విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, ఏడవ దినము నీ ఎలోహీం అయిన యహువఃకు విశ్రాంతిదినము...(నిర్గమకాండము 20:8).
బైబిలు ఆజ్ఞలను పాటించుటకు లోబడేవారికి ఒక ప్రశ్న ఏమిటంటే, అసలు వారంలో మొదటి దినం ఏది? అందరూ ఏడు వరకూ లెక్కించవచ్చు. కాని లెక్క ఎక్కడ నుండి మొదలవుతుంది? మీరు నిజమైన ఏడవ దినమును ఎలా కనుగొంటారు? వారమును సృష్టించిన సృష్టికర్త దానిని నెలలో వుంచుటకు నెలను కూడా రూపొందిచెను. సృష్టికర్త కేలండరు ఒక నెలపొడుపు దినముతో ప్రారంభమై, తరువాత నాలుగు పూర్తి వారాలను కలిగియుంటుంది. ప్రతి వారము ఆరు పని దినాలను మరియు ఏడవ దినపు విశ్రాంతి దినమును కలిగియుంటుంది. సృష్ట్యారంభములో సృష్టికర్త కాలమును కొలుచుటకు సూర్య-చంద్ర గమన పద్దతిని మాత్రమే ఏర్పాటుచేసెను.
“ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను[H41501[1] నియామక కాలములను] దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,...... ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. (ఆదికాండము 1:14,15,16)”.
కాలము కేవలము గమన పద్దతి వలన మాత్రమే కొలవబడుతుంది. సూర్యుని యొక్క గమనము వలన దినము కొలవబడుతుంది. 365¼ రోజుల సమయములో సూర్యుడు మరియు భూమి తిరిగి వాటి ప్రారంభ స్థానానికి చేరతాయి. దీనిని ఒక సౌర సంవత్సరం అంటారు. భూమి చుట్టూ చంద్రుడు 29½ రోజులు తిరుగుట ద్వారా ఒక చంద్రమానం కొలవబడుతుంది. ఇదే నెలకు ఆధారము. 12⅓ చంద్ర నెలలు ఒక సౌర సంవత్సరముతో సమానము.
సూర్య-చంద్రుల గమన పధ్ధతులను అనుసరించి ప్రపంచంలో మూడు రకాల కేలండర్లు వాడుకలో వున్నవి.
-
సౌర కేలండరు: ఇది భూమి మరియు సూర్యుని గమనముల ద్వారా కొలవబడు కేలండరు.
ఈ సౌర కేలండరులో సంవత్సరపు నిడివిని కొలుచుటకు మాత్రమే సూర్యున్ని ఉపయోగిస్తారు. నెలల నిడివి ప్రకృతితో ఎటువంటి సంబంధమును కలిగివుండదు. గ్రిగోరియన్ కేలండరులోని వారములు నిరంతరాయ చక్రముగా వుంటాయి. చివరికి నాలుగు సంవత్సరాలకు ఒక సారి వచ్చే లీపు దినము కూడా ఈ నిరంతర వారములకు భంగం కలిగించదు.
-
చంద్ర కేలండరు: ఇది చంద్రుని భ్రమణము ద్వారా కొలవబడు కేలండరు.
చంద్ర కేలండర్లు ఖచ్చితంగా చంద్రుని వృత్తాలపై మాత్రమే ఆధారపడతాయి. దీనిలోని నెలలు అమావాస్య తరువాత మొట్ట మొదటి వేకువజాముతో ప్రారంభమయి, నిరంతరాయంగా వుంటూ సౌర సంవత్సరంతో సర్దుబాటు చేయబడవు. 12 చంద్రమానములు ఒక సౌర సంవత్సరం కంటే 11 రోజులు తక్కువగుట వలన నెలలకు ఋతువులకు సంబంధం లేకుండా మారుతూ వుంటాయి.
-
సౌర-చంద్ర కేలండరు: దీనిలో చంద్ర నెలలు సౌరసంవత్సరముతో సర్దుబాటు చేయబడతాయి.
సూర్యుని మరియు చంద్రుని సంయుక్త ధర్మము వలన ఈ సూర్య-చంద్ర కేలండరు ఏర్పడుతుంది. 19 సంవత్సరాలలో 7 సార్లు 13వ నెలను జోడించుట ద్వారా, నిడివి ఎక్కవగల సౌర సంవత్సరమునకు చంద్ర మాసములతో గొలుసు ఏర్పరచబడుతుంది. వారములు ప్రతి నెలారంభమునకు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రతి నెలలో నాలు పూర్తి వారాలు వుంటాయి.
సృష్టిలో మొట్టమొదట ఏర్పరచబడిన కేలండరు సూర్య-చంద్ర కేలండరు. ఇది అన్నిటికంటే చాలా ఖచ్చితమైన మరియు స్పష్టమైన కాలసూచక వ్యవస్థ.
బైబిలు గ్రంధంలో ప్రతి నెలను ఒక ప్రత్యేక ప్రార్థనా వేడుక దినముతో ప్రారంభించినట్ల మనము చూడగలము. దీనిని న్యూమూన్ దినము అంటారు. న్యూమూన్ దినము అనేది అమావాస్య తరువాత వచ్చు మొట్ట మొదటి తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. ఇది ఆరాధన దినము కావడం వలన, మొదటి వారంలోని పని దినములతో ఈ దినము లెక్కంచబడదు. దీని తరువాత 6 పని దినాలు వుండి, వారంలో ఏడవ దినమున [అనగా, నెలలో ఎనిమిదవ దినమున] విశ్రాంతి దినము వుంటుంది. ఆ తరువాత మరొక మూడు వారాలు కొనసాగుతూ అలా 29వ రోజున నెల ముగుస్తుంది. ఇలా ఈ లెక్కింపు 29 రోజుల వరకూ కొనసాగినప్పటికీ, అమావాస్య యొక్క సమయము ఆ నెలకు 29 దినములా లేక 30 దినములా అనేదానిని తెలియజేస్తుంది. అయితే ఏ నెలకూ 30 రోజుల కంటే ఎక్కవ దినములు వుండవు.
నిజమైన సూర్య-చంద్ర కేలండరును ఉపయోగించుట చాలా తేలిక. వారముల యొక్క రోజులు ఎల్లప్పుడూ నెలల యొక్క అదే తారీఖుల మీద వచ్చను. బైబిలు గ్రంధములో యేడవ దినపు విశ్రాంతిదినము ప్రతిసారీ ఒక తేదీనకు అనుసంధానించబడి యున్నది. అది ఎల్లప్పుడూ నెలయొక్క 8, 15, 22, మరియు 29 తేదీలలో వచ్చను.
చంద్రున్ని ముఖ్యముగా నియామక కాలములను తెలుపుట కొరకు సృజించినట్లు లేఖనము చెప్పుచున్నది.
“కాలములను [H4150 1 నియామక కాలములు] తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను [కీర్తనల గ్రంథము Hebrew Bible 104:19]’’.
సృష్టిలో మొదటి వారము విశ్రాంతి-దినముతోనే ముగిసినది. విశ్రాంతి దినమును తరతరములకు ఆచరించాలని నిర్గమకాండము 31 సెలవిస్తున్నది.
“నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరి శుద్ధపరచు యహువఃను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును.” (నిర్గమకాండము 31:13).
సృష్టి కర్త యేడవ దినపు విశ్రాంతిదినమును తనకును తన జనులకును మధ్య విశ్వాసమునకు గుర్తుగా రూపొందించారు. శతృవు, లూసిఫర్, పౌర కేలండరును మార్చివేయుట ద్వారా సృష్టికర్తకు మాత్రమే చెందవలసిన ఆరాధనను దొంగిలించాడు. సాంప్రదాయాలు మరియు భ్రమల ద్వారా, నిరంతర వారాల సౌర కేలండరును వుపయోగించుటలో లూసిఫర్ ప్రపంచాన్ని ఐక్యం చేశాడు. ఒకడు ఆరాధించే సమయము తాను ఎవరిని ఆరాధిస్తున్నదీ వెల్లడి చేయును. ఆరాధనా దినములను లెక్కించుటకు సౌర కేలండరును ఉపయోగించువారు తమకు తెలియకుండానే గొప్ప మోసగానికి తమ విధేయతను, ఆరాధనను సమర్పిస్తున్నారు.
సృష్టికర్తకు తమ భక్తి-విధేయతలను కనబరచుకొనుటకు ఆశపడేవారు ఆయన ఏర్పరచిన దినమందే ఆయనను ఆరాధించాలి. ఆరాధన యొక్క సరియైన దినమును కనుగొనుటకు సృష్టియందు యేర్పాటు చేయబడిన సూర్య-చంద్ర కేలండరును తప్పక వుపయోగించాలి.
నిత్యత్వంలో అంతటనూ ఆరాధనకు వుపయోగించబడు కేలండరు న్యూమూన్ దినంపై ఆధారపడి వుంటుంది అని లేఖనం తెలియజేస్తుంది.
"ప్రతి అమావాస్య [న్యూమూన్] దినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకు సమస్త శరీరులు వచ్చెదరు అని యహువః సెలవిచ్చుచున్నాడు. (యెషయా గ్రంథము 66:23)".
నీవు ఎవరిని ఆరాధించెదవు? నీవు ఎవరికి నీ విధేయతను ఇచ్చెదవు? ఆరాధన కాలములను కనుగొనుటకు నీవు ఉపయోగించే కేలండరు నీవు ఆరాధించే దైవమును బయలు పరచును.
1"యూదుల పండుగలు క్రమమైన వ్యవధులలో జరిగును కాబట్టి, ఈ పదం వాటితో సన్నిహిత సంబంధంను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది…..Mo'ed [మో’ఎడ్] అనే పదము విస్త్రుత కోణంలో అన్ని ఆరాధనా సమావేశాలను సూచించును. ఇది ప్రత్యక్షగుడారముతో దగ్గరి సంబంధంను కలిగియుండెను…... యహువః ఇశ్రాయేలియులకు తన చిత్తమును తెలియజేయుటకు విశేషమైన సమయములయందు ప్రత్యక్షమాయెను. “ఇది యహువః యొక్క ప్రజల ఆరాధనా సమావేశాలకు సామాన్య పదము.” (చూడుము #4150, "లెక్షికల్ అయిడ్స్ టు ది ఓల్డ్ టెస్టమెంట్, "హీబ్రు-గ్రీక్ వర్డ్ స్టడీ బైబిల్ ,KJV.).