ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
సింహాల గుహలో దానియేలు యొక్క ఆకర్షణీయమైన కథ మనందరికీ తెలుసు. అయితే దీని అసలు ముగింపును మీరు వినియున్నారా? అవును అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను మీ కోసం ఆశ్చర్యమైన విషయాన్ని కలిగి ఉన్నాను! ఆ రోజు ఉదయం సింహాలు భోజనంగా తీసుకున్న ఎముకలు దానియేలు మీద నింద మోపినవారివో వారి భార్యలవో మరియు పిల్లలవో కాదు, బదులుగా, ఈ ఆధునిక వర్ణణల ప్రకారం, కొంతమంది ఆధునిక “పండితులు” మరియు “వ్యాఖ్యాతల” ద్వారా గుహలో తినివేయబడింది దానియేలే. యహూషువః తన నోటితో స్వయంగా "దానియేలు ప్రవక్త" (మత్త. 24:15) అని పిలిచిన వ్యక్తి యొక్క ప్రవచనాత్మక వ్రాత యొక్క మాంసం ముక్క ముక్కగా, భాగం భాగంగా, మన విలువైన లేఖనాల నుండి తీసివేయబడింది, మిగిలి ఉన్నదంతా ఒక మందమైన అస్థిపంజరం యొక్క ఎముకలు మాత్రమే, మరియు ఇప్పుడు సభ్యోక్తిగా "మారువేషపు రచయిత" గా వర్ణించబడుతున్నాడు, అతడు ఎక్స్ ఈవెంట్ ప్రొఫెసీ1 అని పిలవబడే దానిని వ్రాసాడని చెప్పుచున్నారు.
దీనర్థం, ఇటువంటి ఆధునిక బైబిల్ వ్యాఖ్యానాల ప్రకారం, దానియేలు స్పష్టంగా యహువః యొక్క ప్రవక్త కాదు, ఎందుకంటే అతడు తన పుస్తకాన్ని మక్కాబీస్ సమయంలో, సుమారు క్రీ.పూ. 165 సమయంలో అసలైన బబులోను చెర కాలానికి (క్రీ.పూ. 586) 400 సంవత్సరాల తరువాత వ్రాసాడు అని అర్థం. ఇది తన స్వదేశం నుండి నెబుకద్నెజరు రాజు చేత చెరపట్టబడిన సమయంలో దానియేలు ద్వారా ప్రత్యక్షంగా వ్రాయబడిన చారిత్రక వృత్తాంతం కాక, అసలైన సంఘటనలు జరిగిపోయిన తరువాత వ్రాయబడిన "దానియేలు" అని చెప్పుదురు. అతని ప్రవచనాలు ఆది నుండి అంతము వరకు తెలియజేయు యహువః ద్వారా అద్భుతంగా వెల్లడి చేయబడలేదని, అతని "ప్రవచనాలు" నిజానికి, జరిగిపోయిన చరిత్రనే తరువాతి కాలంలో ప్రవచనాలుగా కూర్చి రాయబడ్డాయని చెప్పుదురు. దానియేలు తన పుస్తకాన్ని యూదుల అంత్యకాలపు సాహిత్యంలో మనకు కనిపించే వినాశనకర సంఘటనల రూపంలో దాదాపు మక్కబీయుల తిరుగుబాట్ల సమయంలో "ఉపమానం"గా వ్రాసినట్లు మనం నమ్మాలని వారు ఆశిస్తున్నారు.
అయితే, మేము ఈ వ్యాఖ్యానం ద్వారా మరింత హామీ ఇస్తున్నాము, మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇలా తరువాతి దానియేలుగా పిలుచుటలో వీరి లక్ష్యం, అంతర్-నిబంధన కాలంలోని మిగిలిన రచయితల యొక్క రచనల కోవలో దానియేలు గ్రంథాన్ని చేర్చాలని. 1 ఎజ్రా, 2 బరూక్, 4 హనోకు మొదలైన పుస్తకాల రచయితలు యహువః చివరికి అన్యజనులను విచ్ఛిన్నం చేస్తాడని మరియు తన పరిశుద్ధులకు ప్రతిఫలమిస్తాడనే సందేశంతో బాధలో ఉన్న యాహువః ప్రజలను ధైర్యపరచాలని కోరుకున్నారు. వారి సాహిత్య లక్ష్యాన్ని సాధించడానికి, అటువంటి రచయితలు తమ ప్రజల మునుపటి చరిత్రలను తిరిగి చూసి మరియు వారి ప్రస్తుత బాధల వెలుగులో అలాంటి గత చరిత్రను పునర్విమర్శించారు, అటువంటి గత చరిత్రను ప్రవచనాత్మక చరిత్రగా కూర్చి వ్రాసారు. కాబట్టి చాలామంది “పండితులు” మరియు “వ్యాఖ్యాతలు” ఈ రోజు దానియేలును కూడా ఇదే వర్గంలో ఉంచారు.
సాంప్రదాయకంగా, ఈ ఆధునిక పండితులు తమ వాదనలను నాలుగు శీర్షికల క్రింద బలపరిచారు. వారు దానియేలుకి చారిత్రాత్మక దోషాలు ఉన్నాయని లేదా మరింత స్పష్టంగా, కాలజ్ఞానదోషాలు ఉన్నాయని ఆరోపించారు. వారు భాషాపరమైన అసమతుల్యతను ఆరోపించారు (ఉదా. దానియేలు గ్రీకు పదాలను ఉపయోగించాడు మరియు తరువాత హెబ్రీ మరియు అరామిక్ శైలిలో వ్రాసాడు). అలాగే దానియేలు గ్రంథానికి సిద్ధాంతపరమైన ఉల్లంఘనలను ఆరోపిస్తున్నారు మరియు ఈ సంక్షిప్త కథనానికి సంబంధించి వారు భవిష్య దోషాలను మరియు అసంభవాలను ఆరోపించారు. ఆధునిక కల్పితం అలాంటిది.
నేను కొత్తగా చెప్పానా? అయ్యో! క్రీ.శ. 233 లో సిరియాలో తూరులో జన్మించిన పోర్ఫిరీ అనే విమర్శకుడి గురించి నాకు గుర్తుంది. పోర్ఫిరీ ప్రసిద్ధ నియో-ప్లాటోనిక్ తత్వవేత్త మరియు ప్లాటినస్ శిష్యుడు. అతడు క్రైస్తవ మతానికి తీవ్ర వ్యతిరేకి మరియు క్రైస్తవులకు వ్యతిరేకంగా పదిహేను పుస్తకాలు రాసాడు. నేను చెప్పగలిగినంత వరకు, దానియేలు గ్రంథం భవిష్య జ్ఞానం కాదని ఆరోపించిన మొదటి విమర్శకుడు పోర్ఫిరీ, అది దానియేలు చేత వ్రాయబడలేదని, మరియు మక్కాబీయుల తిరుగుబాటు సమయంలో కూర్చబడిందని చెప్పాడు. అతడు దానియేలు పుస్తకం నకిలీదని ఆరోపించడం ద్వారా "దానియేలు ప్రవక్త" నుండి అన్ని ప్రవచనాత్మక తరంగాలను తీసివేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు, నేను పోర్ఫిరీని క్షమించగలను ఎందుకంటే అతడు స్పష్టముగా క్రైస్తవ విరోధి. క్రైస్తవ మతాన్ని కించపరచడమే అతని లక్ష్యం. అతడు ఏమాత్రం సిగ్గు పడకుండా క్రైస్తవాన్ని ద్వేషించాడు. అయితే యహూషువః స్వయంగా చదివి ఇష్టపడి ప్రేమించిన మరియు పరిపూర్ణంగా విశ్వసించిన పుస్తకాన్ని స్పష్టంగా అనుమానించిన పోర్ఫిరీ యొక్క ఖచ్చితమైన పద్ధతులను అవలంబిస్తూ క్రీస్తు కోసం మాట్లాడుతున్నామని చెప్పేవారిని మాత్రం నేను క్షమించలేను.
కాబట్టి, దీనికి మనం ఏమి చెప్పాలి? అటువంటి బరువైన సమస్యలను వివరంగా పరిష్కరించడానికి ఇక్కడ స్థలం లేదు. కానీ క్లుప్తంగా, కొన్ని సంబంధిత అంశాలను గమనించండి. మొదటిది, దానియేలు పుస్తకం ఎల్లప్పుడూ హెబ్రీ గ్రంథ క్రమములో చేర్చబడింది. అసలు ఈ పుస్తకం "ప్రవక్తలు" లేదా "రచనలు" అనే విభాగంలో ఉందా లేదా అనేది అప్రస్తుతం. చర్చ ముగిసిన తర్వాత, ఈ పుస్తకం హెబ్రీ బైబిల్ యొక్క పవిత్ర క్రమములో చేర్చబడి యున్నదనుటను మరియు ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్నదనుటను ఎవరూ కాదనలేరు. (చెప్పాలంటే ఇతర చాలా గొప్ప పుస్తకాలు గ్రంథంలో చేర్చబడలేదు; 1 మక్కాబీసై మరియు ఎక్లెసియాస్టికస్ వంటి పుస్తకాలు. ఉదాహరణకు, ఈ రెండు రచనలు, ఆ కాలంలోని యూదులచే అత్యంత గౌరవించబడ్డాయి, కానీ అవి పవిత్రగ్రంథ క్రమములో లేవు లేదా దైవ ప్రేరేపితమైనవిగా పరిగణించబడలేదు.) కారణం మలాకీ ప్రవక్త తర్వాత బాప్తీస్మమిచ్చు యోహాను స్వరం వినబడే వరకు 400 సంవత్సరాల పాటు ప్రవచనాత్మక స్వరం లేదని పురాతన సమాజ మందిరం విశ్వసించింది. ఇంకా చెప్పాలంటే, దానియేలు క్రీ.పూ. 165 కాలంలో తన గ్రంథాన్ని వ్రాసిన ఒక మోసగాడు అని ఆరోపిస్తున్న విమర్శకులు దానియేలు పుస్తకాన్ని గ్రంథంలోనికి చొరబాటు చేయించారని (పాత నిబంధన యుగం యొక్క చివరి నిజమైన ప్రవక్తలైన నెహెమ్యా మరియు మలాకీ వంటి వారిని బాగా ఎరిగిన వారిద్వారా, తమ పవిత్ర గ్రంధాలు దైవప్రేరేపితమైనవిగా భావించే వారిద్వారా చొరబాటు చేయించారని) మనం నమ్మాలని కోరుకుంటున్నారు. 1వ మక్కబీయులలో పునరావృతమయ్యే విచారం ఏమిటంటే, “దేశంలో ప్రవక్త లేడు”! 1వ మక్కబీయుల 2: 49-70 లో యాజకుడైన మత్తతీయ మరణిస్తున్న సమయంలో తన కుమారులను ఇశ్రాయేలు యొక్క యహువఃకు విశ్వాసులుగా గుర్తించడానికి దానియేలు మరియు అతని ముగ్గురు సహచరుల ఉదాహరణను ఉపయోగించాడు. అతడు గత ప్రవక్త యొక్క చరిత్రను గుర్తు చేసాడు ఎందుకంటే అప్పటికి ఆ దేశంలో "దానియేలు ప్రవక్త" సజీవంగా లేడు. దీనిని బట్టి: దానియేలు పుస్తకం అంతర్-నిబంధన కాలంలో వ్రాయబడి ఉంటే అతడు "ప్రవక్త కాదు"! అయితే, నిజానికి అతడు ఒక ప్రవక్త, ఎందుకంటే అరణ్యంలో బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క గొప్ప ప్రకటనకు మార్గం తెరవబడేవరకు 400 సంవత్సరాల పాటు యహువః తన ప్రవక్తలను నిశ్శబ్దం చేయడానికి ముందే అతడు వ్రాసి మాట్లాడినందున అతడు ప్రవక్త అయ్యాడు.
రెండవది, ఐగుప్తుకు చెందిన టోలెమీస్ కాలంలో క్రీ.పూ. 300 నుండి 250 సంవత్సరాల మధ్యలో సెప్టాజింట్, LXX (హెబ్రీ బైబిల్ యొక్క గ్రీకు ప్రతి) అనువదించబడిందని ప్రతి బైబిల్ విద్యార్థికి తెలుసు. మరియు అంచనా వేయండి? ఈ రోజు మీరు మరియు నేను చదివుతున్న దానియేలు పుస్తకం సెప్టాజింట్‌లో ఉంది (అప్పుడు) మరియు ఉంది (ఇప్పుడు)! మీరు గణితాన్ని అనుసరిస్తే, కాలక్రమానుసారం ప్రకారం క్రీ.శ. 165 కంటే ముందు క్రీ.పూ. 250 ఉంటుందని మీకు తెలుస్తుంది.
మూడవదిగా, ఇంకా ముందుకు వెళ్తే, జోసెఫస్ ద్వారా వివరించబడిన (సుమారు క్రీ.శ. 80 లో వ్రాసిన) అలెగ్జాండర్ ది గ్రేట్ కథను నేను ఎల్లప్పుడూ ఇష్టపడుతాను. జోసఫస్ తన యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్, XI వ పుస్తకం, 8వ అధ్యాయంలో, గొప్ప గ్రీకు విజేత అలెగ్జాండర్ తూరును ముట్టడించిన సమయంలో తన సైన్యానికి అవసరమైన సామగ్రిని పంపించాలని అతడు యూదులను అడగుట గురించి ఒక అద్భుతమైన కథను చెప్పాడు. అలెగ్జాండర్ అభ్యర్థనను ప్రధాన యాజకుడైన యద్దూవ తిరస్కరించాడు. అతడు చెప్పిన కారణం ఏమిటంటే, యూదులు పారసీక రాజైన దర్యావేషుతో విధేయతతో ప్రమాణం చేసుకున్నారు. అలెగ్జాండర్ తూరును జయించిన తర్వాత, యూదులకు గుణపాఠం చెప్పడానికి కోపంతో యెరూషలేము మీదికి వస్తాడు.
యూదులు ఏమి చేయాలో ప్రధాన యాజకుడైన యద్దూవకు యహువః కలలో చెప్పినట్లు తెలుస్తోంది. యాజకులందరూ తెల్లని వస్త్రములు ధరించారు. యద్దూవ తన ప్రధాన యాజక వస్త్రాన్ని, ఎర్రటి వస్త్రాన్ని, రొమ్ముకవచాన్ని మరియు బంగారు మిట్టెను ధరించాడు. యూదులు తెల్లని వస్త్రాలలో ఉన్న యాజకుల ఊరేగింపును అనుసరిస్తూ, సీయోను పాటలు పాడుతూ, తెల్లని గుర్రంపై కూర్చుని భయంకరమైన మరియు ఆపలేని సైన్యంతో ఉన్న అలెగ్జాండర్‌ను కలవటానికి బయలుదేరారు. జోసఫస్ ప్రకారం, యద్దూవ అలెగ్జాండర్‌కు దానియేలు ప్రవచనాలను చూపుతూ 8 అధ్యాయంలోని 1-8 మరియు 15-22 చదివి వినిపించాడు. ఇవి ప్రపంచ వేదికపైకి అలెగ్జాండర్ రాక మరియు అతని అజేయతను ప్రవచించిన భాగాలు. స్పష్టంగా, అలెగ్జాండర్ చాలా జయించాడు, అతడు బలులు అర్పించాడు మరియు యూదుల దేవుడిని ఆరాధించాడు. ఇది క్రీ.పూ. 330 ప్రాంతంలో జరగడం గమనార్హం. విమర్శకులు, వాస్తవానికి, జోసఫస్ కూడా అబద్ధాలు చెప్పే చరిత్రకారుడని, అతడు కూడా సంఘటనలు జరిగిపోయిన తర్వాత వ్రాసాడని కొట్టిపారవేయుటలో స్థిరంగా ఉంటారు. అయితే తిరుగులేని వాస్తవం మిగిలి ఉంది: అలెగ్జాండర్ సిరియాలోని దర్యావేషుకి అనుబంధంగా ఉన్న ప్రతి నగరాన్ని నాశనం చేశాడు. యెరూషలేము మినహా. నిజానికి, అలెగ్జాండర్ యెరూషలేమును మరియు దాని ఆలయాన్ని విడిచిపెట్టడమే కాకుండా, దానిని ఎక్కువగా ఆదరించాడు. ఎందుకు? సరే, మీరు స్వంతంగా ఆలోచించండి. జోసఫస్ చాలా సహేతుకమైన వివరణను మనకు తెలియజేసాడు: దీనికి కారణం దానియేలు గ్రంథాన్ని విన్నప్పుడు అతనిపై ఏర్పడిన ముద్ర. తాను భూమిపైకి రావటానికి తరాలు ముందు వ్రాయబడియున్న ఈ మానవాతీత ప్రవచనంలో ఉన్న నక్షత్రం తానే అని అలెగ్జాండర్ గ్రహించాడు!
నాల్గవది, 1947లో మృత సముద్రపు గ్రంథపు చుట్టలు (డెడ్ సీ స్క్రోల్స్) వెలుగులోకి వచ్చినప్పుడు, ఖుమ్రాన్ సమాజం యొక్క ఆధీనంలో అనేక పురాతన గ్రంథపు చుట్టలు మరియు హెబ్రీ ప్రవచనాత్మక లేఖన శకలాలు ఉన్నాయని మనము తెలుసుకున్నాము. ఈ ఐశ్వర్యవంతమైన గనిలో యెషయా మరియు దానియేలు ప్రవక్తల పుస్తకాల శకలాలు ఉన్నాయి. ఎక్స్పోజిటరీ సెర్మన్స్ ఆన్ ది బుక్ ఆఫ్ డేనియల్ అనే తన పుస్తకంలో డబ్ల్యూ. ఎ. క్రిస్వెల్ ఇలా వ్యాఖ్యానించాడు: “నిజానికి దానియేలు గ్రంథపు చుట్టలు దానియేలు గ్రంథంలో చెప్పబడిన కాలం నాటివి. దానియేలు గ్రంథపు చుట్టలు... పాక్షికంగా హెబ్రీ భాషలో మరియు పాక్షికంగా అరామిక్ భాషలో వ్రాయబడ్డాయి మరియు ఈ అరామిక్ మక్కాబీయుల కాలానికి చెందిన ఇతర పత్రాల అరామిక్ కాదు, కానీ క్రీ.పూ. ఆరవ శతాబ్దపు తూర్పు అరామిక్. బైబిల్ ఎక్కడ ఉందో, యెషయా ఎక్కడ ఉన్నాడో, దానియేలు అక్కడ ఉన్నాడు. మరియు ఖుమ్రాన్ గ్రంథపు చుట్టలులోని దానియేలు యొక్క హెబ్రీ భాష పాత నిబంధనలోని మంచి, సాంప్రదాయకమైన, బైబిల్ హెబ్రీ. మక్కాబీయుల కాలం నాటి హెబ్రీ కాదు. ఈ ప్రకటన యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోండి. ఆధునిక వ్యాఖ్యాతలు అది కల్పించబడిందని నమ్మాలని కోరుకొనుటకు వందల సంవత్సరాల ముందే పూర్తిగా భాషా ప్రాతిపదికన దానియేలు గ్రంథం వ్రాయబడింది. నిజమైన "దానియేలు ప్రవక్త" మక్కాబీయుల కంటే వందల సంవత్సరాల ముందు ప్రవచించాడు. నిజమైన “దానియేలు ప్రవక్త” చరిత్రలో సంఘటనలు జరగకముందే యహువః నిర్ణయించిన భవిష్యత్తును దైవప్రేరణతో వెల్లడించాడు. ప్రవక్తను గుర్తించే విషయంలో యహువః పెట్టిన పరీక్షలో దానియేలు ఉత్తీర్ణుడయ్యాడు (ఉదా. ద్వితీయోప. 18:21-22).
ఐదవది, దీనిని పరిగణించండి. ప్రవక్త యెహెజ్కేలు 14:14, 20 మరియు 28: 2లో నిర్దిష్ట దానియేలు గురించి హెబ్రీ బైబిల్లోని మరో ఇద్దరు గొప్ప కథానాయకులైన — నోవహు మరియు యోబుతో పాటు ప్రస్తావించాడు. యెహెజ్కేలు బబులోను చెర సమయంలో వ్రాసాడని మరియు దానియేలుకు సమకాలీనుడని గుర్తుంచుకోండి. అతడు దానియేలును “నీతిమంతుడు” మరియు “జ్ఞానవంతుడు” అని పిలుస్తాడు. క్రీ.పూ. 165లో తనకు ప్రవక్తగా నటిస్తూ (కానీ నిజానికి పూర్వపు సంఘటనను తిరిగి చూసుకుని, గీతాన్ని ప్,వచనంలా కూర్చి) వ్రాసిన వ్యక్తిని యహువః నీతిమంతుడు లేదా జ్ఞాని అని పిలుస్తాడని నేను అనుకోను. లేదు! నోవహు మరియు యోబుల మాదిరిగానే యెహెజ్కేలు యొక్క దానియేలు తన పవిత్రతకు మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందనవాడు. ఈరోజు నా బైబిల్లో నేను చదివినట్లే నిజమైన కథానాయకుడు దానియేలు గురించి యెహెజ్కేలు సాక్ష్యమిస్తున్నాడు. లేక మనం ఇప్పుడు యెహెజ్కేలు ప్రవచనాత్మక స్థితిని కూడా ప్రశ్నించాలా? అలా అనుకుంటే అది అనివార్యంగా మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో అసలు మనం చూస్తున్నామా?
ఆరవది, మనం దీనిని పరిశీలిద్దాం: నా బైబిల్లో దానియేలు గ్రంథ రచయిత “దీర్ఘదర్శి,” అంటే ప్రవక్త అని మరియు యహువః అతనికి దర్శనాలలో కనిపించాడని మరియు తనతో దేవదూతల ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా మాట్లాడాడని సాక్ష్యమిస్తున్నాడు. ఉదాహరణకు, దానియేలు 8: 1 లో అతడు ఇలా సాక్ష్యమిచ్చాడు, "దానియేలను నేను మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము చూసితిని." అతడు నెబుకద్నెజరు కలలను వివరించినప్పుడు ఈ "నేను, దానియేలు" అప్పటి ఖచ్చితమైన సంవత్సరాలను మనకు ప్రత్యేకంగా చెప్పాడు: "నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సర మున కలలు కనెను" (దానియేలు 2: 1). యహువః తనకు నెబుకద్నెజరు కల యొక్క అర్థాన్ని చెప్పాడని మాత్రమే కాకుండా, అతడు రాజు ముందు నిలబడి, ఆ రాజు యొక్క యేలుబడియందు రెండవ సంవత్సరంలో దాని అర్థాన్ని వెల్లడించాడని దానియేలు సాక్ష్యమిస్తున్నాడు. అలాగే దానియేలు 7: 1 లో మనం ఇలా చదువుతాము, “బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.” ఆ తర్వాత దానియేలు 8 వ అధ్యాయంలో దానియేలు ప్రకటన మళ్లీ ఇలా ఉంది, “రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము కలిగెను.” మన ఎంపిక ఏది: తన దర్శనాలను మరియు వాటి ప్రేరేపిత వివరణల సంవత్సరాలను చెప్పుచున్న ఈ దానియేలు నిజమైన దానియేలా లేదా అతడు ఒక మోసగాడైన దానియేలా?
పైన పేర్కొన్న కారణాల వల్ల దానియేలు పుస్తకం ఇతర అంతర్-నిబంధనల రచనల మాదిరిగానే అదే కోవకు చెందినదనే ఆలోచన తప్పు. నిజానికి, దానియేలు ఒక మాదిరి! హెబ్రీ బైబిల్లో దానియేలు మొదటి (మరియు ఏకైక) నిజమైన అపోకలిప్స్ (భవిష్యత్ నాశనాన్ని తెలియజేసినవాడు). తదనంతరం తరువాతి అపోకలిప్టిక్ రచయితలందరూ బబులోను చెరకు చెందిన అసలు ప్రవక్త-దానియేలును తమకు తాము మాదిరిగా చేసుకున్నారు!
మరియు నేను వ్రాసినదాన్ని మీరు నమ్మకపోతే, నేను ఏడవ స్థానంలో చివరకు నా ప్రభువు మరియు మెస్సీయా యహూషువఃకు విజ్ఞప్తి చేస్తాను. ఆయన దానియేలును "ప్రవక్త" అని పిలిచాడు (మత్తయి 24:15). మన ప్రభువైన యహూషువః, “దానియేలు వేషధారి” అని చెప్పలేదు! ఆయన అతనిని "ఉపమానములు చెప్పిన దానియేలు" అని పిలువలేదు. "దానియేలు తన పూర్వీకుల వైపు వెనుకకు తిరిగి చూసే వ్యాఖ్యాత" అని అతను చెప్పలేదు. అస్సలు కుదరదు. మన ప్రభువైన యహూషువః స్వయంగా దానియేలు సాక్ష్యమిచ్చినన ప్రవచన స్ఫూర్తిని విశ్వసించాడు. లేదా తాను మాట్లాడిన ప్రతి మాటను తన తండ్రి మాట అని చెప్పుకున్న యహూషువః పాపం తప్పుగా మాట్లాడాడని భావిస్తున్నారా?
ముగింపులో: దానియేలు పేరును కలిగి ఉన్న పుస్తకంలో జాబితా చేయబడిన చారిత్రక సంఘటనలకు నిజమైన ప్రత్యక్ష సాక్షిగా దానియేలు రాయలేదని చెప్పటం, బబులోను మొదలుకొని ఈ ప్రస్తుత దుష్టయుగం వరకు భవిష్యత్తులో జరిగే సంఘటనలను అద్భుతమైన రీతిలో వివరంగా యహువః తనకు వెల్లడించిన దానియేలు నిజమైన ప్రవక్త కాదని చెప్పటం, యహూషువః యొక్క మొత్తం విశ్వాసాన్ని, అతని అపొస్తలులను మరియు నిజానికి లేఖనాలను కలవరపెట్టుట అవుతుంది. ఇది కథను ఘోరంగా తిప్పి వ్రాయడం. ఇది దానియేలును అతని విమర్శకులు మింగేయటమే!
కాబట్టి దానియేలు ఆ రాత్రి సింహాల గుహలో ఉన్నప్పుడు నిద్రపట్టక ఆందోళన చెందిన మాదీయ పారసీక రాజువలె మనలో ఎవరు గొప్పవారు? అంతటి సువిశాల సామ్రాజ్యపు రాజు దానియేలు చిత్తశుద్ధినిబట్టి, ఆ రాత్రి ఉపవాసం ఉండి, ఎటువంటి తేలికపాటి వినోదాలలో పరధ్యానం చెందుటకు నిరాకరించి, మరియు తెల్లవారు సూర్యుడు ఉదయించకముందే తన పైజామాతో పరుగెత్తుకుంటూ వెళ్లి “దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని యతనిని ఆందోళనతో అడిగినట్లు (దానియేలు. 6:18-20) మనం ఆందోళన కలిగియుండలేమా?” సజీవుడైయున్న యహువః విరుద్ధమైన అన్ని నోళ్లను మూయటానికి మరియు సమీపంలోని ఒక దినాన "దానియేలు నిజమైన ప్రవక్త" అని నిరూపించుటకు తన దూతను పంపునని నాకు నమ్మకం ఉంది.
1 ఎక్స్ ఈవెంట్ ప్రొఫెసీ అనేది "ముందుగా చెప్పబడిన" సంఘటనల గురించి రచయితకు ఇప్పటికే సమాచారం ఉన్న తర్వాత వ్రాసిన ప్రవచనాన్ని సూచించే సాంకేతిక వేదాంత లేదా చారిత్రక పదం. వికీపీడియా
ఇది గ్రెగ్ డ్యూబుల్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.