ఒక కేలండరును ఎవరైనా తయారు చేయవచ్చును. యుగాలుగా, అనేకమంది ఖచ్చితత్వంలో వేర్వేరు ప్రమాణాలు గల అనేక కేలండర్లను తయారు చేశారు. కేలండరు అనగా సమయాన్ని కొలిచే ఒక పద్దతి. గడచుచున్న సమయము కదలిక ద్వారా మాత్రమే కొలవబడును గనుక కేలండర్లన్నియు సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలు భూమిపైనుండి ఎలా కనిపించునో ఆ కదలికల తీరులపై ఆధారపడి ఉంటాయి.
క్రైస్తవులు, అజ్ఞానంలో, 1,500 సంవత్సరాలుగా ఒక అన్య/ పాపల్ సౌర కేలండరును ఉపయోగించుచున్నారు. కృపతో, పరలోకం సమయ లెక్కింపు విషయం మీద కాంతిని ప్రచురింపజేయుటను పెంచుతుంది, అది సూర్యుని మరియు చంద్రుని కదలికలను ఉపయోగించిన ఒక కేలండరును యహువః కలిగి ఉండెనని చూపిస్తుండెను. నిజాయితీ హృదయం గల ప్రజలు వారి బైబిళ్లు మరియు ఇతర పురాతన బైబులు సంబంధమైన వ్రాతలలో సత్యం కోసం వెతుకుతున్నప్పుడు, నిజమైన బైబిల్ కేలండరు ఎలా పనిచేస్తుందో అనుదానిపై పలు సిద్ధాంతాలు తలెత్తాయి. ఇలా సూచించబడిన ఒక కేలండరు; పితురుల / యాజకుల కేలండరు. ఇది హనోకు, యాషారు మరియు జూబిలీస్ పుస్తకాలను ఉపయోగించి ఈ కేలండరును రూపొందించబడింది, దీనిలో సృష్టి యొక్క సూర్య చంద్ర కేలండరు వలె ప్రతి రెండు-మూడు సంవత్సరాలకొకసారి అధికమాసంను జతచేయుట కాకుండా, ప్రతి సంవత్సరం సౌర మరియు చంద్ర సంవత్సరాల మధ్య సమయపు లెక్కను సరి చూస్తుంది.
ఈ ఇతర, అదనపు-బైబిలు మూలాలపై కాకుండా లేఖనాలలో ఉన్న ఆధారము మీద యహువః కేలండరు ఆధారపడియున్నదని WLC నమ్ముతుంది. కారణం సులభం: వాటి అసలు లిపి (అక్షరాలు) లో వ్రాయబడిన లేఖనాలు, అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, అసలు లిపులలో వ్రాసిన హనోకు, యాషారు మరియు జూబ్లీల గ్రంథాలు అందుబాటులో లేవు. డెడ్ సీ గ్రంధపుచుట్టలు మరియు ఇతర ప్రదేశాలలో కనిపించే వివిధ శకలాలు అటువంటి పుస్తకాల ఉనికిని తెలియజేస్తున్నాయి. అవి అనేక లిప్యంతరీకరణలు మరియు బహుళ అనువాదాల ద్వారా/ కారణంగా సంపూర్ణ ప్రతులను ఇచ్చుట లేదు.
బాబేలు వద్ద యహువః ప్రపంచ భాషలను తారుమారు చేసినప్పుడు, ఆయన తన ధర్మశాస్త్రంను కాచువారి కొరకు చాలా ప్రత్యేకమైన భాషను రూపొందించాడు. ప్రాచీన హెబ్రీ, అనేక ఆధునిక భాషల వలె కాక, ఒక క్రియల యొక్క భాష, నామవాచకముల భాష కాదు.
నామవాచకాలు అనగా వస్తువుల పేర్లు: గుర్రం, ఆపిల్, బాలుడు.
మరోవైపు, క్రియలు, నామవాచకములు ఏమి చేయునో అనేదానిని వివరించును (నిద్ర, పెరుగుట, పరుగెత్తుట) లేదా ఏమైయుండెనో (ఉన్నాను, ఉన్నది - ఉన్నాడు, ఉన్నవి - ఉన్నారు మరియు వీటి భూత కాలములను) వివరించును.
సాంకేతికత పురోగతి చెందిన కొద్దీ, ప్రతి కాలంలోను భాషలకు నామవాచకాలు చేర్చబడతాయి. మరోవైపు, ప్రాచీన హెబ్రీలో, వస్తువులకు పేర్లు పెట్టుటకు క్రియా పదాలు వాడబడెను. ఫలితంగా అత్యంత వివరణాత్మక భాష ఆయెను, - మరియు కదలిక/ చర్య మరియు స్థితులు అదే విధంగా ఉండటం వలన వాస్తవంగా పాడుచేయుటకు అసాధ్యమైన భాష ఆయెను. "నడుచుట" ఇప్పటికీ నడిచుచూ ఉన్నట్లు అని అర్థం, "పాడుట" ఇప్పటికీ పాడుతూ ఉన్నట్లు అని అర్థం. నామవాచకాల ఆధారంగా ఉన్న భాషలు కాలక్రమేణా ఎక్కువగా పాడుచేయబడి యున్నవి.
అనేకమైన బైబిలు తర్జుమాలలో ఏవి అత్యంత ఖచ్చితమైనవిగా ఉన్నవో తెలుసుకొనుట అసాధ్యమని చాలామంది వాదించుదురు. నేడు, ఆంగ్లములో 40 కంటే ఎక్కువ తర్జుమాలు మరియు వివరణలు ఉన్నాయి. అయితే, కంప్యూటర్లు మరియు అంతర్జాలం సహాయంతో, పాత నిబంధన యొక్క చాలా ఖచ్చితమైన తర్జుమాలను పొందుట నేడు సాధ్యమవుతుంది. Mechon-mamre.org వంటి వెబ్సైట్లు అసలు లిపిలో వ్రాయబడిన లేఖనాల యొక్క గ్రంథాలను అందిస్తున్నాయి. కంప్యూటర్ల వాడకంతో, పాత నిబంధనలో 400 సార్లు ఉపయోగించిన ఒక పదం యొక్క నిర్వచనంను సందర్భోచితంగా విశ్లేషించి దాని అర్థంను ఖచ్చితంగా నిర్ధారించవచ్చును.
సృష్టికర్త యొక్క కేలండరు 12 నెలలను కలిగియుండి, రెండు మూడు సంవత్సరాల కొకసారి అదనంగా 13 వ నెలను అధిక మాసంగా కలిగియుండు ఒక సూర్య చంద్ర కేలండరు అని నిర్ధారించే మూడు సాక్ష్యాలను యహువః భద్రం చేసెను. అవి: 1) అసలు లేఖనాల లభ్యత; 2) ఖగోళ శాస్త్రం యొక్క ఖచ్చితత్వం; మరియు 3) వ్రాత పూర్వక చరిత్ర గ్రంధాలు.
హనోకు, యాషారు మరియు జూబ్లీల వంటి బైబిలేతర పుస్తకాలు ఆసక్తికరమైన, లాభదాయకమైన, మరియు వివరణాత్మకమైన సమాచారంను కలిగి యుండెను. అయినప్పటికీ, సృష్టి క్యాలెండరును స్థాపించే పై మూడు సాక్ష్యాలను కలిగి లేవు. బైబిలేతర ఆధారాలను చదివునప్పుడు తెరచిన మనస్సును తప్పక కలిగి యుండాలి. సమస్త ఇతర గ్రంథాలకు తీర్పు తీర్చుటకు/ నిర్ధారించుటకు మానవునికి ఇవ్వబడిన ఏకైక ప్రమాణ గ్రంథం బైబిలు. "యహువః యొక్క జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది." (2 తిమోతి 3: 16, 17.)
హనోకు, యాషారు, జూబ్లీలు చదివునప్పుడు, సత్యాన్వేషకులు మంచిని తీసుకుని, మిగిలిన దానిని విడిచిపెట్టవలెను. వాటిని కేలండరును ఎలా లెక్కించాలి అనే దానికి ఖచ్చితమైన అధికార ప్రతులుగా ఉపయోగించకూడదు. ఒకవేళ ఇలాంటి బైబులేతర మూలాల నుండి "పితరుల/ యాజక" కేలండరును నిర్మించాలంటే, కొన్ని అభివృద్ధి పరచుటకు వీలైన భావనలను/ ఊహలను తప్పక తయారు చేయవలసి వచ్చును. ఇలాంటి అనేక భావనలలో ఈ క్రిందివి కొన్ని:
భావన ఒకటి:
హానోకు, యాషారు, మరియు జూబ్లీల ఆధారంగా కేలండరును ప్రోత్సహించే ఒక వెబ్సైటు, హిజ్కియా యొక్క రోజుల నుండి చంద్రుడు "జబ్బు పడెను" అనియు మరియు ఇకపై అది ఖచ్చితమైన క్రియా సామర్థ్యంను కలిగి యుండదు అనియు వాదిస్తుంది. ఈ వాదనకు మద్దతు ఇచ్చుటకు ఎటువంటి ఆధారము లేదు. ఇది, ఒక ఊహ మాత్రమే. ఒక నిర్దిష్ట సమయంలో ఆరాధన చేయవలసిన అవసరతను వెల్లడించి, ఆ తరువాత ఆ నిర్దిష్ట సమాయాలను తెలియజేసే తన సొంత పద్ధతిని నాశనం చేయుట లేదా దానిపై ఆధారపడలేని విధంగా దానిని మార్చుట అనేది యహువః యొక్క స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
చంద్రుడు "జబ్బుపడి" మరియు సమయమును గుర్తించలేక పోవుచుండెను అనే భావనను లేఖనం ఖండిస్తుంది. సృష్టి సృష్టించబడిన దాదాపు 3,000 సంవత్సరాల తర్వాత, దావీదు సృష్టికర్త యహువఃను గూర్చి తన కీర్తనలో ఇలా వ్రాశాడు: "కాలములను [ఋతువులను] తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయకాలము తెలియును" (కీర్తన 104: 19, హెబ్రీ బైబిలు.) ఇక్కడ "నియమించెను" అనే పదం âsâh (# 6213) అను హెబ్రీ పదం నుండి వచ్చినది, మరియు "విస్తృతార్ధంలో మరియు విశాలమైన అన్వయనంలో దీనర్థం ‘చేయుట’ లేక ‘తయారు చేయుట’."1 "కాలము" అనే పదం హెబ్రీ పదమైన mô'ed మో’ఎడ్ (# 4150) నుండి వచ్చినది. దీనర్ధం:
-ఒక నియామకం, అనగా స్థిరమైన సమయం లేదా కాలం; ప్రత్యేకించీ, ఒక పండుగ . . . సూత్ర ప్రాయంగా, ఒక సమావేశము (ఒక ఖచ్చితమైన ప్రయోజనం నిమిత్తమైన సమావేశం); సాంకేతికంగా సమాజ కూటము; విశాలార్ధంలో, సమావేశ స్థలం . . . 2
యహువఃను ఆరాధన చేయవలసిన అన్ని సమావేశాలతో ఈ పదం సన్నిహిత సంబంధాన్ని కలిగియున్నది. యహువః యొక్క వార్షిక పండుగలను సూచిస్తున్న లేవియకాండం 23లో ఇదే మాట ఆరాధనా కాలాలను సూచిస్తుంది. యహువః చంద్రునిని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం సృష్టించాడని కీర్తన 104: 19 స్పష్టం చేస్తోంది: అది ఆరాధన కొరకు నియమించిన కాలాలను సూచించే పని.
కీర్తన 89 లో కూడా ఇది మరొక్కసారి కనబడుతుంది, ఇది యహువః యొక్క విశ్వాస్యతను స్తుతించే కీర్తన. ఈ కీర్తన దైవ ప్రేరేపితమైన మాటలతో ప్రారంభమవుతుంది: "యహువః యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను. "(కీర్తన 89: 1, 2)
చంద్రుడు "జబ్బుపడ" లేదు! అయితే, తన గమనముల ద్వారా సర్వశక్తిమంతుని యొక్క మాట ఎంత ఆధారపడదగినదో మరియు విశ్వశించదగినదో అనే దానిని సూచిస్తుండెను!
నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలు వెళ్లిన మాటను మార్చను.
అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు,
అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు,
చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు,
నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను. (కీర్తనలు 89:34-37, NKJV)
చంద్రుని ఖచ్చితమైన మరియు చెప్పదగిన గమనములను గూర్చి యహువః చేసిన వాగ్దానాల పట్ల చంద్రుని యొక్క నిజమైన విశ్వాసాన్ని ఈ అద్భుతమైన వాక్యభాగం తెలియజేయుచుండెను, ఇది చంద్రున్ని "ఆకాశంలో నమ్మకమైన సాక్షి" గా పిలిచేంతవరకు వెళ్ళుచున్నది. యహువః యొక్క ఖచ్చితమైన మాట చంద్రుడు "జబ్బుపడుటకును" మరియు కాలమును & "ఆరాధనా సమావేశాలను" నియంత్రించుటలో దాని పనిని నెరవేర్చుటలో నమ్మలేనిదిగాను మారుటకు అవకాశం ఇవ్వదు.
భావన రెండు:
ప్రతి రెండు నుండి మూడు సంవత్సరాల కొకసారి పొడవైన సౌర సంవత్సరంతో కొద్దిగా నిడివి తక్కువ గల చంద్ర సంవత్సరమును సమన్వయ పరిచేందుకు అదనంగా ఒక 13 వ నెల అధిక మాసంగా చేర్చబడునని గ్రంథంలో ఎక్కడా లేదని అనుకోబడుతుంది. అయితే, అది తప్పు. యెహెజ్కేలు గ్రంధంలో ఒక పదమూడవ, అధిక నెలను చూడవచ్చు, అక్కడ యెరూషలేమును గూర్చిన ఉపమానమును గూర్చి ప్రవక్తకు చెప్పబడినది. అతను తన ఎడమ ప్రక్క 390 రోజులు పండుకోవాలని చెప్పబడి, తరువాత తన కుడి వైపున 40 రోజులు పండుకుని మొత్తం 430 రోజులు పడుకోవాలి అని చెప్పబడెను. యెహెజ్కేలునకు ఈ సూచనలు ఎప్పుడు చేయబడెను మరియు అతడు ఆకార్యమును ఎప్పుడు పూర్తి చేసెను అనే వాటి యొక్క ఖచ్చితమైన సమయాలు ఇవ్వబడినందున, అతడు ఒక అధికమాసము గల సంవత్సరంలో యహువః సూచనలను అనుసరించెననియు అలా కాని పక్షంలో యెహెజ్కేలు 8: 1 లో నమోదు చేయబడిన సమయంలో అతడు తన ఇంటికి తిరిగి రాలేడనియు స్పష్టమవుతుంది.
భావన మూడు:
ఈ భావన ప్రకారం కాలము అనేది “నిత్యత్వం” లో "నూతనపరచ" బడుతుంది, ఎందుకంటే నిత్యత్వంలో సూర్య- చంద్రులతో ఇక అవసరత ఉండదని ప్రకటన 21 చెబుతుంది. అయితే, ఈ భావన ప్రకటన గ్రంధపు లేఖనాలను తప్పుగా అన్వయిస్తుంది. ప్రకటన 21: 23 మరియు 24 ఇలా చెబుతుంది: "ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; ఎలోహ మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు."
కొత్త భూమి సృష్టించబడిన తరువాత, భూమిని యహువః యొక్క మహిమ నిరంతరాయమైన మహిమా కిరణాలతో నింపుననియు, సూర్యుని మరియు చంద్రుని యొక్క కాంతి అక్కడ అంత అనవసరం ఉండదనియు లేఖనం చెప్పుచుండెను. అనగా, అవి వాటి పరలోకంలో-నిర్ణయించబడిన విధి అయిన కాల నిర్ణయ విధినుండి తొలగించబడతాయి అని అర్థం కాదు. యెషయా 66:22 మరియు 23 వ వచనం ఇలా ప్రవచిస్తుంది: "నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి యుండును ఇదే యహువః వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహువః సెలవిచ్చుచున్నాడు."
భావన నాలుగు:
యహూషువః మెస్సీయ తన కాలంలోని ప్రధాన యాజకులు వినియోగించిన కేలండరును కాక వేరొక కేలండరును ఉపయోగించెనని వారు (పితురుల/ యాజక కేలండరును "రుజువుచేయుటకు") పేర్కొనెదరు. యహూషువః ఈ క్రింది విధంగా అడిగిన సంధర్భం ద్వారా ఈ భావన తప్పు అని సులభంగా నిరూపించబడుతుంది, "నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? (యోహాను 8:46, NKJV), వారు సమాధానం చెప్పలేక పోయారు. చివరకు పిలాతు కూడా, యహూషువఃను విచారించినప్పుడు ఇలా అన్నాడు, "ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను” (లూకా 23: 4, KJV).
యహూషువఃపై యూదుల ముఖ్యమైన ఆరోపణ ఆయన సబ్బాతును-మీరుచున్నాడు అని. యహూషువః నిజంగా వేరొక దినమును సబ్బాతుగా పాటించినట్లయితే, ఆ కారణం ద్వారానే యాజకులు, లేవీయులు యహూషువఃను చంపడానికి ప్రయత్నం చేసియుందురు.
భావన ఐదు:
యహూషువః యెస్సేనీయుల క్యాలెండరుకు అనుగుణంగా పస్కాను ఒకరోజు ముందు ఆచరించెనని చెప్పుదురు. ఇది తప్పు. ఆఖరి రాత్రి విందుకు సంబంధించిన అన్ని లేఖనాలు, అది పస్కాను కాదు అని సూచించుచున్నవి, ఎందుకంటే యహూషువః మరియు శిష్యులు పులియని రొట్టెకు బదులుగా పులిసిన రొట్టెను ఉపయోగించిరి.
హనోకు,యాషారు, మరియు జూబ్లీ పుస్తకాల ఆధారంగా ఒక పితురుల/ యాజక క్యాలెండరును తయారు చేయాలంటే, లేఖనాల యొక్క స్పష్టమైన సాక్ష్యమును ప్రక్కన పెట్టవలసి వస్తుంది. అదనంగా, చారిత్రకంగా గ్రంథస్థమైన వాటిని కూడా నిర్లక్ష్యం చేయవలసి వస్తుంది.
సిద్ధాంతాన్ని స్థాపించటానికి లేఖనం మాత్రమే నమ్మదగిన ప్రామాణిక గ్రంథం. ఒకని పవిత్ర దినాలను లెక్కించుటకు ఉపయోగించే క్యాలెండరు ఊహలు మరియు తప్పు తీర్మానాల మీద ఆధారపడ కూడదు. కేవలం సృష్టి యొక్క సూర్య-చంద్ర క్యాలెండరు మాత్రమే పరలోకం-నియమించిన కాల కొలమాన పద్ధతి అని ప్రకటించుటను Wlc కొనసాగిస్తుంది.
1 హీబ్రూ-గ్రీక్ కీ వర్డ్ స్టడీ బైబిలు, హీబ్రూ అండ్ చాల్డే డిక్షనరీ, p. 92.
2 ఐబిడ్., పేజి. 63.