విశ్రాంతిదిన ఆచారము ఒక ఆనందమే కానీ భారం కాదు! |
నేను సంతోషంగా ఉన్నాను (WLC బృంద సభ్యులు బహిర్గతమవకుండా ఉందురు,) ఎందుకంటే నేను ఒక ఒప్పుకోలు చేయాలనుకుంటున్నాను మరియు అది ఇబ్బందికరంగా ఉంటుంది. నిజంగా, అవమానకరంగా. మీరు సిద్ధంగా ఉన్నారా?
ఒప్పుకోలు: నా జీవితంలో చాలా మట్టుకు విశ్రాంతిదినము ఒక భారంగా ఉంది.
ఉంగరాల జుట్టు, అందమైన దుస్తులు మరియు రుచికరమైన ఆహార పదార్థాలు విశ్రాంతి దినాన ప్రత్యేక అనుభూతి పొందేలా చేసాయి, కాని అవి కూడా సరైన విశ్రాంతి దినమును పాటించటానికి తప్పనిసరిగా అవసరమైన వాటిని గూర్చి ఒక ఆకాంక్షను సృష్టించాయి. |
నేను నా తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని విశ్రాంతి దినమును ఆచరిస్తున్నాను. వేరేలా చెప్పాలంటే, నా జీవితం మొత్తం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ఎల్లప్పుడూ విశ్రాంతి దినమును ప్రేమింతును. ఒక చిన్న అమ్మాయిగా ఉన్నప్పటినుండీ, విశ్రాంతి దినము చాలా ప్రత్యేకమైనది. ముందు రాత్రి నా తల్లి నా జుట్టును రింగులు రింగులుగా దువ్వి మరియు చర్చికి వెళ్ళడానికి అందమైన దుస్తులు మరియు కడియములుతో నన్ను అలంకరించేది. (యహువః మందిరానికి వెళ్లునప్పుడు మనకున్నంతలో మంచిగా ధరించుకొనుట మంచిది.) విశ్రాంతిదినపు భోజనాలు మరియు భోజనానంతరం తీసుకొనే తీపిపదార్ధాలు ప్రత్యేకంగా తయారుచేసిన ఆహార పదార్ధాలతో చాలా రుచికరంగా ఉండేవి. ఆరాధన కొరకు, మా పాట ఇలా సాగేది: "విశ్రాంతిదినమును మరువవద్దు (మన ఎలోహీం ఆశీర్వదించిన దినం)" మరియు "పని చేయుటకు మరియు ఆడుటకు మనకు ఆరు దినములున్నవి (ఏడవ దినము యహూషువః కొరకు)." విశ్రాంతిదినము ఎల్లప్పుడూ నాకు లోలోపల సంతోషాన్ని నింపేది.
కానీ, అది భారంగా కూడా ఉండేది. విశ్రాంతిదినపు భోజనమైన తరువాత, పెద్దలు చురుకుగా "కునుకు తీయు కార్యకలాపాలలో" పాల్గొంటారు. అతిథులు ఎవరైనా ఉన్నట్లయితే, వారు చుట్టూ కూర్చుని, నా సామర్థ్యానికి మించి ఉన్న (నాకు అర్థం కాని) విషయాలను గురించి మాట్లాడుకొనేవారు. విశ్రాంతిదినము పూర్తవుతున్నప్పుడు (చివరిలో), సూర్యాస్తమయం వద్ద నిజమైన గొప్పతనం ఉండేది. పాప్ కార్న్ మరియు ఆటలతో నిజమైన ఆనందం మొదలయ్యేది.
మరియు నేను పెద్దయ్యాక, విశ్రాంతిదినము మరింత భారంగా మారింది. ఒక పెద్ద వ్యక్తిగా, విశ్రాంతిదినమును జాగ్రత్తగా పాటించుటలో కొన్ని అంచనాలను అందుకోవలసి ఉండేది: ఆహారాన్ని ముందు రోజు సిద్ధం చేయాలి; ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఒక తల్లిగా, అందరికీ స్నానం చేయించుట, అమ్మాయిల జుట్టును రింగులుగా దువ్వుట, ఆహారాన్ని తయారుచేయుట, డైపర్ బ్యాగ్ సిద్ధం చేయుట, విశ్రాంతిదినముకు అంతా పూర్తిచేసి సిద్ధంగా ఉండుట చాలా కష్టమైన పనిగా ఉండేది.
నేను చేయగలిగినంత ప్రయత్నించేదాన్ని, అయినప్పటికీ నేను పూర్తిగా సిద్ధంగా లేకపోయేదాన్ని. పిల్లలను శుభ్రం చేసేదాన్ని; ఆహారాన్ని సిద్ధం చేసేదాన్ని; డైపర్ బ్యాగ్ సిద్ధం చేసేదాన్ని. కానీ ఎక్కువగా నేను పూర్తి చేయలేకపోయిన ఒక విషయం బట్టలను ఇస్త్రీ చేయుట. యహువః మందిరానికి వెళ్లునప్పుడు మంచి దుస్తుల్ని ధరించుట అనగా చక్కగా సిద్ధం చేసుకున్న ప్రత్యేకమైన దుస్తులు ధరించుట. నా భర్త మరియు ముగ్గురు కుమారులకు చొక్కాలు మరియు స్లాక్స్ ఇస్త్రీ చేయుట, అలాగే నా ఇద్దరు కుమార్తెలు మరియు నా కోసం కూడా ఇస్త్రీ చేయుట. . . ఇది చాలా ఎక్కువ పని మరియు, నా భర్త నాకు సహాయం చేయాలంటే ఒక సుదీర్ఘ పని వారం తర్వాత, ఆయన చాలా అలసి ఉండేవారు.
ఒక సారి, నేను వారంలో ముందుగానే విశ్రాంతి దినపు ఇస్త్రీని చేయుటకు ప్రయత్నించాను, కానీ విశ్రాంతి దినపు ఉదయం వచ్చే సమయానికి, అల్మారాలోని ఇతర బట్టల మధ్య నా జాకెట్టు, బాలికల దుస్తులకు మడతలు ఏర్పడినవి. మరోసారి, చాలా వేకువన, సూర్యోదయానికి ముందు, నేను నా అలారం పెట్టుకుని ప్రయత్నించాను, కానీ వేకువ వరకు పనిచేయవలసి వచ్చుట మంచిదిగా అనిపించలేదు. కొన్ని సార్లు నేను పిల్లలను నిద్రపుచ్చిన తర్వాత మా బట్టలు ఇస్త్రీ చేయుటకు ఉపక్రమించేదానిని. వారం, వారం తర్వాత వారం, వారం తర్వాత వారం, సమయానికి అన్నీపూర్తి చేయలేక, విశ్రాంతిదినము యొక్క "ప్రారంభ సమయాలను" సరిగా కాపాడుకోలేకపోయాననే అపరాధ భావనతో చింతించేదానిని.
అయితే, అన్నింటికన్నా గొప్ప అపరాధం ఏమిటంటే, విశ్రాంతిదినము వచ్చినప్పుడు నేను పొందే భయం. లూనార్ సబ్బాతు మరియు ఒక బైబిల్ దినము ఎప్పుడు ప్రారంభమవును అనే వాటిని గూర్చిన జ్ఞానం పొందిన తర్వాత, అది తేలికగా మారింది ఎందుకంటే పరిశుద్ధ సమయము తక్కువగా ఉన్నందున. అంతే.
నేను విశ్రాంతిదినమును ప్రేమించాను. నేను నిజంగా చేసాను. కానీ అది చాలా కష్టంగా ఉండేది. విశ్రాంతి దినము అనేదానికి బదులు, అది నాకు వారాంతంలో ఒక కష్టతరమైన దినంగా మారింది! అటువంటి కష్టతరమైన రోజు యొక్క శారీరక అలసట, ఇస్త్రీ చేయలేకపోయాననే అపరాధ భావనతో మిళితమైనప్పుడు, వారంలోని ఉత్తమమైన రోజుకు నేను పొందే భయం మరింత దారణంగా ఉండేది!
విశ్రాంతిదినము: ఒక భారం?
విశ్రాంతిదినము యహువః యొక్క అత్యంత విలువైన బహుమతులలో ఒకటి! మన ఆశీర్వాదం కోసం ఉద్దేశించిన ఒక దినము నిజంగా ఒక భారంగా మారును అని ఎలా అనుకోవచ్చు?
విశ్రాంతిదినపు ఆచారం యూదులకు పర్యాయపదంగా ఉంది. కానీ, వారికే, విశ్రాంతిదినము ఒక భారంగా కూడా మారింది. నేడు, అత్యంత సంప్రదాయవాదులైన యూదులు దీపాలు వెలిగించుటకు, పొయ్యిలు వెలిగించుటకు, వినికిడి పరికరాల బ్యాటరీలు మార్చడం లేదా ఇతర చేయకూడని (విశ్రాంతిదినము దినాన ఒక యూదుడు చేయకూడని) పనులు చేయుటకు ఒక "సబ్బాత్ గాయ్" ని (ఒక అన్యుని) నియమించుకొనుచూ" (ఆ విధంగా విశ్రాంతిదినమును మీరుచున్నారు.)
చాలామంది క్రైస్తవులు విశ్రాంతి దినాచారమును ఎన్నడూ పెద్దగా పట్టించుకోరు, అయితే ఈ ఆలోచన ఒక తప్పుగా అనిపిస్తుంది: విశ్రాంతి దినాన మీ జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి ఒక పొరుగు పిల్లవాడిని పనికి పెట్టుకొనుట. సమస్య ఏమిటంటే, అలా చేయుట ద్వారా ధర్మశాస్త్రంలోని అక్షరాన్ని ఉల్లంఘించుట మాత్రమే కాక, ధర్మశాస్త్రం యొక్క ఆత్మను కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది. నాల్గవ ఆజ్ఞ తేటగా ఇలా వర్ణిస్తుంది: “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ ఎలోహీం అయిన యహువఃకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు. (నిర్గమకాండము 20:8-10)
లేక్ వుడ్ ను గూర్చిన ఒక వార్తా కథనంలో, వారి సంఘంలో నివసిస్తున్న 60,000 సంప్రదాయ యూదులు కోసం పనికిమాలిన పనులకు సహాయం చేయుటకు న్యూజెర్సీ పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుపెట్టింది, హేమంత్ మెహతా ఇలా వ్రాసారు:
మతపరమైన కోణం నుండి కూడా, యూదులు ధర్మశాస్త్ర స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారు. మీ పవిత్ర గ్రంథం చెప్పినందున దీపాలు వెలిగించకూడదు అని మీరు అనుకుంటే, అప్పుడు అలా చేయండి. చర్చి / రాష్ట్ర విభజనను మరచిపోండి - మీరు చేయకూడదు అనుకున్నందున మీ చెత్త పనులను చేయుటకు పోలీసు అధికారులను అడుగుట మీరు అధికారుల సమయాన్ని కేవలం వృధా చేయుటయే. వారు మీ వారాంతపు వ్యక్తిగత సేవకులు కాదు. వాస్తవానికి, ఆర్థడాక్స్ యూదులు తమ పనులు చేయుటకు మనుష్యులను (“సబ్బాత్ గాయ్ లను") కూలికి ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ వారు విశ్రాంతిదినమును ఘనమైనదిగా తీసుకుంటే ఆ విధానం కూడా సమస్యాత్మకమైనదిగా కనిపిస్తుంది. ఒక ఆన్లైన్ వ్యాఖ్యాత ఇలా వ్యాఖ్యానించారు, "దీపం వెలిగించరాదు అని మీ మతం చెప్పినట్లయితే, అప్పుడు చీకటిలో కూర్చోండి లేదా మతం మారండి." 1
ఇది యహూషువః దినాలలో ఆయన ఖండించిన ఇశ్రాయేలీయుల మనస్తత్వం. తన బహిరంగ పరిచర్య మొదలైనప్పటి నుండి, రక్షకుడు నిజమైన విశ్రాంతిదినమును పాటించుట ద్వారా వచ్చే ఆశీర్వాదాలను గూర్చి ప్రజలకు బోధించుటకు ప్రయత్నించాడు. మార్కు 2 లో ఇలా వ్రాయబడినది: “మరియు ఆయన [యహూషువః] విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి. అందుకు పరిసయ్యులుచూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. (మార్కు 2:23,24)
ఇక్కడ దొంగతనం చేయుచున్నందున శిష్యులను పరిసయ్యులు నిందించుట లేదు. ఆకలితో ఉన్న ఏ వ్యక్తి అయినా ఇతరుల పొలాలు లేదా తోటల నుండి తాను అక్కడ తినగలిగిన దానిని తీసుకొని తినవచ్చునని మోషే ద్వారా అందజేయబడిన లేవీయుల చట్టాలలో ఇవ్వడం జరిగింది. పరిసయ్యులకు ఈ విషయాలన్నీ బాగా తెలుసు. అయితే వారు శిష్యులపై ఎందుకు నిందవేయుచున్నారు అంటే, వారు పనిచేయుచున్నారు అని.
"కార్న్" ను "ధాన్యం" గా కూడా అనువదించవచ్చు. "వెన్నులను త్రుంచి" ఆ తర్వాత వాటిని తినుట కారణంగా, పరిసయ్యులు మొదట, విశ్రాంతిదినములో పంట కోయుచున్నారని శిష్యులపై ఆరోపణలు చేసారు. తరువాత, రెండవదిగా, వారు ధాన్యాన్ని తమ చేతుల మధ్య నులిమి పొట్టును తీయు చర్యను "నూర్పిడి" గా ఆరోపణలు చేసిరి.
విశ్రాంతిదినమును ఆచరించుటకు యూదులు చాలా ఆచార సంప్రదాయాలను అభివృద్ధి చేశారు. చాలా మంది క్రైస్తవ విశ్రాంతిదిన-ఆరాధికులు కూడా ఇదే వైఖరిని అనుసరించారు. |
అది ఏమిటనేదానిని యహూషువః పూర్తిగా అర్థం చేసుకొనెను మరియు ఆయన విశ్రాంతిదిన ఆచరణలోనికి ప్రవేశపెట్టబడిన అధిక భారమును తొలగించాలని, మరియు విశ్రాంతిదినము యొక్క అసలైన ఉద్దేశ్యమైన ఆశీర్వాదంగా దానిని మార్పుచేయాలని కోరుకున్నాడు. పరిసయ్యులు అడుగుతున్న విషయంపై రక్షకుడు పూర్తిగా పరిజ్ఞానం కలిగియుండి, సున్నితంగా ఇలా అడిగెను: “అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతో కూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను.” (మార్కు సువార్త 2:25,26)
ఆయన వారిని విశ్రాంతిదినము యొక్క సంప్రదాయిక, చాలా చట్టపరమైన ఆచారం నుండి బయటకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు, యహూషువః విశ్రాంతిదినము ఒక బహుమానంగా ఇవ్వబడిందే తప్ప అది ఎప్పటికీ భారం కాదు అని తెలియజేసే అన్ని కాలాలకూ స్థిరపరచబడిన చాలా చక్కని ప్రకటన చేసాడు: మరియు విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. (మార్కు సువార్త 2:27,28)
విచారకరంగా, ఇశ్రాయేలీయులు తమ ఆచారాలను మార్చుకొనుటకు ఇష్టపడలేదు. ఈ దినం వరకు, చాలామంది యూదులకు విశ్రాంతి దినము-ఆచరణ అనేది ఒక ఆధ్యాత్మిక ఆశీర్వాదముగా కాక, ఒక సంప్రదాయక బాధ్యతగా కలిగియుంటున్నారు. తన మరణానికి కొంతకాలం ముందు, యహూషువః పరిసయ్యుల రాతి హృదయాలనుండి ఉద్భవించిన క్రియలను అంతం చేయుటకు చివరి ప్రయత్నం చేశాడు. ధర్మశాస్త్రం యొక్క అసలైన ఆత్మలోనికి తిరిగి రావాలని యహూషువః చేసిన ఒక హృదయం బ్రద్ధలయ్యే వేడుకోలు, మత్తయి 23 లో నమోదు చేయబడింది. అన్యులనుండి మార్పు చెందే కొత్త విశ్వాసులపై ఇశ్రాయేలీయుల ప్రభావమును గూర్చి ఎరిగినవాడై యహూషువః ఆందోళన కలిగి యుండెను, ఆయన సువార్త సందేశం వ్యాపింపజేయబడునని ఆయనకు తెలుసు కావున; ఆయన ఇలా చెప్పాడు: “పరిసయ్యుల క్రియలను చేయకుడి.”
గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో-నరకకుమారునిగా) చేయుదురు. (మత్తయి సువార్త 23:3,4,15)
విశ్రాంతిదినమును ఆచరిస్తున్న క్రైస్తవులలో కూడా విశ్రాంతిదినము విషయంలో అదే వైఖరిని విస్తరించపజేయుటకు సాతాను కష్టపడి పనిచేశాడు. చట్టపరమైన సబ్బాతును ఆచరించువారిని క్రైస్తవులు ఎందుకు నిందించుదురు అనే విషయంలో చాలా మంచి కారణాలు ఉన్నాయి. కానీ అది విశ్రాంతిదినము యొక్క తప్పు కాదు. ఇప్పుడు, ఈ భూచరిత్ర యొక్క ముగింపునకు సమీప కాలంలో, విశ్రాంతిదినమును ఎంతో అద్భుతమైన బహుమతిగా ఆనందించునట్లు తిరిగి తీసుకొనే సమయమై ఉంది.
విశ్రాంతిదినము: మనుష్యులందరికీ
మీరు లేదా మీ దగ్గరున్న ఎవరైనా ఇలా ప్రతిస్పందిస్తే, " ఒక రోజు విషయంలో ఇంత గడబిడ ఎందుకు? నేను ప్రతి రోజు ఆరాధిస్తాను!" అలాంటి ప్రతిస్పందన విశ్రాంతిదినము యొక్క ఉద్దేశ్యాన్ని పూర్తిగా కోల్పోతుందని నేను సౌమ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి భావన విశ్రాంతిదినమును ఒక ఆనంద దాయకమైన దినంగా కాకుండా, ఒక భారముగా అపార్థం చేసుకొనుట ద్వారా పుట్టినది.
“విశ్రాంతిదినము మనుష్యుని కొరకే గాని, మనుష్యుడు విశ్రాంతిదినము కోసం కాదని యహూషువః చెప్పుటలో ఆయన భావం ఏమిటి? విశ్రాంతిదినము మనకు ఒక బహుమానంగా మరియు రోజువారీ జీవితం యొక్క భారము నుండి ఉపశమనాన్ని మరియు నిజమైన ఆధ్యాత్మిక మరియు శారీరక పునరుద్ధరణకు ఒక అవకాశాన్ని ఇచ్చు దినంగా మనం అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నట్లు నేను నమ్ముతున్నాను. యహువః మనకు ఈ ప్రత్యేక దినాన్ని వినోద లేదా రోజువారీ పనుల కోసం ఇవ్వలేదు కానీ పనుల నుండి విశ్రాంతి కోసం, శారీరక మరియు ఆధ్యాత్మిక ఉపశమనం కోసం ఇచ్చెను.” రస్సెల్ M. నెల్సన్, "విశ్రాంతిదినము ఒక ఆనంద దాయకం." |
అంతే కాకుండా, అబ్రాహాము యొక్క జీవసంబంధ వారసుల కోసం మాత్రమే కొన్ని బాధ్యతలు/ చేయవలసిన పనులు (అలాగే కొన్ని ఆశీర్వాదాలు) నిలిచి యుండెనని ఇది సూచిస్తుంది. అయితే ఇది నిజం కాదు. ఇది యూదులు గొప్పవారని, మరియు సమస్త అన్యులు వాయికంటే తక్కువ వారని జియోనిస్టులచే చేర్చబడిన తప్పుడు అభిప్రాయం.
కొర్నేలీ, ఒక రోమా శతాధిపతి మరియు నీతిమంతుడు. అతడు మారుమనస్సు పొంది మరియు ఏదైతే పరిశుద్ధాత్మతో పెంతెకోస్తు పండుగలో శిష్యులు నింపబడెనో అదే ఆత్మను పొందుకున్నప్పుడు, యహువః దృష్టిలో అందరూ సమానమై ఉన్నారని పేతురు బలంగా చూపించాడు.
పేతురు ఇలా ప్రకటించాడు: “యహువః పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.
ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34,35)
యహువః బహుమానాలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి, మరియు దానిలో విశ్రాంతిదినము బహుమతి కూడా ఉంటుంది. లోతైన పదాలతో, యెషయా ప్రవక్త ఇలా ప్రకటించాడు:
యహువః ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి.
నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ కుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు.
యహువఃను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యహువః తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.
నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యహువః ఈలాగు సెలవిచ్చుచున్నాడు
నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను
విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యహువః నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను
నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.
ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు అదోనాయ్ యహువః వాక్కు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలువారికి పైగా ఇతరు లను కూర్చెదను. (యెషయా గ్రంథము 56:1-8)
యహువః ఉద్దేశించిన విధానంలో విశ్రాంతిదినమును ఆచరించు వారందరికీ అద్భుతమైన ఆశీర్వాదాలు లభించునని సాతానుకు తెలుసు. అందుకే అతడు విశ్రాంతి దినము సిలువలో కొట్టివేయబడెను అనే ఆలోచనను తీసుకువచ్చాడు. మరియు అది ఇప్పటికీ కొట్టివేయబడకుండా నిలిచియున్నదని అర్ధం చేసుకున్నవారిలో, దానిని ఒక భారంగా, మరియు "భరించుటకు కష్టం" అనే భావనను తీసుకొని వచ్చాడు.
యహువః యొక్క దీవెనలు జాతితో సంబంధం లేకుండా అందరికి స్వేచ్ఛగా మరియు సమానంగా అందుబాటులో ఉంటాయి.
వారి DNA కారణంగా వారిని కొంచెం ఎక్కువ గౌరవప్రదంగా ఉంచుటకు యహువః “వ్యక్తులను లక్ష్యపెట్టువాడు కాదు.”
విశ్రాంతిదినము: యః యొక్క బహుమానము
తండ్రి తన అనంతమైన ప్రేమ మరియు జ్ఞానంతో విశ్రాంతిదినము విషయంలో తలెత్తు గందరగోళాన్ని ముందే ఊహించెను. విశ్రాంతిదినము దాని విధానమును కోల్పోతుందని ఆయనకు తెలుసు. సత్యం పపునరుద్ధరించబడిన తరువాత, పరిసయ్యుల చట్ట సంబంధ మనస్తత్వం శేషించినవారి మధ్య విశ్రాంతిదినము ఆచరణ విధానమును మళ్ళీ పాడుచేయునని కూడా ఆయనకు తెలుసు. ఒకడు ఎప్పుడైనా, ఎక్కడైనా, విశ్రాంతిదిన బహుమానంలో ఎలా ఆనందించగలడో అనే విషయంలో ఆయన తన దయతో మరియు కారణ్యంతో స్పష్టమైన ఆదేశాలు అందించారు.
ఇది అందమైన బట్టలు ధరించుటలోనో లేదా ప్రత్యేక ఆహారాలు సిద్ధం చేసుకొనుటలోనో, లేదా ఆయన పరిశుద్ధ దినాన యహువః యొక్క పనిని చేయుటపైనో ఆధారపడి లేదు. గాజు కిటికీల యొక్క సౌందర్యంతోనో, లేదా వేలాది మంది గాత్రాలు కలిపి పాడటంలోనో ఏమియూ లేదు. ఈ అనుభవాలన్నీ ఉత్తేజాన్నిస్తాయి, కానీ అవి అందరికి సమానంగా అందుబాటులో ఉండవు.
అయితే, విశ్రాంతిదినములో ఆహ్లాదంగా ఉండుట బాహ్య కారకాలపై ఆధారపడిన దేనికంటెనూ చాలా సులభమైనది, ఇంకా చాలా లోతుగా ఉంటుంది.
చీకటి యుగాలు కేవలం సాంకేతిక అజ్ఞానం మరియు సైద్ధాంతిక లోపం గలవి మాత్రమే కాదు. అవి గొప్ప ఆధ్యాత్మిక చీకటికి యుగాలు కూడా, అక్కడ అనేక ఆత్మలు యహువః నుండి వచ్చే శాంతి మరియు ఓదార్పు కోసం ఎంతో కోరిక కలిగి యున్నాయి. ఈ పరిస్థితిని గూర్చిన యహువః యొక్క వివరణను యెషయా 58 వెల్లడిచేస్తుంది: చీకటి ఏమి చేసెను, మరియు శాంతిని పొందుటకు మరియు విశ్రాంతిదిన బహుమానంను ఆనందించుటకు దైవీక సూత్రం ఏమిటి:
తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము; వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము; యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము.
>తమ ఎలోహీం న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడుగుదురు ఎలోహీం తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.
మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? (యెషయా గ్రంథము 58:1-3.)
ఇవి నిజాయితీ లేని ప్రశ్నలు కావు. యహువః ను ప్రేమించి ఆయనను గౌరవించాలని కోరుకొనే వానికి, కావలసిన దీవెనలు చాలా అస్పష్టంగా ఉన్నప్పుడు అది గందరగోళంగా ఉంటుంది. వారి అంతర్గత హృదయాలలో ఏమి జరుగుతుందో యహువః సున్నితంగా వివరిస్తున్నాడు, అది తమంతట తమకు తెలియదు. "మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు, మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు" (యెషయా 58: 3 బి- 4)
ఒక మతపరమైన అనుభవం యొక్క మార్గములో వెళ్ళుట సృష్టికర్తతో లోతైన ఆధ్యాత్మిక సంబంధం కోసం కలిగియున్న మన ఆత్మ-ఆకలిని ఎన్నటికీ సంతృప్తి పరచదు. |
యహువః మాట్లాడుతూ, మీరు ఉపవాసం చేయుచున్నారు, మీరు ఆధ్యాత్మికంగా కాకుండా మతపరమైనవారుగా ఉన్నారు. మీరు మంచి మార్గాల ద్వారా వెళ్ళిపోతారు, ఎందుకంటే అది మిమ్మల్ని చాలా మంచివారిగా అనుకొనేటట్లు చేస్తుంది. అయితే, సమస్య ఏమిటంటే, మీ హృదయం ఇప్పటికీ చెడ్డదిగా ఉన్నది.
ఇది లవొదికయ సంఘానికి ఇవ్వబడినది అదే సందేశమై యున్నది: నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు. (ప్రకటన గ్రంథము 3:17)
నేను విశ్రాంతిదినమును ఎల్లప్పుడూ ప్రేమించితిని, కానీ అది మానవ నిర్మిత సంప్రదాయాలు, సరైన సబ్బాతు ఆచరణ యొక్క మానవ కల్పిత విశ్లేషణ, తోటి సంఘ సభ్యుల అంచనాలను అందుకొనేలా సరైన వస్త్రధారణ ఇవన్నీ నాకు విశ్రాంతిదినమును పవిత్రంగా కాపాడుకున్నాననే అభిప్రాయాన్ని కలిగించేవి. మరియు, ఇంకా, ఇవే విషయాలు విశ్రాంతి దినపు ఆశిర్వాదాలను ఒక భారంగా మార్చిన విషయాలుగా కూడా ఉన్నవి . . . అయితే నేను దీనిని గ్రహించనేలేదు.
కానీ మా ఉద్దేశాలు అపవిత్రమైనప్పుడు కూడా, యహువః మనల్ని విడిచిపెట్టడు. బదులుగా, మన హృదయాలలో దాగి ఉన్న లోపాలను వెల్లడిస్తూ మరియు నీతి మార్గాల్లో మనకు బోధిస్తూ ఆయన మనల్ని మెల్ల మెల్లగా నడిపిస్తాడు. యెషయా 58 లో ఆయన ఇలా అడుగుతున్నాడు: "అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యహువః కు ప్రీతికరమని మీరను కొందురా?" (యెషయా 58: 5)
నిన్ను నీవు దుఃఖపరచుకొనుమని నేను అడిగితినా? యహువః విచారణ చేయును. నిజంగా నేను కోరుచున్నది ఇదేనని నీవు అనుకుంటున్నావా?
విశ్రాంతిదినములో అపరాధం యొక్క భారంతో మరియు మానవ కల్పిత కష్టాలతో నేను శ్రమించినప్పుడు నేను విశ్రాంతిదినపు దీవెనను నిజంగా పొందుకున్నానా? అవును! హృదయాన్ని చదివే యహువఃకు, నేను ఆయనను ప్రేమించానని మరియు ఆయనను ఘనపరచాలని కోరుకున్నానని తెలుసు. కొండపై యహూషువః తన ఉపన్యాసంలో వివరించినట్లు:
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.
మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?
మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.
యహువః తన పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. కానీ నేను నా అజ్ఞానం మరియు అంధత్వంలో విశ్రాంతిదినపు దీవెనలను మరి ఎక్కువగా కోల్పోతున్నానని ఆయనకు తెలుసు.
యెషయా 58 లో, విశ్రాంతిదినములో మన ఆనందాన్ని దొంగిలించే హృదయాంతరంగాలలో దాగియున్న అపరిశుద్ధమైన కార్యములను ఒకసారి వెల్లడి చేసిన తరువాత ఆయన అంతటితో ఆగిపోలేదు. బదులుగా, ఆయన తాను నిజంగా కోరుకునేది ఏమిటో వివరిస్తాడు, మరియు అది బాహ్యకృత్యములను చేదించి నేరుగా హృదయంలోనికి వెళ్ళును:
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు (యెషయా 58: 6-7)
ఇది ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ హృదయం యొక్క క్రియ. ఇది యహూషువఃతో ఉంది, మరియు ఇది మనతో ఉంది. అయితే యహువః మన ఉద్దేశాలను శుద్ధి చేసి, మన హృదయాలకు మరియు ఆయన హృదయానికి మధ్య ఉన్న సమస్త అడ్డంకులను తొలగించునట్లు ఆయనను అనుమతించినప్పుడు, పొంగి పొర్లే దీవెనలు నిజంగా "అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతలతో కొలవబడును." (లూకా 6:38, KJV) దీవెనలు ప్రవాహం వైపు వినండి. పరలోకం కేవలం మీమీద కుమ్మరించుటకు ఉత్సాహంగా ఎదురు చూస్తుండెను:
ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడచును యహువః మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యహువః ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయననేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. యహువః నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. (యెషయా 58: 8-11)
ఎంత సమృద్ధియైన బహుమానం! మీ రహస్య, అంతర్గత హృదయమును బహిర్గతం చేయుటకు మరియు ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందే మార్గంలో ఆయనకు మనకు అడ్డుగా నిలబడగల ప్రతి అడ్డంకిని తొలగించటానికి యహువఃను అనుమతించినప్పుడు ఇదంతయు మనకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇది జరిగినప్పుడు, యహువః యొక్క ధర్మశాస్త్రం పూర్తిగా క్రొత్త వెలుగులో కనిపిస్తుంది. ఇకపై ఇది ఒక భారంగా కనబడదు. ఇప్పుడు, అది సర్వశక్తిమంతుని యొక్క ఆలోచనల మరియు భావాల యొక్క వ్రాత ప్రతిగా కనిపిస్తుంది. ఆయన యొక్క రహస్య, అంతరంగ హృదయపు సంగ్రహావలోకనంను పొందుకొనే అవకాశాన్ని దైవిక ధర్మశాస్త్రం మనకు ఇస్తుంది! మరియు మనం కనుగొన్నది స్వచ్ఛమైన సౌందర్యం.
యహువః యొక్క ధర్మశాస్త్రం ఆయన ప్రేమాగుణం యొక్క వ్రాత ప్రతి. ఇది ఎన్నటికీ కొట్టివేయబడదు! బదులుగా, ఇది యహ్ యొక్క అంతర్గత హృదయాన్ని వెల్లడిస్తుంది. ఎంత ఎక్కువ దైవిక నియమాలను అధ్యయనం చేస్తే, అంత ఎక్కువ సౌందర్యం కనిపిస్తుంది. |
ఆ దైవిక ధర్మశాస్త్రం యొక్క ఒక భాగం విశ్రాంతిదినము - ఒకరు, ఒకరు మరియు మరొకరు కలిసి నిన్ను ఎరిగిన మరియు ప్రేమిస్తున్న ఒకనితో సమయాన్ని గడుపుటకు ఇది ఒక శాశ్వత ఆహ్వానం. తరువాతి వచనములో, అలా చేస్తున్నవారు, విశ్రాంతిదినము శిలువలో కొట్టివేయబడినదని నమ్మకుండా, నాల్గవ ఆజ్ఞకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని గమనించండి! సృష్టికర్తతో సన్నిహితంగా సమయాన్ని గడుపుటకు ఆహ్వానం ఇప్పటికీ తెరవబడి ఉంది!
“పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడ వనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.” (యెషయా 58:12, KJV) యహువః ధర్మశాస్త్రంలో "ఉల్లంఘన" అనగా నాలుగవ ఆజ్ఞ శిలువకు వ్రేలాడదీయబడెను అనే భావన. కానీ గ్రుడ్డితనము తొలగించబడి, దైవిక చట్టం యొక్క సౌందర్యమును గ్రహించినప్పుడు, ఆ భావన యొక్క తప్పును మనము గుర్తిస్తాము. మనము యహువః విశ్రాంతిదినమును ఆచరించుట మాత్రమే కాక, ఈ అద్భుతమైన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మన శక్తి కొద్దీ పని చేయుదుము.
మరియు మనం విశ్రాంతిదినము యొక్క మానవ కల్పిత "ఆచరణ" వైపునకు తిరిగకూడదని ఇప్పుడే నిర్ణయించకుందాం, విశ్రాంతిదినమును అందరూ ఆనందించగలుగుటకు సహాయపడు మూడు దశల ప్రక్రియను యహువః స్పష్టంగా తెలియజేస్తుండెను:
నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల, విశ్రాంతిదినము మనోహరమైనదనియు యహువఃకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల, నీవు యహువః యందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నతస్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను. యహువః సెలవిచ్చిన వాక్కు ఇదే. (యెషయా 58: 13-14, KJV)
ఇది విశ్రాంతిదినము నందు ఆనందపజేసే రహస్యమై ఉంది.
ఈ దినమును పరిశుద్ధపరుచుట మన పని కాదు. అది ఇప్పటికే పరిశుద్ధమై ఉన్నది! అది పరిశుద్ధము మరియు పవిత్రమైనది ఎందుకంటే, సృష్టికర్త మొదట్లోనే దానిని అలా ఆశీర్వదించెను మరియు ప్రవేశపెట్టెను. దానిని అలా ఆచరించుట మన కర్తవ్యం.
విశ్రాంతిదినములో ఆనందించుట
విశ్రాంతిదినము యొక్క దీవెనను నిజంగా పొందేందుకు, మొదట మీరు విశ్రాంతిదినమును ఆనందదాయకమైన దినంగా భావించాలి. అది కేవలం మీ మాటలలోనే కాక, మీ స్వంత మనసులో మరియు హృదయంలో దానిని వారంలోని ఉత్తమమైన దినంగా చూడండి. ఎందుకంటే ఈ రోజున, సర్వలోకానికి అధిపతి తన పనిని పక్కన పెట్టి తన గొప్ప నిధి మీద దృష్టి పెట్టారు: ఆ నిధి మీరే.
విశ్రాంతి దినపు విషయంలో యహువః నిర్మించిన మూడు ప్రత్యేక అంశాలు ఉన్నాయి. మనము ఇలా చేస్తే, విశ్రాంతిదినము ఒక బహుమానంగా మరియు సంతోషంగా ఉంటుంది . . . అంతేకానీ ఇస్త్రీ చేయబడిన సరైన దుస్తులను ధరించుట మరియు సమయానికి ముందే చేయబడిన వంటకాలను కలిగివుండుట వంటి మన ప్రయత్నాల వల్ల కాదు!
విశ్రాంతిదినములో మనలను ఆనందపరిచే ఆ మూడు అంశాలు:
- నా సొంత పనిని చేయకుండుట.
- నా సొంత మాటలు మాట్లాడకుండుట.
- నా సొంత ఆనందాన్ని కోరుకోకుండుట.
నా సొంత పనిని చేయకుండుట.
ఇది చాలా స్పష్టమైనది మరియు స్వీయ వివరణాత్మకమైనది. విశ్రాంతిదినము యొక్క పవిత్ర ఘడియలలో మనము మన సొంత పనిని చేయకూడదు. విశ్రాంతిదినము సిలువకు కొట్టబడెనని చెప్పువారు, అంతేకాక, ప్రతిరోజూ ఆరాధించువారు, పనిని గూర్చిన ముఖ్యమైన విషయాన్ని కోల్పోతారు.
చిన్న పిల్లల హృదయాలు సృష్టికర్తకు ఆకర్షించబడతాయి. వారు పరిశుద్ధాత్మకు దగ్గరగా వచ్చుటలో చాలా ఆత్రంగా స్పందిస్తారు. |
మనము ప్రతి దినాన ఆరాధించాలి! సృష్టికర్తతో కలిసి రోజును ప్రారంభించుట చాలా ముఖ్యం. నా పిల్లలు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే, 3 నుండి 4 సంవత్సరాల వయస్సులో, వారు "యహూషువఃతో నిశ్శబ్ద సమయాన్ని" కలిగి ఉన్నారు, అక్కడ వారు CD లో బైబిలు కథలను వినేవారు, బైబిల్ కథల పుస్తకాలను మొదలైనవి చూసేవారు. మరియు, ఆ దినం యొక్క దీవెనలను గుర్తుచేసుకుంటూ ఆ దినాన్ని ముగించుట, ప్రార్థన, మరియు కృతజ్ఞతార్పణలు, ఇవన్నీ మనస్సును ప్రార్థనా పూర్వకమైన ఆత్మలో ఉంచుతాయి, అలా మరుసటి ఉదయానికి మన ఆలోచనలు మరింత సహజంగా యహువఃతో దినమును మొదలుపెట్టేలా చేస్తాయి.
అయితే, వ్యక్తిగత ఆరాధనలు, మరియు ఉదయ సాయంత్రముల కుటుంబ ఆరాధనలతో కూడిన ఒక సాధారణమైన పనిదినము ఎన్నటికీ సాధారణ రోజువారీ కార్యకలాపాలను పక్కన పెట్టి కేవలం యహువః పై మాత్రమే దృష్టి కేంద్రీకరించే దినంతో సమానం కాదు.
నా సొంత మాటలు మాట్లాడకుండుట
మనం చాలా సాధారణంగా ఈ అంశాన్ని మర్చిపోవుట జరుగుతూ ఉంటుంది. మనము విశ్రాంతిదినపు భోజనాన్ని మనతో కలిసి సంతోషించుటకు అతిథులుగా ఆహ్వానించిన వారితో, లేదా మనం ఇతర గృహ-చర్చిల కుటుంబాలతో కలిసి విశ్రాంతిదినపు భోజనాన్ని పంచుకొనుటకు కూర్చుండినప్పుడో, మన స్వంత మాటలను మాట్లాడటం చాలా సాధారణంగా జరుగుతుంది.
అలాంటి సమయాన్ని యహువఃను మహిమపరచడానికి, ఆయన వాక్యము నుండి నేర్చుకున్న పాఠాలను చర్చించడానికి మరియు గత వారమంతా ఆయన మనల్ని ఆశీర్వదించిన అనేక మార్గాలను గూర్చి పంచుకునేందుకు ఉపయోగించినట్లయితే ఆ సహవాసం అద్భుతమైన ఆశీర్వాదంగా ఉంటుంది.
అయితే, చాలా తరచుగా, తల్లులు తమ పిల్లల యొక్క జీవితాలలో సంభవించే కార్యములు లేదా సంఘటనల గురించి మాట్లాడటం మొదలు పెడతారు. పురుషులు తమ అభిమాన ఫుట్బాల్ జట్టు గెలిచిన స్కోరు గురించి లేదా వారి వాహనంతో బాధపడుతున్న సమస్యల గురించి మాట్లాడతారు. వీటిలో ఏదియూ యహువఃపై దృష్టి పెట్టదు, ఎందుకంటే మన దృష్టి ఆయన నుండి తొలగించబడి, లౌకిక విషయాల పైపు మారుతుంది.
విశ్రాంతిదినములో నిజంగా ఆనందించాలంటే, మన సొంత మాటలు కాక, యహువః యొక్క మాటలను మాట్లాడటం ప్రాముఖ్యం.
నా సొంత ఆనందాన్ని కోరుకోకుండుట
ఇది స్వయంగా స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగానే, మీరు విశ్రాంతి దినము యొక్క పవిత్రమైన సమయాలలో బంతి ఆటకి లేదా ఒక పార్టీకి లేదా కచేరీకి వెళ్ళడం లేదు. కానీ విశ్రాంతి దినాన సంతోషాన్ని అందించుటలో ఈ అంశం ముందటి రెండు అంశాల కన్నా ఎక్కువ లోతుగా ఉంటుంది.
యహువః సేవలో తమ జీవితాన్ని అంకితం చేసుకున్న ప్రజల కోసం, ఇది చాలా ముఖ్యమైనది. WLC బృందం యొక్క ఒక భాగం అయిన వారిగా, మనము వెబ్సైటుకు లేదా WLC రేడియో కార్యక్రమాల కోసం పనిని చేయుట, ఇ-మెయిల్ లకు సమాధానమిచ్చుట చాలా సులభంగా చేయగలము, అంతేకాకుండా, ఇది యహువః పని. అవునా?
కానీ వాస్తవానికి, మనము యహువః పని చేయుటకు ఇష్టపడుతున్నాము! ఈ పరిచర్యలో భాగంగా ఉండుటను మనము ప్రేమిస్తున్నాము. నా కోసం మాట్లాడితే, ఇతరులకు సత్యాన్ని పంచే విషయంలో కొంత భాగాన్ని కలిగి ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరియు అది నాకు వ్యక్తిగత సంతృప్తిని ఇస్తుంది. వెబ్సైట్లో పాఠకులచే ఇవ్వబడుచున్న వ్యాఖ్యలన్నీ (కామెంట్లు) నా హృదయాన్ని ఇంకా ఉత్సాహపరుస్తున్నాయి మరియు Wlc కి యహువః ప్రసాదించిన సత్యాలను ఇతరులతో మరింత గట్టిగా మరియు మరింత జాగరూకతతో విస్తరించు విషయంలో నన్ను మరింత ప్రేరేపిస్తున్నాయి.
కానీ చూడండి, అది కూడా నా స్వంత ఆనందాన్ని కోరుతుంది. నేను విశ్రాంతి దినములో నా స్వంత ఆనందాన్ని కోరుకొనుట లేదు. నేను యహువః ఆనందాన్ని కోరుకుంటాను. విశ్రాంతి దినము నేను నా ఆనందాన్ని కోరుకునే సమయం కాదు. ఇది యహువః ఆనందాన్ని కోరుకునే సమయం. మరియు ఎప్పుడైతే ఇలా చేస్తానో, అప్పుడు నేను కూడా చాలా ఆనందాన్ని పొందుతాను!
మీరు తండ్రికి "ఎక్కువగా ఇవ్వలేరు" అని తరచూ చెప్పుదురు, మరియు సంతోషం విషయానికి వచ్చినప్పుడు, అది నిజమే. మన చుట్టూ ఉన్నవారికి మనం ఒక ఆశీర్వాదంగా ఉండుట అనేది తండ్రి ఆనందాన్ని చూడగల మార్గాల్లో ఒక మార్గమై యున్నది. హెబ్రీయులకు 4:15 ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తోంది: “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.”
ఇంకో మాటలో చెప్పాలంటే: మనము ఏమి అనుభూతి చెందుతామో దానిని ఆయన కూడా అనుభూతి చెందుతాడు. మన హృదయాలను పులకరింపజేసే ప్రతి సంతోషకరమైన భావోద్వేగం, మన ఆత్మను కంపింపజేసే ప్రతి ఆయాసకరమైన బాధ, యహువః హృదయాన్ని తాకును. ఈ అవగాహన మత్తయి 25 లోని యహూషువః యొక్క మాటలకు మనం అర్థం చేసుకున్నదానికంటే మరింత లోతైన అర్థాన్ని ఇస్తుంది: “అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.” (మత్తయి 25:40, KJV)
మనము బాధపెట్టినప్పుడు, యహువః గాయపర్చబడును. బాధపడుతున్న వ్యక్తి తన బాధ అర్థం చేసుకొనబడెను అనే ఆలోచన కరిగియుంటే, అలా ఓదార్పు పొందగలడు, మరియు అది మనం ఏమి చేయాలనేదానిని తెలుసుకొనుటకు ప్రేరణనిస్తుంది, మరియు నిజమైన, అక్షరార్థమైన రీతిలో, తండ్రి యొక్క బాధ నుండి ఉపశమనం కలిగించి, ఆయనను ఆనందింపజేయవచ్చు.
అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింప బడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును.
అందుకు నీతిమంతులు అదోనాయ్, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?
ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?
ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.
అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. (మత్తయి 25: 34-40, KJV)
బలపరుచుటకు మరియు సహాయం చేయుటకు మనము యహువః యొక్క చేతులై ఉండాలి, ఓదార్చుటకు మరియు ఉత్సాహం నింపుటకు ఆయన స్వరమై యుండాలి. ఆయన తన పిల్లలు అనుభూతి చెందుతున్న దానిని అక్షరాలా అనుభూతి చెందుతున్నప్పుడు, మన ప్రభావంలో ఉన్నవారి బాధకు దుఃఖానికి లేదా ఒంటరితనానికి మనం ఉపశమనం కలిగించినప్పుడు, మనం ఆయన యొక్క బాధను దుఃఖాన్ని తొలగించి అక్షరాలా ఆయనను సంతోషపరుస్తాము!
ఒంటరిగా, సమస్యలతో ఉన్న, నిరాశకు గురైనవారికి పరిచర్య చేసినప్పుడు, మనం నిజమైన మార్గంలో ఉందుము మరియు తండ్రి అనుభవిస్తున్న బాధకు ఉపశమనం కలిగించుదుము, ఎందుకంటే తన పిల్లల బాధను ఆయన కూడా అనుభూతి చెందును. విశ్రాంతిదినము అనేది "మిక్కిలి అల్పులైన" వారిని చేర్చుకొనుటకు మరియు తండ్రిని మహిమపరుచుటకు ఒక అద్భుతమైన సమయం. |
ప్రపంచమంతటా, చాలామంది ప్రజలు, ఆరు దినాలు పనిచేస్తారు. నేను నివసిస్తున్న దేశంలో, 72 గంటల పని వారపు నియమం = రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు. మనము విశ్రాంతిదినములో స్వార్థపూరితంగా మన సొంత ఆనందాన్ని పొందకుండా, యహువః ఆనందాన్ని కోరుకున్నట్లయితే, అలా చేయుటకు విశ్రాంతి దినము ఒక అద్భుతమైన అవకాశం. చాలా అనారోగ్యంతో లేదా బలహీనంగా ఉన్న ఒక వృద్ధ వ్యక్తి ఏమియు లేక మరియు చాలా ఒంటరిగా ఉండవచ్చు. విశ్రాంతిదినము భోజనానికి, బైబిలు అధ్యయనానికి అతడిని మీ ఇంటికి ఆహ్వానిస్తే అది తనను సంతోషింపజేస్తుంది. యవ్వనంలో ఉన్న ఒక తల్లి తన పిల్లలను యహువఃలో పెంచుకోవాలని కోరుకతో ఉండి, ఆ చిన్నపిల్లలపై శ్రద్ధ తీసుకునే అనేక బాధ్యతలతో మునిగిపోయి ఉండి, తమకోసం విశ్రాంతిదినమును ప్రత్యేకంగా చేసుకొనే విషయంలో ఇబ్బందులు పడుతూ యుండవచ్చును. మీ కుటుంబం యొక్క విశ్రాంతి దినపు ఆరాధనలో ఆమె కుటుంబంను ఆహ్వానిస్తే ఆమెకు చాలా ప్రోత్సాహంగా ఉంటుది.
మరియు మనము ప్రతి మార్గంలోనూ యహువః యొక్క ఆనందాన్ని కోరుకుంటే, మరియు మన సొంత ఆనందానికి బదులుగా ఆయన ఆనందాన్ని కోరుకుంటే, మనం పొందే ఆనందం మనం ఇచ్చే ప్రతి దానిని మించి మనకు లభిస్తుంది.
విశ్రాంతిదినము కోసం ఎదురు చూచుట!
విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలని యహువః కోరుచుండెనో అనే ఈ అవగాహన WLC బృందాన్ని విప్లవాత్మకంగా చేసింది. మాలో ప్రతీ ఒక్కరికి మమ్ములను ఆశీర్వదించి ఇవ్వబడిన సత్యాలను నెరవేర్చవలసిన బాధ్యత ఉన్నదని మరియు మేము విశ్రాంతి దినపు ఆశీర్వాదము యొక్క సంపూర్ణత్వాన్ని స్వీకరించటానికి విఫలమౌతూ ఉన్నందుకు మేమందరం పశ్చాత్తాపాన్ని కోరుతున్నాము.
ఒక బృంద సభ్యుడు ఇలా అన్నాడు: "విశ్రాంతిదినములో ఆనందించుటను గురించి నా జీవితంలో నేను ఎన్నడూ వినలేదు. నేను దానిని ఆచరించుటను గూర్చి, గైకొనవలసిన దానిని గూర్చి ప్రసంగాలను విన్నాను. కానీ ఎప్పుడైతే పై మూడు సూత్రాలను నేను గమనించానో, విశ్రాంతి దినము వెంటనే ఆహ్లాదంగా మారింది! తక్షణమే!"
"నాజీవితంలో చాలా కాలం విశ్రాంతిదినమును ఆహ్లాదకరంగా ఆచరించకుండా నేను పరలోకం యొక్క జీవ-మార్గంలో లేనప్పటికీ, జీవితపు ఈ చివరి దశలో, ఇప్పుడు తెలుసుకొనునట్లు ఆయన నా జీవితాన్ని పొడిగించినందుకు నేను యహువఃకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను." ~ WLC టీమ్ సభ్యుడు |
బృంద సభ్యుడు మరొకరు ఇలా చెబుతున్నారు: "నేను నా జీవితంలో, గడిచిన సంవత్సరాలన్నింటిలో, ఇతరులకు విశ్రాంతిదినమును భారమైన దినంగా ప్రచారం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. కానీ ఇప్పుడు, నేను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను: ఇది నిజంగా ఆహ్లాదకరమైన దినము!"
యహువః నియమించిన విధంగా మీరు విశ్రాంతిదినమును ఆచరించినప్పుడు, అద్భుతమైన పరివర్తన జరుగుతుంది. మీరు మునుపెన్నడూ అనుభవించని కొత్త మార్గంలో విశ్రాంతిదినము కోసం ఎదురు చూస్తారు.
విశ్రాంతిదినము నిజంగా సంతోషకరమైన దినమై ఉన్నందున, నేను ఇప్పుడు దీనికోసం వారమంతటా ఎదురుచూస్తున్నాను. ఎదురుచూడటమే కాకుండా నేను విశ్రాంతిదినము యొక్క చివరలో చిన్నపిల్ల వలె భావిస్తున్నాను, అది ముగిసినప్పుడు నేను నిజాయితీగా విచారంగా ఉన్నాను. యహ్ యొక్క సూచనలను అనుసరించడం ద్వారా, విశ్రాంతిదినమునందు మరియు విశ్రాంతి దినాన్ని ఇచ్చిన ఆయనయందు నేను ఆనందిస్తున్నాను, మరియు అందులో పొందుచున్న ఆశీర్వాదం అంతకుమునుపెన్నడూ నేను ఊహించలేనిదిగా ఉన్నది. నేను మీ కోసం కూడా దీనినే కోరుకుంటాను.
విశ్రాంతిదినము మానవ నిర్మిత సంప్రదాయాలతో మరియు పరిసయ్యుల అంచనాలతో నిండియున్నప్పుడు, అది ఒక భారంగా మారుతుంది. కానీ యహువః సూచనల యొక్క సరళతలో విశ్రాంతిదినమును పాటించినప్పుడు, మన సొంత పనిని చేయము, మన సొంత మాటలు మాట్లాడము, లేదా మన సొంత ఆనందాన్ని కోరుకోము, అప్పుడు మన దృష్టి: సమస్త ప్రేమకు మరియు సంతోషానికి, ఆనందానికి, మరియు సఫలీకృతానికి మూలమైన ఆయనపై ఉంటుంది.
విశ్రాంతిదినములో ఆనందించుట ద్వారా నీవు యహువఃను గౌరవిస్తే, నీకు నిత్యజీవము ఇవ్వబడుతుంది. ఇది గ్రహించవలసిన ఒక ముఖ్యమైన అంత్య-కాలపు పాఠమైయున్నది. యహువః, తన గొప్ప దయతో, మనము ఈ గొప్ప సత్యాన్ని నేర్చుకొనునట్లు అంత్యకాలపు సంఘటనలను నెమ్మదింపజేయుచున్నాడు. విశ్రాంతిదినములో ఆనందించేవారందరి కొరకు అద్భుతమైన ప్రతిఫలం ఎదురుచూస్తుంది. దీని ప్రకారం చేయువారందరూ మన తండ్రియైన యాకోబు స్వాస్థ్యముతో పోషించబడుదురని యెషయా 58 వ అధ్యాయం 14 వ వచనం వాగ్దానం చేస్తుంది. యహువః మీకు చెబుతారు: "మీరు నావారు. మీరు నా ప్రత్యేకమైన 144,000 మందిలో ఒకరు. మీరు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు పరలోకానికి చెందినవారు! "
ఒక సవాలు
అతడు లేదా ఆమె, తమ తమ సొంత హృదయాన్ని పరిశీలించుకోవాలని ఈ మాటలను చదివే ప్రతి ఒక్కరిని సవాలు చేయుటకు WLC బృందం కోరుకుంటుంది. విశ్రాంతిదినము నిజంగా మీకు ఎంతో ఆహ్లాదకరంగా ఉందా? లేదా, మీరు నిజాయితీగా చెప్పండి, అది ఒక భారంగా ఉందా? విశ్రాంతి దినము ముగిసినప్పుడు (చివర్లో) మీరు ఉపశమనం పొందుతున్నారా? మరొక పూర్తి వారం వరకుగాని మళ్ళీ అది తిరిగి రాదని బాధపడుతున్నారా?
యెషయా 58 లో ఉన్న ఆదేశాన్ని ఆలింగనం చేసుకోండి. మానవుల సంప్రదాయాలను విడిచిపెట్టండి. మీరు ఇలా చేసినప్పుడు, విశ్రాంతిదినము యొక్క ఆనందం మరియు యహువః యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. |
మీ హృదయాన్ని పరిశీలించుచున్నప్పుడు, విశ్రాంతి దినము సంతోషకరమైన దినానికి బదులు ఎక్కువ భారమైన దినంగా ఉన్నట్లు మీరు కనుగొన్నట్లయితే, నిరుత్సాహపడకండి! మీరు యహువఃను గౌరవించాలనే విషయంలో ఈ మూడు షరతులను పాటించినట్లయితే, ఆయనను గౌరవించి ఆయనయందు ఆనందిస్తారు. విశ్రాంతి దినము, మిమ్మల్ని సృష్టించిన వానితో మరియు మంచి స్నేహితునితో కలిసి గడుపుటకు ప్రత్యేక సమయమై ఉంది, మరియు అది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకనూ, ఆ పవిత్ర ఘడియలలో లభించిన ఆశీర్వాదాలు వారమంతటా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి, మరియు మీరు వెళ్ళు మార్గములలో ఎదురయ్యే ప్రతి శోధనలోనూ మిమ్మల్ని కాపాడుచుండును. యహువః యొక్క ఆత్మ, పవిత్ర ఘడియలలో మీతో చాలా లోతుగా పాలుపంచుకుంటుంది, మరియు మీతో స్థిరంగా సహవాసం చేయును అలా మీరు ఆ మరుసటి విశ్రాంతిదినము కొరకు ఆనందంగా ఎదురుచూస్తూ ఉత్సాహంగా స్వాగతిస్తారు. అది నిజంగా మీకు ఆహ్లాదకరమై ఉంటుంది.
ఇది యహువఃతో ఐక్యమవుట. మీలో ఆయన, ఆయనలో మీరు ఒకరితోఒకరు ఆనందంగా సహవాసం చేయుదురు. విశ్రాంతిదినము ఒక ఆహ్లాదం, మరియు ఇక్కడ ప్రారంభమైన ఆహ్లాదం అన్ని సమయాలలో చివరివరకు కొనసాగుతుంది. ఇది ఎన్నటికీ తీసివేయబడని శాశ్వతమైన బహుమానం. శాశ్వతమైన యుగాల కాలం అంతటా విమోచించ బడినవారు సృష్టికర్తను ఆరాధించుటకు ప్రతి నెలారంభ దినమున మరియు ప్రతి విశ్రాంతి దినమున కూడి వచ్చెదరు.
“ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహువః సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 66:23)
పిల్లలు పరలోక కుటుంబానికి చెందిన లేత వయస్సు గలవారు, కావున పెద్దవారందరూ వారితో గౌరవంతో మరియు దయతో వ్యవహరించాలి. పరలోక సత్యాలను పిల్లలకు బోధిస్తున్నప్పుడు, వారి మృదువైన, లేత మనస్సులు గ్రహించగలవు, మరియు యహువః యొక్క ఆత్మ వారిని ఆకర్షిస్తుంది. వారి హృదయాలు సున్నితంగా ఉంటాయి మరియు వారు కూడా విశ్రాంతిదినములో ఆహ్లాదాన్ని పొందుతారు. |
1 http://www.patheos.com/blogs/friendlyatheist/2014/11/19/cant-turn-off-your-lights-on-the-sabbath-no-problem-just-ask-the-local-police-to-do-it-for-you/, retrieved Nov. 20, 2017.