ఎలోహీం యొక్క అర్థం. ఇది మీరు అనుకుంటున్నది కాదు.
యః యొక్క వాక్యము మరియు దైవిక నామము రెండూ శక్తిని కలిగి యున్నవి, |
నామము యొక్క శక్తి
గ్రంథంలో అత్యంత శక్తివంతమైన వాగ్దానం దైవిక నామములో పొందుపరచబడియున్నది: ఆ నామము యహువః. నిత్యమైన స్వీయ-ఉనికిలో ఉన్న ఆయన ఒక “ఉండు” అనే క్రియా వాచకముచేత పిలుచుకొనుచున్నాడు: ఉన్నవాడు.
మోషే చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల ఎలోహీం మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నే నేమి చెప్పవలెనని ఎలోహీం నడిగెను.
అందుకు ఎలోహీం, నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. (నిర్గమకాండము 3:13,14.)
"నేను ఉన్నాను" అనే పదం హెబ్రీ పదమైన, హాయః నుండి వచ్చెను. “ఈ క్రియకు: ఉనికిలో ఉండెను, ఉండు, అవును, వచ్చును, సంభవించును, పూర్తి చేయబడును” అని అర్థం వచ్చును.1 మరో మాటలో చెప్పాలంటే, ఉండు అని అర్థమిచ్చు ఏదైనా క్రియ సృష్టికర్త పేరు అవవచ్చు: ఉన్నాను, ఉన్నది, ఉన్నాడు, ఉన్నారు, ఉండెను, ఉండు, ఉంటూ, ఉండె—ఇవి అన్నియు సర్వశక్తునికి సమానంగా వర్తిస్తాయి.
యహువః విశ్వాన్ని ఉనికిలోనికి పిలిచినప్పుడు, ఆయన తన సొంత నామమును మాట్లాడలేదు మరియు ఆయన వదిలిన శ్వాస పలకబడిన వాక్కు ప్రకారం చేయగల అధికారాన్ని కలిగి ఉన్నది.
“వెలుగు, హాయః!” (ఆదికాండము 1: 3, ఇంటర్లినియర్ బైబిలు) వెలుగు కలిగెను.
“యహువః వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.” (కీర్తనల గ్రంథము 33:6)
యః యొక్క వాక్కు అది సెలవిచ్చుదానిని చేయుటకు శక్తిని కలిగి ఉన్నది!
“వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును.
నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా గ్రంథము 55:10,11)
దైవిక నామము దైవిక శక్తిని కలిగి ఉన్నందున లేఖనము పదే పదే యహువః నామమున పిలువమని విశ్వాసులను బలవంతం చేయుచున్నది. మీ అవసరతతో కలిపి పలికినప్పుడు, దైవిక నామం విశ్వంలో అత్యంత శక్తివంతమైన వాగ్దానం అవుతుంది. నీకు అవసరమైనదానిని, దైవిక ప్రేమ సరఫరా చేస్తుంది, ఇది ఒక వాగ్దానం.
నామముల ఉపయోగం (మరియు దుర్వినియోగం)
సాతానుకి ఇది తెలుసు. అతడు ఉద్దేశపూర్వకంగా సాధారణ శీర్షికల చాటున దైవిక నామములో గల వాగ్దానమును మరుగుచేసాడు. ఉదాహరణకు, మొదటి దినవృత్తాంతములు 16: 8 యొక్క అత్యంత ఆధునిక అనువాదం ఈ విధంగా చెబుతుంది: “దేవుడికి (Lord) కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటనచేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. అసలైన హెబ్రీ వాక్యము వాస్తవానికి ఇలా చెబుతుంది: "యహువః కు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి! ఆయన నామమున ప్రార్థన చేయుడి …”
దైవిక నామానికి అంతర్లీనంగా ఉన్న అధికారాన్ని సాధారణ శీర్షికలు కలిగి ఉండవు. అసలు హెబ్రీ పదే పదే యహువః పేరును గూర్చి ప్రస్తావిస్తున్నప్పటికీ, నేడు అధిక శాతం విశ్వాసులకు ఆయన నామము "దేవుడు" లేదా "ప్రభువు" అని మాత్రమే తెలుసు. వారికి తండ్రి నామము యొక్క అపారమైన శక్తిని గూర్చి మరియు పరిపూర్ణ సౌందర్యమును గూర్చి తెలియదు.
అయితే, శీర్షికలు కూడా వాటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, ఇవి యహువఃకును (ఏకైక నిజమైన మరియు జీవముగల దేవుడు) మరియు ఇతర అబద్ధ దేవతలకును మధ్య పోలికను చెప్పేటప్పుడు ఉపయోగించబడతాయి. 2 ఉదాహరణకు, మొదటి ఆజ్ఞ ఇలా చెబుతుంది: “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.” (నిర్గమకాండము 20: 3, NKJV). పౌలు, సమస్త అసత్య దేవతలలో ఒక నిజమైన దేవుని గూర్చి ఇలా చెప్పాడు: “ ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను (దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు), మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యహూషువః మెస్సీయ; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.” (మొదటి కొరింథీయులకు 8:5,6)
హెబ్రీలో కూడా సాధారణ శీర్షికలు ఉన్నాయి. హెబ్రీలో కనిపించే శీర్షికలు ఎల్ మరియు ఎలోహ. అవి ఆంగ్ల పదమైన "దేవుడు" కు సమానం. లేఖనాలలో, అవి యహువఃను గూర్చి మాత్రమే కాక, మతభ్రష్టత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆరాధించిన ఇతర దేవుళ్ళను సూచించుటకు కూడా ఉపయోగించబడినవి. ఏల్ యొక్క బహువచనం ఎలోహీం, మరియు సరిగ్గా ఇక్కడే చాలా గందరగోళం ఉద్భవించి యున్నది.
ద్వితీయోపదేశకాండము 6: 4 ఒకే ఒక్క దేవుడు మాత్రమే ఉండెనని, ఆయన యహువః అని ప్రకటిస్తోంది: “ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన (ఎలోహీం) యహువః అద్వితీయుడగు యహువః.
ఇక్కడ మీరు సమస్యను చూస్తున్నారా? "ఎలోహీం" అనేది బహువచనం, కానీ ఆ వాక్యము ఆయన ఒక్కడు అని చెబుతున్నది! అయితే ప్రజలను గందరగోళానికి గురిచేసేది ఇదొక్క వాక్యమే కాదు.
సృష్టి జాబితా అంతటా, ఈ పదం యొక్క బహువచనం పదేపదే కనిపిస్తుంది. "ఆదియందు, ఎలోహీం [దేవుళ్ళు] భూమ్యాకాశములను సృష్టించెను ... మరియు ఎలోహీం [దేవుళ్ళు] వెలుగు కమ్మని పలుకగా ..." (ఆదికాండము 1: 1 & 3)
ఈ గందరగోళం, కొంతమంది త్రిత్వ వ్యతిరేకులను కూడా, రక్షకుడు దైవత్వమనియు మరియు ఆయన తండ్రితో నిరంతరం స్వీయ-ఉనికిలో ఉంటుండెనని భావించేలా చేస్తుంది. అయితే, ఈ భావన తప్పు. లేఖనాల యొక్క జాగ్రత్తయైన అధ్యయనం రక్షకుడు పూర్తిగా మానవుడు అని మాత్రమే కాక, ఆయన జన్మించుటకు ముందు ఉనికిలో లేడని కూడా రుజువు చేస్తున్నది. అందువలన, ఈ విరుద్ధంగా కనబడుతున్న మన ఎలోహీం (దేవుళ్ళు) అయిన యహువః అద్వితీయుడగు (ఒక్కడైన) యహువః అనే ప్రకటనను పరిష్కరించుటకు ఖచ్చితంగా మరొక మార్గం ఉండాలి.
మరియు బైబిలు నిఘంటువు అయిన [ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్] "ఎలోహీం" ను గూర్చి ఇలా చెబుతుంది:
సాధారణ అర్థంలో దేవుళ్ళు; కానీ మహోన్నత దేవుని కోసం [ప్రత్యేకంగా] బహువచనంలో ఉపయోగించబడుతుంది; అప్పుడప్పుడు మర్యాద పూర్వకంగా న్యాయమూర్తులకు; మరియు కొన్నిసార్లు అతిశయోక్తిగా వాడబడును.
మరో మాటలో చెప్పాలంటే, ఒక పదం యొక్క బహువచన రూపాన్ని ఒకే (ఏక) వ్యక్తికి వర్తింపజేయుట ప్రాచీన హెబ్రీలో సాధారణ సాహిత్య ఉపకరణమై ఉండెను. ప్రస్తావించబడిన వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను పెంచాలని రచయిత కోరుకున్నప్పుడు ఇది ఉపయోగించబడేది. లేఖనంలో తరచుగా ఈ పదం ఇలా కనిపించుటకు గల కారణం ఇదే. యహువః సర్వోన్నతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన యొక్క ప్రాముఖ్యతను మరియు తీవ్రతను తెలియజేసే ప్రయత్నంగా, బైబిలు రచయితలు ఆయనను సూచించునప్పుడు, బహువచనమును ఉపయోగించిరి. ఇది ఆయన అనంతమైన ఉనికి యొక్క ప్రతి స్థాయికి ఘనతను మరియు సర్వశక్తిని సూచిస్తుంది.
ఒక బహువచన శీర్షిక బహుమంది దేవుళ్ళను సూచించదు మరియు ఇది ఖచ్చితంగా ఒక తండ్రి దైవము / కుమారుడు దైవము అనే ద్వయం గురించి ప్రస్తావించదు.
యహువః నామమున పిలవండి
యహువః పేరు మీద పిలవాలని విశ్వాసులు ఇప్పటికీ చెప్పబడుచున్నారు. “ఎందుకనగా ప్రభువు (యహువః) నామమునుబట్టి ప్రార్థనచేయువాడెవడో వాడు రక్షింపబడును.” (రోమీయులకు 10:13). భావనలను మరియు ఆలోచనలను తెలియజేయుటకు శీర్షికలు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, అవి యహువః నామము కలిగియున్న శక్తని కలిగి ఉండవు.
రక్షకుడు జన్మించవలసి వచ్చినప్పుడు, యహువః యోసేపు దర్శనములోనికి ఒక దేవదూతను పంపి, పుట్టబోయే శిశువుకి ఒక ప్రత్యేకమైన నామమును (ఆ నామము దానిలో దైవిక నామమును కలిగియున్నది) పెట్టాలని సూచించెను.
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యహూషువః (యహూషువః అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను. (మత్తయి సువార్త 1:20,21)
యహూషువః అనగా “యహువః యొక్క రక్షణ”! మెస్సీయను అనుగ్రహించుటలో ఎంత గొప్ప ఆశను ప్రేరేపించు నామము! యహువః యొక్క అద్వితీయ, పూర్తి మానవ కుమారుని బహుమానములో సంపూర్ణ రక్షణ అనుగ్రహించబడెను.
ఆయన నామమునకు “యహువః-మరియు-నా-ప్రయత్నములు-రక్షించును” లేక “యహువః-నా-సహాయముతో-రక్షించును” అని అర్థం కాదు. ఇది యహువః యొక్క రక్షణ; ఒక సంపూర్ణ బహుమానము.
యహువః నామమున ప్రార్థన చేయుడి. రక్షణ ఇప్పటికే మీది! ఇక ఎక్కువగా చేయవలసినది లేదు. యహువః రక్షించును. మరియు అది అందరికీ సరిపోతుంది.
పవిత్ర నామము, శీర్షికల యొక్క సరైన మరియు అక్రమమైన వినియోగమును గూర్చి మరింత తెలుసుకొనుటకు, |
1 లెక్సికల్ ఎయిడ్స్ టు ది ఓల్డ్ టెస్టెమెంటెంట్, ది కీవర్డ్స్ స్టడీ బైబుల్
2 దైవిక నామము కొరకు ప్రత్యామ్నాయములు క్రైస్తవుల మధ్య ప్రబలమైన కారణంగా, WLC యహువఃను సూచించేటప్పుడు ఏ శీర్షికను చూపుటలేదు. “దేవుడు” మరియు “ప్రభువు” అనేవి కేవలం శీర్షికలు; అవి ఆయన నామము కావు.