దైవిక నడిపింపు: యహువః యొక్క చిత్తాన్ని వ్యక్తిగతంగా ఎలా కనుగొనాలో తెలుసుకోండి!
“మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును..” (యెషయా 30:21) |
భూమి యొక్క చివరి సంక్షోభం ద్వారా జీవించుటకు పరలోక తండ్రితో అపోస్తలుల కాలం నుండి కలిగియున్నదానికన్నా, మరింత ఎక్కువ ప్రాముఖ్యమైన, సన్నిహిత సంబంధం అవసరం. ప్రతి విశ్వాసికి వ్యక్తిగత నడిపింపు అవసరం ఎందుకంటే ప్రతి విశ్వాసి యొక్క వ్యక్తిగత పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. కావున తండ్రితో వ్యక్తిగత సంబంధాన్ని మాత్రమే కాక, ఆయన మాట్లాడునప్పుడు ఆయన స్వరాన్ని విని గుర్తించగల సామర్థ్యాన్ని కలిగియుండుట కూడా అవసరమవుతుంది.
నిర్దిష్టంగా ఉండండి
మీ జీవితం విషయంలో యహువః సంకల్పాన్ని తెలుసుకొనుటలో గల మొదటి విషయం, ఆయన నడిపింపును అడుగుట. మీరు ప్రార్థన చేయునప్పుడు, చాలా నిర్దిష్టంగా చేయండి. మీ పరిస్థితికి వర్తించే వాగ్దానాల నెరవేర్పును అడగండి. మీరు ప్రార్థించేటప్పుడు ఎంత నిర్దిష్టంగా ఉంటే, అంత నిర్దిష్టంగా మీకు సమాధానాలు ఉంటాయి.
చాలామంది విశ్వాసులు అస్పష్టమైన, ముగింపు-లేని అభ్యర్ధనలను చేస్తూ తప్పు చేస్తారు, ఎందుకంటే వారు తప్పుడు విషయము కోసం అడుగుటకు భయపడుటవలన. నిర్దిష్టంగా ప్రార్ధించకుండా చేయు దీనిని మీరు అనుమతించకండి. మీ ఇష్టాలను “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అంటూ తండ్రి చిత్తానికి అప్పగించినంతకాలం మీ పరిస్థితికి తగినట్లుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయుదురు!
నిర్దిష్ట అభ్యర్థనలు నిర్దిష్ట జవాబులను పొందును.
విశ్వాసాన్ని వ్యాయామం చేయండి
మీ భావాలను విశ్వాసంతో తికమకపరచవద్దు. ఈ రెండూ పూర్తిగా వేరైనవి! విశ్వాసం అనేది కేవలం యహువః యొక్క వాక్యాన్ని ఏ ఇతర సాక్ష్యము అవసరం లేకుండా నిజమని నమ్ముట. యాకోబు ఇలా చెప్పాడు: మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు ఎలోహీంని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. (యాకోబు 1: 5-6)
వినుటను నేర్చుకోండి
నడిపింపు అవసరమైన ప్రజలు తరచుగా దైవిక కలలను లేక దర్శనమును కోరుదురు. అయితే, ఇది యహ్ యొక్క సంభాషణలలోని పద్ధతి కాదు. మీ చెవులకు వినిపించే స్వరము అవసరం లేదు, అయితే మీరు వినుట అవసరం. విశ్వాసులు తరచుగా "వారి హృదయాలను వినుటకు" భయపడుదురు, కానీ అలా ఉండకూడదు. యహువః తన పిల్లలతో మాట్లాడుటలోని చాలా సాధారణ మార్గం, నిశ్శబ్దమైన చిన్న స్వరము ద్వారా ఉంటుంది. మీ హృదయంలో ఉన్న ఆయన స్వరము మిమ్మల్ని తప్పుదారి పట్టించదు లేదా తప్పు చేయమని చెప్పదు. ఆయన ఆత్మ యొక్క మృదువైన, సున్నితమైన సూచనలపై దృష్టిని కేంద్రీకరించుటను నేర్చుకోండి. మీ ఈ అభ్యాసం ద్వారా, ఆ మృదువైన స్వరము బిగ్గరగా మరియు సులభంగా గ్రహించుటకు వీలుగా అభివృద్ధి చెందుతుంది.
యహువః యొక్క చిత్తాన్ని తెలుసుకొను మరొక మార్గం లేఖనాలలో ఉంది. చాలా ప్రత్యేకమైన అవసరత కొరకు ప్రార్థించండి మరియు అడగండి. ఒక సమయంలో ఒక్క అవసరతను మాత్రమే అడగండి. అప్పుడు, మీ బైబిలును ఏచోటనైనా తెరిచి అనేక పేజీలను చదవండి. మీరు దీనిని చాలా దినములు చేయవలసి ఉంటుంది. కానీ యహువః మీతో మాట్లాడునప్పుడు మీరు తెలుసుకుంటారు. పదాలు పేజీ నుండి దుముకుతూ వస్తాయి, మరియు ఇది మీకు ఆయన జవాబు అని మీ మనస్సును ఆకర్షిస్తుంది.
మీ జవాబు ఎల్లప్పుడూ లేఖనాలలోని మాటలనుండి రాకపోవచ్చు. ఇతర మాటలనుండి కూడా తెలుసుకోండి. మీ ఇంటిలోని మాటలు మీ మనస్సుకి ప్రకంపన కలిగించినప్పుడు, అవి మీ కోసం ఉద్దేశించబడినవని మీకు తెలుస్తుంది. ఎటువంటి సందేహం లేదు. ఇది మీ ప్రశ్నకు సమాధానం అని పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి, శ్రద్ద వహించండి!
కొన్ని సార్లు మీరు మీ స్వంతంగా ఆలోచనచేయని ఒక విషయమై, మీ మనస్సులోనికి కొన్ని పదాలు వస్తాయి. మీరు మీ చెవులతో వినిపించే స్వరాన్ని వినకపోవచ్చు, కానీ మీరు మీ మనసులో విందురు. ఇది మీ సొంత మెదడు నుండి వస్తున్నదని కాదని మీరు గుర్తించగలరు, ఎందుకంటే మీరు వేరే విషయమై ఆలోచించునప్పుడు మరొక విధమైన ప్రకటన చేయబడుతుంది. ఇలా జరిగినప్పుడు, వినండి. యః నుండి వచ్చే అటువంటి ప్రకటనలు తప్పు అని మీకు తెలిసిన వాటిని చేయమని చెప్పవు, కాబట్టి చెప్పబడునది మీరు నమ్మవచ్చు.
యహువః నడిపింపులోని మరొక విధానం, ఏదేని ఒక పనిని ఆలోచించేటప్పుడు శాంతియుతమైన భావనను కలిగించుట, మరియు తప్పుడు ఎంపికను పరిగణలోకి తీసుకున్నప్పుడు మనస్సులో అసంతృప్తిని కలిగించుట ద్వారా ఉంటుంది. యహువః తన పిల్లలను నడిపించు విధానాలలో ఇది ఒకటి.
కేవలం కూర్చుని ఉండవద్దు! లేచి, నడవుము!
మీరు మీ మనస్సులో ఒక స్వరం ద్వారా గాని, ఒక ప్రత్యేక బైబిలు వాక్యము లేక ఇతరుల మాటలు ద్వారా గాని, మిమ్మల్ని జవాబు పొందినట్లు ఆకర్షించినట్లైతే, మీకు చెప్పబడినదానిపై చర్య తీసుకొనుట ప్రారంభించండి! యహువః మిమ్మల్ని నడిపించుటకు వాగ్దానం చేసెను, కానీ "నడిపింపు" అనేది ఒక క్రియా చర్య. మీరు కదలకుండా కూర్చొని, మీ చేతులను ముడుచుకుని, ఏమి చేయవలెనో నాకు తెలియదు అని చెప్పుట ద్వారా మీరు నడిపింపబడలేరు!
మీరు ముందుగానే ఐదు దశలను చూడలేకపోవచ్చు, కానీ మీరు తదుపరి దశను తీసుకొనుటకు తగినంత మార్గం చూపబడిన యెడల, సరిపోతుంది. మీరు తదుపరి దశను తీసుకోవాలి. మీరు ఎంత త్వరగా అనుసరిస్తే అంత త్వరగా యహువః మిమ్మల్ని నడుపును, అయితే తన నడిపింపును కొనసాగించాలని మీరు అనుకుంటే మీరు ముందుకు సాగాలి.
మీరు సమాధానాలను పొందలేకపోతున్నారని భావిస్తే, తిరిగి ఆలోచించండి: ఆయన ఇప్పటికే మీకు మార్గంచూపగా మీరు విధేయత చూపలేదేమో? మీరు ఎంత త్వరగా అనుసరించుటకు ఇష్టపడితే అంత వేగంగా ఆయన నడపగలడు.
సమాచారాన్ని సేకరించుము
ఇవ్వబడిన దిశలను ఎలా వెంబడించాలో మీకు తెలియకపోవచ్చు. కాబట్టి, సమాచారాన్ని సేకరించండి. మీరు సమాచారాన్ని సేకరించడం ద్వారా, మీరు తదుపరి దశను స్పష్టంగా చూస్తారు. అప్పుడు, మీరు సేకరించిన సమాచారం ఆధారంగా, మీకు తెలిసిన ఉత్తమ నిర్ణయం తీసుకోండి, మరియు ముందుకు అడుగువేయండి.
తలుపులు తెరుచుట మరియు మూయుట ద్వారా మీకు మార్గనిర్దేశం చేయునట్లు యహువఃను విశ్వసించుము. ఒక తలుపు మీ ముఖం మీద మూసివేయబడినట్లయితే కలత చెందకండి. మూసిన తలుపులు తెరిచిన వాటి వలె మంచి సమాధానాలు. యహువః భవిష్యత్తును ఎరుగును. నీవు కాదు. కనిపించని ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు తెలపండి.
ఒక మూయబడిన తలుపును తెరుచుటకు ప్రయత్నిస్తూ సమయం వృధా చేయకండి. ఒక కారణం వలన యహువః దానిని మూసివేసెను. ఆయనను నమ్మండి, మరింత సమాచారం సేకరించండి, మరియు మరొక దిశలో ముందుకు అడుగువేయండి.
కృతఙ్ఞతతో ఉండండి
లేఖనం ఇలా చెప్పుచున్నది: “యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యహూషువఃనందు మీ విషయములో ఎలోహీం చిత్తము.” (మొదటి థెస్సలోనీయులకు 5:17-18) ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ప్రతి పరిస్థితిలోనూ ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచండి. కృతజ్ఞత గల మనస్సు అనేక అవకాశాలను చూస్తుంది, అయితే ప్రతికూలంగా, ఫిర్యాదు చేసే మనస్సు, అవాస్తవిక అంచనాల నిరాశను మాత్రమే చూస్తుంది.
ముందున్న దినాలు మునుపెన్నడూ లేని ప్రమాదాలతో నిండి ఉన్నాయి. వాటి ద్వారా నివసించు ఒక వ్యక్తి ఖచ్చితంగా వ్యక్తిగతంగా యహువః యొక్క చిత్తాన్ని తెలుసుకొనుట అవసరం. మనతో సంబాషణ చేయుటకు యహువః విముఖంగా లేడు! చాలామంది ప్రజలు తాము చేయవలసిన పనిని గూర్చి తెలియజేయబడుదురు కానీ వారు విధేయత చూపరు.
మీరు యహువః నడిపింపును కోరినయెడల, మీరు నిలబడాలి మరియు ఆయన నడిపింపును అనుసరించాలి! మీరు ఇలా చేస్తే, ఆయన మిమ్మల్ని సురక్షితంగా నడుపును.