ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
నా జీవితంలో చాలా వరకు నేను యహూషువః పూర్వ ఉనికిలో ఉన్నాడని మరియు ఆ అవగాహనను నిరూపించుటకు సామెతలు 8:22-31 అధ్యాయాన్ని ఉపయోగించవచ్చని అర్థం చేసుకున్నాను. దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం, సామెతలు 8:22-31ను విభిన్నంగా అర్థం చేసుకోవచ్చని చూపించే సమాచారం నాకు అందించబడింది. అనగా ఈ అధ్యాయంలో చెప్పబడిన “జ్ఞానం” అనేది మానవునికి పూర్వం ఉన్న ఆత్మ (తరువాత యహుషువఃగా జన్మించిన ఆత్మ, ఆదికాండము 1లో వివరించబడిన సృష్టికి సృష్టికర్తగా లేదా మధ్యవర్తిగా వ్యవహరించిన ఆత్మ) యొక్క వ్యక్తిగతీకరణ కాదు; కానీ "జ్ఞానం" కేవలం ఒక స్త్రీలింగం గా వ్యక్తీకరించబడింది. కాబట్టి నేను ఈ భాగాన్ని ముందుగా ఉనికిలో ఉన్న యహూషువఃను రుజువు చేసే వచనాలలో ఒకటిగా ఉపయోగించలేకపోయాను. అప్పటినుండి నుండి వివిధ బైబిల్ విషయాలపై వివిధ నమ్మకాలు గల అనేక చిన్న చిన్న క్రైస్తవ సమూహాలు ఉన్నాయని నేను కనుగొన్నాను, అయితే అందరూ సామెతలు 8:22-31 లోని “జ్ఞానాన్ని” వ్యక్తిగా అర్థం చేసుకున్నారని మరియు ఇది ఎన్నటికీ అలా అన్వయించబడదని నేను కనుగొన్నాను. యహుషువః పూర్వ-ఉనికిలో ఉన్న వ్యక్తి కాదు, లేదా మరొక విధంగా చెప్పాలంటే - అతనికి మానవ-పూర్వ ఉనికి లేదు.
కానీ 1 కొరింథీయులు 1:24, 31 మరియు కొలస్సీ 2:3 ఈ రెండు భాగాలూ సామెతలు 8:22-31ను ఆదికాండపు సృష్టిలో పనిచేసిన ముందుగా ఉన్న యహూషువఃకు సూచనగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నది నిజం కాదా?
ఈ వచనాలు ఇలా ఉన్నాయి: "క్రీస్తు యహువః శక్తియును జ్ఞానమునైయున్నాడు… అయితే ఆయన మూలముగా మీరు యహూషువః క్రీస్తు నందున్నారు, యహువః మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను (1 కొరిం 1:24, 31). మరియు "బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తు నందే గుప్తములైయున్నవి." (కొలస్సీ 2:3). ఇక్కడ పౌలు యహుషువఃను సామెతలు 8 లోని “జ్ఞానము”తో అనుసంధానిస్తున్నట్లు అనిపిస్తుంది, కాదా?
కానీ ఒక చిన్న ఆలోచన మనల్ని ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకొనేలా చేయొచ్చు. ఉదాహరణకు 1వ కొరింథీయులు 1:31 కూడా యహూషువః "నీతి మరియు పరిశుద్ధత" అవుతాడని చెబుతోంది. కాబట్టి మిగతా లేఖనాలలో ఈ వచనాలను చూసినప్పుడల్లా అది యహుషువః గురించి మాట్లాడుతున్నట్లు మనం నిర్ధారణకు రావాలని భావిస్తున్నామా? కొంచెంగా! కాబట్టి ఇది జ్ఞానం అనే పదం విషయంలో కూడా అలాగే ఉండాలి. లేఖనాలలో “జ్ఞానం” అనే పదాన్ని చూసినప్పుడల్లా, అది యహూషువః అని మనం స్వయంచాలకంగా భావించము. ఇంకా, లూకా 11:49/మత్తయి 23:34 యొక్క సమాంతర-సారాంశ వృత్తాంతాలు యహువః యొక్క జ్ఞానం రెండవ వ్యక్తి కాదని, యహువఃయే అని చూపిస్తాయి. "యహువః జ్ఞానము చెప్పినదేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును" (లూకా 11:49) అని లూకా మనకు చెప్పాడు. అయితే, మత్తయిలో సమాంతరంగా, “ఇదిగో నేను [యహువః] మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. ” (మత్త. 23:34).
అదనంగా, నేను ఇటీవల సామెతల గ్రంథంపై ది న్యూ అమెరికన్ కామెంటరీ, వాల్యూమ్ 14ని కొనుగోలు చేసాను మరియు సామెతలు 8:22-31 లోని జ్ఞానాన్ని ముందస్తు-మానవ యహూషువఃగా అర్థం చేసుకొనుటలో 1 కొరింథీయులు 1:24, 31 వచనాలను ఎందుకు ఉపయోగించకూడదో మరిన్ని కారణాలను కనుగొన్నాను. అది ఇలా పేర్కొంది:
“సామెతలు 8 ని క్రీస్తు యొక్క పాత నిబంధన చిత్రముగా తీసుకోవడానికి బహుశా బలమైన వాదన 1 కొరింథీ 1:24. ఇక్కడ పౌలు క్రీస్తును యహువః యొక్క "జ్ఞానం" అని పిలుస్తాడు. అయితే, పదాలను నిశితంగా పరిశీలిస్తే, క్రీస్తు గురించి పౌలు చేసిన వర్ణన సామెతలు 8 ను సూచించలేదని తెలుస్తుంది. మరియు సామెతలను ఈ విధంగా అర్థం చేసుకొనుటకు ఇది ఎటువంటి ఆధారాన్ని అందించదు.
“మొదటిగా, 1 కొరింధీ 1:24 లో పౌలు ఉద్దేశం క్రీస్తుకు సంబంధించిన పాత నిబంధన లేఖనాలను సూచించడం కాదు, కానీ సిలువ అపవాదును నివారించుటకు. ముఖ్యంగా అతడు సిలువ వేయబడిన యహూషువః యహువః యొక్క కుమారుడని మరియు ప్రపంచ రక్షకుడని ప్రకటించినప్పుడు తనకు విరోధంగా కల్పించబడిన నేర సమస్యను ఎదుర్కొంటాడు. ఎందుకంటే గ్రీకులకు అది అవివేకం. క్రీస్తు అనగా యహువః యొక్క జ్ఞానం అని అతడు చెప్పినప్పుడు, మానవ ఆలోచన ఏవిధంగా ఆలోచించినప్పటికీ, అతడు సిలువ వేయబడిన క్రీస్తు యహువః యొక్క లోతైన రక్షణ మార్గం అనే అర్థం వచ్చేలా క్రియాత్మకంగా మాట్లాడాడు. మెస్సీయ అనంతమైన శక్తితో వస్తాడని ఆశించే యూదులకు ప్రతిస్పందనగా అతడు అదే వచనంలో క్రీస్తును యహువః యొక్క శక్తి అని కూడా పిలుస్తాడు.
“రెండవదిగా, పౌలు యొక్క వ్యాఖ్యను తీసుకొని దానిని పాత నిబంధన గ్రంథానికి వివరణాత్మక అల్లికగా చేయడం సముచితం కాదు, దాని గురించి పౌలు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అదేవిధంగా, ఎవరైనా యహువః యొక్క శక్తిని వివరించే వచనాన్ని తీసుకొని (ఉదా., కీర్తనలు. 78:4) దానిని నిజంగా 1 కొరింథీ 1:24 ఆధారంగా క్రీస్తును గూర్చిన వర్ణన అని చెప్పకూడదు. ఒకరు 1 యోహాను 4:8 (“యహువః ప్రేమయైయున్నాడు”) ని తీసుకుని, దాని ఆధారంగా 1 కొరింథీ 13 నిజంగా యహువఃను గూర్చిన విశ్లేషణగా చదవడానికి ఉద్దేశించబడింది అని చెప్పినట్లుగా ఉంటుంది. (పేజీ 112).
ఈ వ్యాఖ్యానాన్ని నేను చదవడానికి ముందే యాహూషువః సామెతలు 8 తో సంబంధం కలిగి లేడని నేను గ్రహించాను, ఎందుకంటే యహూషువః "జ్ఞానంలో వృద్ధి చెందాడు" (లూకా 2:52) అని లూకా మనకు చెప్పాడు. ఇది విశ్వాన్ని సృష్టించగలిగే విధంగా యహువః యొక్క సమస్త జ్ఞానాన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క చిత్రాన్ని ఇవ్వదు అందువలన ఇది సామెతలు 8 దృష్టిలో అతడు లేడని చూపిస్తుంది.
అయితే సామెతలు 8 లోని 22-24 వచనాలు “జ్ఞానం” ఉనికిలోకి వస్తున్నట్లు మాట్లాడుతున్న సంగతి ఏమిటి? నిశ్చయంగా యహువః తన జ్ఞానాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు కాబట్టి అది ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది! ఖచ్చితంగా! స్పష్టంగా యహువఃకు ఎల్లప్పుడూ జ్ఞానం ఉంది. కాబట్టి “జ్ఞానం” ఇలా చెప్పినప్పుడు మనం దానిని ఎలా అర్థం చేసుకోవాలి: “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యహువః నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని”? మళ్ళీ న్యూ అమెరికన్ కామెంటరీ ఉపయోగపడుతుంది:
“చివరిగా, సామెతలు 8 లోని స్త్రీరూపకంలో చెప్పబడిన జ్ఞానం యహువః యొక్క లక్షణాన్ని వ్యక్తీకరించదు కానీ సృష్టి యొక్క లక్షణాన్ని వ్యక్తీకరిస్తుంది. ఆమె యహువః ప్రపంచంలోనికి నిర్మించిన నిర్మాణం, ప్రణాళిక, లేక హేతుబద్ధత యొక్క వ్యక్తీకరణ. ఆమె యాహువః ద్వారా సృష్టించబడింది మరియు ప్రాథమికంగా యాహువః విశ్వం యొక్క లక్షణం" (పేజి 113).
కాబట్టి సామెతలు 8 లో వర్ణించబడిన నిర్దిష్ట జ్ఞానం యహువః యొక్క సృజనాత్మక ఉద్దేశ్యం మరియు ప్రణాళిక, అనగా సృష్టిలో పని చేస్తున్న అతని “వాక్కు” మరియు ఇది పురాతన కాలంలో ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి చేయబడినది, అనగా “కనబడెను.” అయితే, యహూషువః మరియమ్మ నుండి పుట్టే వరకు "కనిపించలేదు." కాబట్టి, స్పష్టంగా సామెతలు 8 లో జ్ఞానానికి సంబంధించిన ఈ చిత్రంలో యహూషువః లేడు.
కాబట్టి సామెతల ప్రకారం ఆదికాండపు సృష్టిని ఎవరు సృష్టించారు? మనం చాలా దూరం చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సమాధానం సామెతలు 8 లోనే ఉంది, ఇక్కడ ఆదికాండము సృష్టికి యహువః తానే నిజమైన సృష్టికర్త అని చూపించే ప్రకటనలు మనకు కనిపిస్తాయి. 26 నుండి 29 వచనాల ప్రకారం ఇది: “భూమిని ఆయన [యహువః] చేయక మునుపు...ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు... భూమి యొక్క పునాదులను నిర్ణయించాడు.”
సామెతలలో గల సందర్భం యొక్కయు మరియు ఉపయోగించబడిన భాషా రకం యొక్కయు సరైన అవగాహన, అంటే వ్యక్తిగతీకరణ గూర్చిన అవగాహన, ఈ భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకొనుటకు సహాయం చేస్తుంది, ఇది స్పష్టంగా అక్షరానుసారమైన వ్యక్తి కోసం మాట్లాడదు.
ఇది రే ఫెయిర్క్లాత్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.