ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
"ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము." (రెండవ కొరింథీయులకు 5:8). ఈ పదబంధాన్ని సాధారణంగా ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు యహూషువఃతో దేహరహిత స్థితిలో ఉండుటకు ఈ లోకాన్ని అధిగమించి వెళ్లునని బోధించుటకు ఉపయోగిస్తారు. కానీ పౌలు కోరుకున్నది ఖచ్చితంగా దేహరహిత స్థితి కాదు. బదులుగా పౌలు, కొత్త శరీరాన్ని, అమర్త్య శరీరాన్ని, వాయువు చేత చలించు దేహాన్ని సూచిస్తాడు, "కాబట్టి పరలోకము నుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనును" (వచనం. 2). ఒక అమర్త్యమైన దేహరహిత ఆత్మ లేదా లేదా మహిమ శరీరాన్ని క్రియ చేయించు ఆత్మ మొదలైన బోధనలు శతాబ్దాల క్రితం సంఘంలోనికి ప్రవేశించిన విషపూరిత గ్రీకు ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి మరియు సువార్త సందేశంపై వినాశకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
పౌలు 1 కొరింథీయులు 15:54 లో "ధరించుకొను" అనే అదే వ్యక్తీకరణను ఉపయోగిస్తాడు మరియు అతడు విశ్వాసులకు సంభవించు భవిష్యత్తు సంఘటనల క్రమాన్ని వివరిస్తాడు. క్రైస్తవులు తమ కొత్త వాయు అమర దేహాన్ని మరణ సమయంలో కాక, యహూషువః తిరిగి వచ్చినప్పుడు పునరుత్థానంలో పొందుతారు. 2 కొరిం. 5: 1-9 మరియు 1 కొరింథీయులు 15 లలోని ఈ ప్రసిద్ధ సందర్భం అనేక ఇతర బైబిల్ లేఖనాలతో కలిసి మనకు "మిగిలిన కథను" అందిస్తుంది. అవి చెప్పినట్లుగా, సందర్భం లేని వాక్యం తరచుగా సాకుగా ఉంటుంది. మన బహుమానం (2 తిమోతి 4: 8; ప్రకటన 22:12) క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మరణం నుండి లేపబడుట (1 కొరిం. 15:23). యహువః మరియు తన క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మనం ప్రవేశించుటకు (2 తిమోతి 4: 1; 2 పేతురు 1:11) కూడా ఆయన తిరిగి వచ్చు వరకు వేచి ఉండాలి.
ఏదేమైనా, 2 కొరింథీయులు 5: 8 లోని ఈ ఒక్క వాక్యం తరచుగా క్రైస్తవులు మరణించినప్పుడు యహూషువః రెండవ రాకడ లేదా పునరుత్థానాలతో అవసరం లేకుండా దేహరహిత స్థితిలో పరలోకంలో తమ బహుమానంలోనికి ప్రవేశించుదురని నిరూపించుటకు తరచుగా ఉదహరించబడింది. పౌలు ఈ ప్రస్తుత శరీరానికి దూరంగా ఉండాలనే తన కోరికను వివరించడం ద్వారా ప్రారంభించాడు, ఈ బలహీనమైన, మర్త్యమైన, మరణమునకు లోనైన శరీరం, దీనిలో మనం “మూలుగుచున్నాము” (వచనం. 4). ("అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?" రోమా 7:24). పౌలు "పరలోకము నుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచున్నాడు ... మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. (వచనం. 2-4; 1 కొరింథీ. 15:21-23).
ఈ తాత్కాలిక శరీరానికి ప్రాతినిధ్యం వహించడానికి, అతడు "భూసంబంధమైన నివాసం" మరియు "గుడారం" వంటి గుర్తులను ఉపయోగించాడు. మన పునరుత్థానం చేయబడిన, అమర్త్యమైన శరీరాన్ని సూచించడానికి అతడు "నివాసము", "పరలోకంలో శాశ్వతమైన గుడారము" మరియు "పరలోక నివాసం" (రెండుసార్లు) వంటి గొప్ప గుర్తులను ఉపయోగిస్తాడు. నిజానికి, మనం మరణించినప్పుడు ఈ భూసంబంధమైన (మర్త్యమైన) శరీరం "నాశనం" అవుతుంది (1 వ వచనం). పౌలు కోరుకున్నది ఈ శరీరం కాదు. ఆ పరిస్థితిని "వస్త్రము లేనిదిగా" మరియు "దిగంబరతగా" (ఏమీ లేకుండా) పోల్చాడు. దీనికి బదులుగా, పౌలు "వస్త్రము లేని" మరియు "దిగంబరంగా" (అక్షరాలా, మరణించిన) ఉండటానికి విరుద్ధతను కోరుకుంటాడు. చెప్పాలంటే అతడు మన "పరలోక నివాసంతో" "వస్త్రము కప్పుకోవాలని," "ధరించాలని" కోరుకుంటాడు. "మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము." (2-3 వ వచనాలు).
గొప్ప పునరుత్థాన అధ్యాయమైన 1 కొరిం. 15 దీనిని మరింత వివరిస్తుంది. "క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.” (1 కొరింథీ 15: 53-54). దీన్ని మన వచనంతో పోల్చండి: "మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు." (2 కొరిం. 5: 4). మన ఆశ ఖచ్చితంగా దేహరహితమైన ఆత్మగా మారకూడదు. మన ఆశ కొత్త శరీరం, గణనీయమైన శరీరం, ఒక "మహిమాన్విత శరీరం".
యహూషువః పరలోకం నుండి తిరిగి రావాలని మనం ఎందుకు వేచి ఉండాలంటే: “మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యహూషువః క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును."(ఫిలిప్పీ. 3:20 -21).
మొత్తం చిత్రాన్ని పరిశీలించగా, పౌలు ఈ ప్రస్తుత “మరణశరీరం” నుండి మాత్రమే వేరుగా ఉండాలనే తన కోరికను వ్యక్తం చేస్తున్నట్లు నిర్ధారించడం సమంజసంగా ఉంటుంది. అతడు పునరుత్థానం వద్ద (ముందు కాదు) ప్రభువుతో కలిసి ఉండే సమయం కోసం ఎదురు చూశాడు, ఎందుకంటే ప్రభువుతో ఉండడం అంటే ఆయనలాంటి శరీరాన్ని కలిగి ఉండటం. "ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని." (l యోహాను 3: 2). "నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవని చెప్పి.” (లూకా 24:39).
యహూషువఃతో ఉండుటకు కావలసిన స్థితి కేవలం శరీరరహిత స్థితి అయితే, అప్పుడు శరీరం యొక్క పునరుత్థానం తిరోగమన స్థితిలో ఉండి నిరాశపరిచే ముగింపుగా ఉంటుంది. లేదు, ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనం కోరుకున్న స్థితి మరణం నుండి లేపబడుట. అప్పుడు సమాధి తన వేటను వదులుకోవాలి. "దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని " (యోహాను 5: 28).
ఇది డేవిడ్ బర్గ్ రాసిన WLC యేతర కథనం.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.