజాయితీగా నమ్మవచ్చా? మనం కనుగొందాం.
ఇంట్లో బందీలవలె విసుగు చెందిన పిల్లలను ఒక సరదా వర్షపు రోజున వారికి కొంత ఆనందాన్ని నింపుటకు ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళవలసి వచ్చినప్పుడు .... అలెక్స్ మరియు సోఫియాలను వారి తల్లిదండ్రులు తమ పాత వ్యాగన్ లో ఎక్కించుకొని ఒక పెద్ద కార్ల కంపెనీలోనికి, విడి భాగాల అమరిక విధానమును మరియు కార్ల తయారీ విధానమును తిలకించుటకు వెళ్ళిరి. ముందుగా తయారైన విడి భాగాలను మరియు చక్రాలను నిల్వ ఉంచే పెద్ద గిడ్డంగులలోనికి ఆ కుటుంబం ప్రవేశించింది. అతిపెద్ద మరియు చాలా సాంకేతికమైన కార్ల కర్మాగారంలోనికి ప్రవేశించడం వలన, వారు పెద్ద పెద్ద రోబోట్లు మరియు ఖచ్చితంగా పనిచేయు కార్మికులు కొన్ని బేసి ఆకార భాగాలతో పనిచేయుచు, నెమ్మదిగా, కానీ క్రమపద్ధతిలో ఒక కారును రూపించుటకు ప్రతి భాగంను అనుసంధానం చేయుటను విస్మయంతో వీక్షించారు. ప్రతి క్రొత్త భాగాన్ని దాని యొక్క స్థానంలో అమర్చుచుండుటతో, అలెక్స్ మరింత ఆతృత చెందాడు. తన బొమ్మ కార్లు మరియు ట్రక్కులలోని తనకు ఇష్టమైన భాగం, వాటిని వంటగది అంతటా వేగంగా పరుగెత్తేలా చేసే రబ్బరు చక్రాలు. అలెక్స్ తన తండ్రిని అడిగాడు, "కానీ చక్రాలు ఎక్కడ ఉన్నాయి”? ఈ కార్లు ఎక్కడికైనా ఎలా వెళతాయి?. “కొంచెం ఓర్పుతో ఉండుము”, తన తండ్రి స్పందించాడు. “రూపకర్తలు సమస్త విడి భాగాల విషయంలో ఒక ప్రణాళికను మరియు నిర్దిష్ట సమయమును కలిగి ఉంటారు. వాటి యొక్క సమయం వచ్చినప్పుడు అవి తప్పకుండా జోడించబడతాయి.” అలెక్స్ కు ఇంకా నమ్మకం కుదరలేదు. అతని కంటికి చక్రాలు చాలా ముఖ్యమైనవి. అతడు అమరిక విభాగపు చివరి వరుస వరకు చూపించమని తన కుటుంబాన్ని ఉత్సాహంగా కోరాడు. అమరిక విభాగపు చివరిన గల కటకటాల వరకు బాగుగా చూడవచ్చుననే అభిప్రాయంతో సోఫియా మరియు అలెక్స్ ఇద్దరూ వారిని పైకి ఎత్తాలని కోరారు. అక్కడ అవి ఉన్నవి! సుందరమైన, మెరిసే కొత్త కార్లు అమరిక విభాగపు వరుసనుండి . . . చక్రాలపై దొర్లుకుంటూ వాచ్యంగా బయటకు వచ్చుచున్నవి. "చక్రాలు!" అలెక్స్ ఆశ్చర్యపడెను. చివరకు వాటిని చూడగానే తనకు చాలా ఉపశమనం కలిగింది. మరియు “ఏమిటో ఊహించండి?" వారి తల్లిదండ్రులు చిరునవ్వుతో అడిగిరి. "ఆ కారు మనదే!" అలెక్స్ మరియు సోఫియా ఆనందంతో కీచుమని అరిచిరి! వారి సొంత కొత్త కారు తయారవుటను వాస్తవంగా చూడటం ఎంత ఉత్తేజాన్నిస్తుంది! వారు ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేరు.
ఈ కథలో, రూపకర్తలను నమ్మే విషయంలో అలెక్స్ ఎలా ఆందోళన చెందుతున్నాడో మనం చూస్తున్నాం. అతనికి, మొదటిగా చక్రాలు వచ్చుట కావాలి; అయితే, రూపకర్తలు స్పష్టంగా ఒక ప్రణాళికను మరియు కారును సృష్టించుటకు ఒక క్రమమును కలిగి ఉంటారు. భూమిపై ఇంజనీర్లే కారును నిర్మించుటకు సమర్ధవంతంగా రూపకల్పన చేస్తే, సృష్టి వారములో మన పరలోకపు తండ్రి వేసిన ప్రణాళికను మరియు నమూనాను ఎంత ఎక్కువ విశ్వసించాలి?
సృష్టికర్త యొక్క సూర్య-చంద్ర కేలండరుకు వ్యతిరేకంగా ఒక ప్రముఖ వాదన ఉంది, అది సృష్టి యొక్క 4 వ రోజు వరకు చంద్రుడు సృష్టించబడలేదు లేక కనీసం నిర్దేశించబడలేదు1, కావున ఇది సృష్టికర్త కేలండరులో ప్రత్యేకమైన పాత్రను పోషించదు, ముఖ్యంగా వారాల చక్రం విషయంలో. సంశయవాదులు కంగారుగా ఈ ప్రతిపాదనను సూర్య-చంద్ర కేలండరుకు వ్యతిరేకమైన "ఋజువుగా" చూపిస్తున్నప్పటికీ, ఒక నిశితమైన పరిశీలన ఈ వాదన యొక్క లోపమును స్పష్టంగా చూపిస్తుంది.
మన పరలోకపు తండ్రి ఈ అద్భుతమైన విశ్వం యొక్క క్రమానికి, కారణానికి, మరియు పాలక చట్టాలకు సృష్టికర్త. ఆదికాండము యొక్క “సృష్టి వారం” లో నెలకొల్పబడిన అతని వివేచనలో మనము జ్ఞానమును చూస్తాము. ఆయన శూన్యం నుండి సమస్తమును సృష్టించినప్పుడు సరైన సమయంలో మరియు సరైన క్రమంలో ప్రతిదానినీ రూపించెను. మొదటి రోజున ఆయన ఆదాము, హవ్వలను సృష్టించలేదు ఎందుకంటే, వారు “ఫలించి అభివృద్ధిపొంది, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొని; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలవలెను.” మొదటి రోజున వారు లోపరచుకొనుటకు భూమిపై ఏమియు లేదు. భూమి నిరాకారంగాను మరియు శూన్యంగాను ఉండెను. సహజముగా, వారి నివాస స్థలము సృష్టించబడిన తరువాత, అదేవిధంగా వృక్షాలు మరియు జంతువులు కూడా పెరిగి మరియు పునరుత్పత్తి చేయగల విధంగా అవి సృష్టించబడిన తరువాత వారు (ఆదాము, హవ్వలు) సృష్టించబడ్డారు. 1, 2 మరియు 3 వ దినాలలో యహువః యొక్క సృష్టి క్రమమును పరిశీలించి, అవి 4, 5 మరియు 6 వ దినాలతో ఎలా సంబంధం కలిగి వున్నాయో చూద్దాం.
యహువః భూమిపై నివాస స్థలాన్ని సృష్టించి మరియు దానిని నివాస యోగ్యంగా చేసిన తరువాత ఆయన దాన్ని నివాసులతో నింపెనని స్పష్టంగా వివరించబడినది.యహువః …
దినము 1: వెలుగు సృష్టించెను - చీకటిని వేరుపరచెను. మొదటి పగలు మరియు రాత్రి.
దినము 2: భూమిని కప్పియున్న జలాలను విభజించెను. (ఆకాశమును సృష్టించెను).
దినము 3: భూమి మీద జలాలన్నింటినీ ఒక చోట కూర్చి, ఆరిన నేలను సృష్టించెను; గడ్డితోను మరియు పండ్లను ఇచ్చే మొక్కలు, చెట్లతోను భూమిని నింపెను.
సృష్టి యొక్క ఈ సమయంలో, భూమి జీవరాశులను జీవింపజేయుటకు సిద్ధంగా ఉంది. ఆయన అనంతమైన జ్ఞానంతో,యహువః మన అద్భుతమైన ప్రపంచాన్ని చక్కనైన నిర్మాణంతో కొనసాగించాడు.
దినము 4: రెండు గొప్ప జ్యోతులను, సూర్యుని మరియు చంద్రుని, నియమించెను మరియు నక్షత్రాలను వాటి ఖచ్చితమైన స్థానాల్లో ఉంచెను. సమయ గణన మరియు ఆరాధన కాలముల ఏర్పాటు విషయంలో వాటి ఉపయోగం యొక్క ఉద్దేశంను వివరించారు:
"అవి సూచనలను, కాలములను [H4150], దినములను, సంవత్సరాలను సూచించుటకై ఉండునుగాక..." (ఆదికాండము 1:14)
H4150: "Mo'ed [మో’ఎడ్] అనేపదము విస్త్రుతార్ధంలో అన్ని ఆరాధనా సమావేశాలను సూచించును. ఇది ప్రత్యక్షగుడారమునకు సంబంధించినదై వుండెను…... యహువః ఇశ్రాయేలియులకు తన చిత్తమును తెలియజేయుటకు విశేషమైన సమయములయందు ప్రత్యక్షమాయెను. “ఇది యహువః యొక్క ప్రజల ఆరాధనా సమావేశాలకు సాధారణ పదము.” (చూడుము #4150, "Lexical Aids to the Old Testament," Hebrew-Greek Key Word Study Bible, పేజి 1626.)."
ఇక్కడ యహువః నియామక కాలాలను సూచించు జ్యోతులను ఆకాశంలో చక్కగా రూపించెను. ఆకాశంలోని జ్యోతులు ఆరాధన సమయాలను స్థాపించడంతో పాటు మరొక విషయమును కూడా చేస్తున్నట్లు మోషే నమోదు చేస్తున్నాడని గమనించండి,
“పగటిని రాత్రిని ఏలుటకును మరియు వెలుగును చీకటిని వేరుపరుచుటకును.” (ఆదికాండము 1:18)
ఇది 1 వ దినమునందు మొదట దేనిని చేసెనో దానిని స్పష్టంగా తిరిగి చెప్పుచుండెను మరియు తిరిగి నూతనపరచుచుండెను - అది వెలుగును చీకటిని వేరుపరచుట. ఇది ఒక పెద్ద విషయం. ఇక్కడ ఆయన తన కేలండరు యొక్క "కారు చక్రాలను" అమర్చెను, నీవు చూడగలిగిన యెడల. వాస్తవానికి, సూర్యుడు మరియు చంద్రుడు ఇప్పటికే సృష్టించబడియున్నవి మరియు అవి సృష్టికర్త యొక్క సంకల్పంను నెరవేర్చుచుండెను, అది చీకటి నుంచి వెలుగును, రాత్రి నుండి పగటిని (4 వ దినానికి ముందు 24 గంటలు గల మూడు రోజులలో) వేరుచేయుట; అయినప్పటికీ, వాటికి దైవికంగా నియమింపబడిన విధులు 4వ దినాన నక్షత్రాలతో పాటు మరొక్కసారి నిర్వచించబడ్డాయి మరియు నూతనపరచబడ్డాయి. ఈ విషయాలు గ్రంథస్థం చేయబడినప్పుడు మోషే చేత ఉపయోగించబడిన హెబ్రీ పదాలు మరియు పదబంధాలను మీరు పరిశీలించినప్పుడు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
(H6213). (ఈ ప్రాముఖ్యమైన అంశంపై మరింత సమాచారం ఒక క్షణంలో)
దినము 5: సముద్రాలన్నింటినీ జీవరాశితో విస్తారంగా నిండించెను, రెక్కలు గల ప్రతి పక్షితో ఆకాశమును నింపాడు. సృష్టి యొక్క 2వ దినాన ఆయన విభజించిన భాగములను 5వ దినమున ఏవిధంగా నింపాడో గమనించండి.
దినము 6: సృష్టి యొక్క ఆఖరి దినమున, యహువః ఆరిన భూమిని జీవులతో నింపాడు మరియు తరువాత ఆయన పురుషుడిని మరియు స్త్రీని సృష్టించాడు. వారు ఫలించాలి మరియు అభివృద్ధి చెందాలి మరియు ఆయన సృష్టిని సంరక్షించాలి. 3వ దినమున ఆయన వేసిన పునాదిపై 6వ దినమున ఏవిధంగా జీవులతో నింపెనో గమనించండి.
పునః పరిశీలిస్తే …
- 1, 2, మరియు 3వ దినాలలో, సృష్టికర్త తన పునాదిని వేశాడు.
- 4, 5, మరియు 6వ దినాలలో ఆయన ఆ పునాదిని స్థాపించిన క్రమంలోనే దానిని జీవరాసులతో నింపెను.
దినము 1 |
దినము 4 |
దినము 2 |
దినము 5 |
దినము 3 |
దినము 6 |
4వ దినములో సృష్టించబడినది కేవలం సమయం మాత్రమే అనేది వింటే ఆశక్తికరంగా లేదూ? 4 వ దినాన, ఆదికాండము 1:14 ప్రకారం, సమయము మరియు కేలండరు గణన నిమిత్తం ఆకాశంలోని జ్యోతులు నియమించబడ్డాయి. ఇంకా, కేలండరు గణన సూత్రాలు స్థాపించబడక మునుపు జీవరాశులు ఏమియు సృజించబడలేదని (సరిగా అర్థం చేసుకొనగా) గమనించండి. మోషే ఆదికాండము 1వ అధ్యాయంలో నెలలోని వారమును గూర్చి గ్రంథస్థం చేయలేదు కానీ అది ఈ క్రింది విధంగా ఉండేదని మేము సూచిస్తున్నాము:
- న్యూమూన్ (నెలారంభ) దినము ఆదికాండము 1: 1-2 కు సంబంధించినది
- పని దినము 1 ఆదికాండము 1: 3-5 కి సంబంధించినది
- పని దినము 2 ఆదికాండము 1: 6-8 కి సంబంధించింది
- పని దినము 3 ఆదికాండము 1: 9-13 కి సంబంధించినది
- పని దినము 4 ఆదికాండము 1: 14-19 కి సంబంధించింది
- పని దినము 5 ఆదికాండము 1: 20-23 కి సంబంధించింది
- పని దినము 6 ఆదికాండము 1: 24-31 కి సంబంధించింది
- సబ్బాతు/ విశ్రాంతి దినము ఆదికాండము 2: 1-3 కు సంబంధించింది
సృష్టి వారంలో రూపొందించిన నమూనాను ఇంకా తెరిచి చూచినపుడు, ముందుగా పేర్కొన్న విధంగా, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు (ఆకాశంలోని ప్రతిదీ) వాస్తవానికి ఆదికాండము 1:1 లోనే సృష్టించబడ్డాయి. ఇటీవల సృష్టి ఖాతాను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ నమ్మకానికి మరింత బలం చేకూరినది. ఇక్కడ లేఖనము ఏమి చెబుతున్నదని WLC నమ్ముతుందంటే:
"ఆదియందు ఎలోహీం భూమ్యాకాశములను సృజించెను." (ఆదికాండము 1:1) (ఆకాశంలో ఉండు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో సహా).
ఇక్కడ "సృజించెను" అనే పదం హెబ్రీలో బారా (H1254). ఆదికాండములోని దాని ఉపయోగంను గమనించినట్లయితే, శూన్యంనుండి ఒక ఖచ్చితమైన విధానంలో ఒక విషయంను సృష్టించుటను సూచించినట్లు కనిపిస్తోంది. ఈ పదం ఆదికాండము 1 లో కేవలం 5 సార్లు ఉపయోగించబడినది: (1) "... ఆకాశములను మరియు భూమిని సృజించెను”. (2)... గొప్ప మత్స్యములను సృజించెను". (3)”... ఆయన తన స్వరూపమందు నరుని సృజించెను”. (4) "... వానిని పురుషుని గాను మరియు స్త్రీగాను సృజించెను”. (5) “...ఆయన వారిని సృజించెను".
ఆదికాండం అంతటా "చేసెను" గా అనువదించబడిన ఇతర పదం ఆసాహ్ (H6213). ఈ పదానికి అర్ధం "చేయుట లేక తయారు చేయుట, విస్తృతమైన అర్థంలో మరియు విశాలమైన వినియోగంలో:- నిర్వహించు, ముందుగానే, నియమించుట ..." 2. ఆదికాండము మొదటి అధ్యాయంలో ఈ పదము అప్పటికే సృష్టించబడిన ఒక దానిని పురోగతి జరిగించుటను, లేదా ఏదో ఒక దానిని నియమించుటను సూచిస్తుంది. ఉదాహరణకు: అప్పటికే అక్కడ ఉన్న జలాలను వేరుచేయుట ద్వారా "యహువః" ఆకాశమును “తయారు చేసెను” (H6213). ఆయన రెండు గొప్ప జ్యోతులను "చేసెను" (H6213). "కీర్తనల గ్రంధం 104లో, సృష్టి వారానికి కాలక్రమానుసారంగా ఉన్నదాన్ని తిరిగి చెబుతున్నప్పుడు, ఆదికాండము 1:16 లో మోషే ఉపయోగించిన అదే పదాన్ని కీర్తనల గ్రంధంలో కూడా ఉపయోగించెను; అది ఇక్కడ “నియమించెను" గా అనువదించబడింది.
"ఋతువులను[మో’ఎడ్] తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను[H6213]." కీర్తన 104: 19
ఈ అవగాహన ఆదికాండము 1:1 ను మరియు సృష్టి యొక్క మొదటి రోజును వర్ణిస్తుంది (ద్వ్యర్థిగా ఉద్దేశించినది). "1 వ దినములో" "వెలుగు కలుగును గాక" అనేది సూర్యుని యొక్క వెలుగు మరియు ఇది 4వ దినానికి ముందు అక్కడ అక్షరానుసారమైన రోజులు (వెలుగు/ చీకటి చక్రం) ఎలా ఉన్నాయో అనే దానిని తేటపరుస్తుంది. "1 వ దినమున" సూర్యుడు వెలుగునిచ్చుట అనేది 4వ దినానికి ముందు పగలు (H3117-yom: "వేడిగా ఉండుట; ఒక దినము") మరియు రాత్రి ఎలా ఉండెనో తెలియజేయుచుండెను. "4 వ దినాన" సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములకు వాటి దైవిక కేలండరు పాత్ర "నియమించబడెను". అయితే, "ఎలోహీం . . . . ఆకాశములను సృష్టించెను” (ఆదికాండము 1: 1) అని చెప్పబడిన మొదట్లోనే అవి "సృష్టించబడెను (బారా - H1254)."
మొదటి రోజున యహువః సూర్యుని మరియు చంద్రుని అప్పటికి నియమించలేదు కాబట్టి అవి ఆయన కేలండరు కోసం వాడబడవు అని అనుకొనుట పూర్తిగా అసమంజసమైనది. ఆయన సూర్యున్ని మరియు చంద్రున్ని "సూచనలను, కాలములను [H4150], దినములను, సంవత్సరములను సూచించుటకు .... (ఆదికాండము 1:14)” సృష్టించెనని తేటగా చెప్పుచుండెను, మరియు కీర్తన 104:19 లో చంద్రుని కొరకు మరింత బలమైన సాక్ష్యం గలదు: "ఋతువులను [మో’ఎడ్] తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను [H6213] సూర్యునికి తన అస్తమయ కాలం తెలియును.” న్యూమూన్/ నెలారంభ దినము లేఖనాలయందంతటను స్పష్టంగా ఒక ఆరాధనా దినము. సంఖ్యాకాండం 29: 6, 2వ రాజులు 4:23, కీర్తనలు 81:3, యెషయా 66:23, యెహెజ్కేలు 46:1-6, మరియు ఆమోసు 8:5 చూడండి. 3
విచిత్రమేమిటంటే, 4 వ రోజు వరకు సూర్యుడు నియమింపబడనప్పటికీ సూర్య కేలండరును ఉపయోగించుటలో ప్రజలకు సమస్య లేదు. అలాంటప్పుడు కేలండరుగా ఉండుటకు చంద్రుడు ఎందుకు తక్కువ ప్రాముఖ్యతను కలిగియుండెను, ముఖ్యంగా కీర్తనలు 104:19 వెలుగెత్తి చెప్పుచుండగా?
ఋతువులను[మో’ఎడ్] తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలం తెలియును.
ఈ వాదన వేషధారణ కంటే మరేమీ కాదు. సూర్యుడు మరియు చంద్రుడు ఆదికాండము 1:1 లో సృష్టించబడెనని లేఖనం నుండి స్థాపించబడినందున ఈ మొత్తం వాదన మరింత విశ్వసనీయతను కోల్పోయింది.
మొదటిగా చూచినప్పుడు, చంద్రుడు మొదటి దినాన నియమింపబడలేదు గనుక అది ఆయన కేలండరులో ఉపయోగించబడదు అనే వాదన కొందరికి/ కొంతవరకు యోగ్యంగా కనిపించవచ్చు. అయితే, లేఖనము చాలా భిన్నమైన దానిని వివరిస్తుంది. చంద్రుడు అప్పుడూ మరియు ఇప్పటికీ ఆయన పవిత్ర సమావేశాలను, ఆరాధన సమయాలను కనుగొనుటలో వినియోగించబడుటకు స్థాపించబడెను, అందువలన అది ఆయన కేలండరులో ప్రాముఖ్యమైనది. చంద్రుడు ఆకాశంలో ఒక స్థిరమైన కేలండరుగా నిలుచును. ఆయన యొక్క ఖచ్చితమైన ప్రణాళికను బట్టియు, ఆయన జ్ఞానం, ఆయన దూరదృష్టి మరియు ఆకాశంలోని ఆయన అందమైన శాశ్వత కేలండరును బట్టియు, ఇప్పుడు మరియు ఎప్పటికీ, యహువఃకు స్తోత్రం చెల్లించుడి.
1 మేము "మినహాయింపు" లేదా “నియమింపబడెను” అనే పదమును చేర్చితిమి, ఎందుకంటే హెబ్రీ పదములో, సృష్టి యొక్క 1వ దినాన వెలుగు కొరకైన పిలుపులో సూర్యుడు మరియు చంద్రుడు రెండూ కలపబడెనని సందర్భానుసారంగా మరియు వ్యాకరణానుసారంగా నిర్ధారించుటకు హెబ్రీ పదబంధములో ఒక గది ఉండెను మరియు అవి సృష్టి యొక్క 4 రోజున వాటి ప్రత్యేక స్థలము మరియు క్రమానికి నియమింపబడెను.
2 స్ట్రాంగ్స్ డిక్షనరీ
3. సంఖ్యాకాండము 29:4 వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు(నెలారంభము) అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్య మైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యహువః కు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.
4. రెండవ రాజులు 4:23 అతడు నేడు నెలారంభము కాదే; విశ్రాంతి దినము కాదే; అతని యొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె నేను పోవుట “మంచిదని చెప్పి”
కీర్తన 81: 3 నెలారంభము నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమినాడు కొమ్ము ఊదుడి.
యెషయా 66:23 ప్రతి నెలారంభ దినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహువః సెలవిచ్చుచున్నాడు.
యెహెజ్కేలు 46:1 అదోనాయ్ యహువః సెలవిచ్చునదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతి దినమునను నెలారంభ దినమునను తీయబడియుండవలెను.
యెహెజ్కేలు 46:6 నెలారంభమునాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱె పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.
హోషేయ 5:7 యహువఃకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెలారంభము అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడ లయమగుదురు.
అమోసు 8:5 తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు నెలారంభము యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొను వారలారా,