విశ్వాస స్వస్థతలు చేయువారి ద్వారా కనబరచు మరియు "ఆత్మలో వధింపబడుట" |
అది మృదువుగా ప్రారంభమైంది. అది కేవలం ఒక నిశ్శబ్దమైన, చిన్న ధ్వని, అది మఠము యొక్క నిశ్శబ్దంనకు భంగం కలిగించెను. అయితే మళ్ళీ అది తిరిగి వినిపించెను. సన్యాసినులు ఉండే భవనంలోకి పిల్లి గాని వచ్చిందా?
రెండవ పిల్లి మొదటి దానికి జత కలిపింది. ఈ జంతువులు ఎక్కడ నుండి వచ్చాయి? సన్యాసినుల మఠాధికారిణి ఒక గదిలోనికి వేగంగా అడుగులు వేసింది. ఈ పవిత్రమైన గదులలో ఎక్కడా జంతువులు కనిపించలేదు! ధ్వనిని అనుసరిస్తూ ఆమె ఒక చిన్న గదికి వెళ్ళింది, దానిలో ఒక సహోదరి ప్రశాంతంగా ఊడుస్తూ ఉంది. ఎందుకు ఆమె అక్కడ నిలవబడి, కేవలం ఊడుస్తూవుంది? ఎందుకు ఆమె పిల్లిని పట్టుకుని దానిని వదిలించుకోవటానికి ప్రయత్నించలేదు?
ఆ సన్యాసిని వెనుకకు తిరిగింది. ఆమె పెదవులు కదులుతున్నవి. "మియావ్?"
వెంటనే, క్రింది గది నుండి, ఒక సమాధానం వచ్చింది: "మియావ్!"
తల్లి అధికారిణి తదుపరి గదికి వెళ్లెను. ఇద్దరు సన్యాసినులు ఆశ్చర్యంగా చూస్తూ, మర్యాదపూర్వకంగా అడిగారు, "మియావ్?"
వీరు కూతలు కుయుచున్న సోదరీమణులు! కానీ అప్పుడు మరొక స్వరము చేరింది. ఇది వ్యాప్తి చెందింది! ఈ పిల్లి సంబంధమైన సంక్రమణ ఫ్రెంచి మఠంలోని ఇతర సన్యాసినులలో చాలా వరకు వ్యాపించుటకు ఎక్కువ కాలం పట్టలేదు. అప్పుడు, ఏదో విపరీతము సంభవించినది. మియావ్ చేయు సోదరీమణులు తమ పిల్లి కూతలను సమకాలీకరించడం/ కలిసి అరవటం ప్రారంభించారు! రోజులోని కొన్ని సమయాలలో, చాలా గంటలు వారు అందరూ కలిసి మియావ్ అని అరుచుచుండిరి. తల్లి సన్యాసిని/ మఠాధికారిణి వారిని అదుపుచేయుటకు చివరకు ఏమీ చేయలేకపోయెను.
శబ్దం పట్టణంలోచుట్టుప్రక్కల ప్రజలను ఇబ్బంది పెట్టసాగింది. పట్టణ ప్రజలు భయపడిరి మరియు సోదరీమణులు దెయ్యం పట్టబడిరని భావించి, సంఘటనను ప్రభుత్వానికి నివేదించిరి. ఈ విచిత్రమైన దృగ్విషయానికి గల కారణంను విచారణ చేయుటకు సైనికులు పంపబడ్డారు. వారు మఠం చుట్టూ చూచిన తరువాత, ఏ సన్యాసినియైనా అరచుటను కొనసాగిస్తే కొరడాలతో కొట్టబడునని ప్రకటించారు.1
సమస్య తీరింది. ఇక మియావ్ అరుపు లేదు! శతాబ్దాల తర్వాత, ఇది విసుగు చెందిన సహవాసినిలలో ఉన్మాదంగా వచ్చిన ఈడ్పురోగం/ మాస్ హిస్టీరియా తప్ప మరేమీ కాదని తేలిన ఒక ఆశ్చర్యమైన సందర్భ అధ్యయణంగా మిగిలిపోయింది.
సూచనా శక్తితో ఊగులాడిన వారు ఎప్పటికీ ఫ్రాన్స్ యొక్క క్రైస్తవ సన్యాసులు మాత్రమే కాదు.
కానీ, ఇక్కడ చెప్పబడినట్లు ఆశ్చర్యకరంగా, మాస్ హిస్టీరియా/ ఈడ్పురోగం మరియు 'సూచనల యొక్క శక్తి' క్రైస్తవులను ప్రభావితం చేయుట ఇదే చివరి సారి కాదు.
[WLC రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఏ పద్ధతులను లేదా సాంప్రదాయాలను ఏ విధంగాను ప్రోత్సాహించదు. పైన చెప్పిన కథ ఉదాహరణకి మాత్రమే ఇవ్వబడినది.]
ఆత్మలో వధించబడుట
తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో పౌలు ఇలా హెచ్చరించాడు: "అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును, దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. " (1 తిమోతి 4: 1, KJV) "ఆత్మ లో వధించబడుట" అనే ఆకర్షణీయమైన బోధన అలాంటి దెయ్యము యొక్క ఒక సిద్ధాంతం.
ఇది కొన్నిసార్లు "ఆత్మలో పడుట" లేదా "శక్తి యొక్క స్పర్శ" అని పిలువబడుతుంది. ఎవరైనా స్వస్థత కోరునప్పుడు ఇది తరచుగా సంభవిస్తుంది.
ఒక వ్యక్తిపై పవిత్రాత్మ యొక్క ఒక ఊహాజనిత గమనమును సూచించుటకు క్రైస్తవ సంఘాల యొక్క ఆకర్షణీయమైన వర్గాలలో "ఆత్మలో వధించబడుట" అనే పదంవాడబడుతుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిపై ఆ వ్యక్తి "చంపబడునంత" శక్తితో కదులుతుంది అని వాదిస్తారు. ఇది వ్యక్తి మరణించును అని కాదు, కానీ అతడు/ ఆమె ఆత్మ యొక్క సన్నిధితో అధిగమించబడునట్లు అతను/ ఆమె ఆత్మతో పూర్తిగా అధిగమించబడుతూ క్రింద పడును.2
అవును, యహువఃతో, అన్ని విషయాలు సాధ్యమే. సృష్టికర్త సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయన ఒక వ్యక్తి మీదకు ఆవ్యక్తిని అదుపులోనికి తీసుకొనగలిగినంత శక్తితో వచ్చుట పరిపూర్ణంగా సాధ్యమే. అయితే యహువః దీనిని చేయగలరా లేదా అనేది ఇక్కడ సమస్య కాదు, కాని ఇలాంటి నమ్మకం, ఇంకా వివరంగా చెప్పాలంటే ఇలాంటి అభ్యాసం బైబిలు సంబంధమైనదా కాదా అన్నది సమస్య.
ఇది బైబిలు కాలాల్లో ఉన్నదని రుజువు చేయటానికి ప్రయత్నిస్తూ, ఈ అభ్యాసానికి చెందిన వాళ్ళు లేఖనాలలో వివిధ భాగాలను చూపుతారు. ఏదేమైనప్పటికీ, ఈ వాక్యములను జాగ్రత్తగా పరిశీలించగా, వారు లేఖనాలను వక్రీకరించకుండా "ఆత్మలో పడటం/ వధించబడటం" కు మద్దతును ఇవ్వలేరని బహిర్గతమవుతుంది.
వీరు తరచుగా చూపించు ఒక వచనం సొలొమోను ఆలయ ప్రతిష్ఠను గురించి వివరించు వచనమై ఉంది.
వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాటకులును ఏకస్వరముతో యహువః కు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యహువః దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.
అప్పుడొక మేఘము యహువః మందిరము నిండ నిండెను; యహువః తేజస్సుతో ఎలోహ మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.(2 దినవృత్తాంతములు 5: 13-14)
పైన పేర్కొనబడిన వచనాల్లో ఎవరైనా యహువః యొక్క శక్తి వలన కూలిపోయినట్లు గాని లేదా ఏదైనా స్వస్థత జరిగినట్టు గాని ఒక్క ఉదాహరణ కూడా లేదు. చాలా విరుద్దం. 11 వ వచనంలో, "సమస్త యాజకులు పరిశుద్ధపరచబడిరి" అని చెప్పబడింది. సేవ చేయుటకు లేవీయులలో ఏ ఒక్కరైనా యహువః ఎదుట పరిపూర్ణ ఆరోగ్యంతో లేకుండా నిలిచినట్లయితే అది లేవీయుని చట్టం ప్రకారం ఆజ్ఞకు వ్యతిరేకం. కావున, నిజానికి యాజకులు ఎవరూ అక్కడ స్వస్థతను కోరుతూ లేరు. (లేవీయకాండము 21: 16-23 చూడండి.)
వాదన చేయువారు ఇంకా గెత్సెమెనే తోటలో రక్షకుని బంధించినప్పటి సంఘటనను కూడా సూచిస్తారు. మీరు ఎవరి కోసం వెదకుచున్నారని యహూషువః వారిని అడిగినప్పుడు, "వారు నజరేయుడైన యహూషువః నని ఆయనకు ఉత్తరమియ్యగా, యహూషువః ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి." (యోహాను 18: 5-6)
ఈ అభ్యాసం బైబిలు సంబంధించినదని నిరూపించడానికి ఉపయోగించే మరొక ప్రసిద్ధ వాక్యంగా, తర్షీషు మార్గంలో సౌలును మార్చిన వృత్తాంతంను చూపించెదరు. " అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేలమీద పడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. (అపొస్తలుల కార్యములు 9: 3-4)
యహూషువఃను బంధించినప్పుడు దుష్టులు కుప్పకూలట గాని లేక, సౌలు పడిపోవుట గాని ఆత్మలో పడిపోవుట అనే ఆధునిక నమ్మకానికి మద్దతిచ్చుటకు వాడబడవు. ఎందుకంటే స్వస్థపరచు వారి యొద్దకు వచ్చే వారు సాధారణంగా చాలా నిజాయితీ-హృదయం గల విశ్వాసులు మరియు వారి హృదయాలు, వారి జ్ఞానం యొక్క ఉన్నతముతో, వారు ఆయన ఆశీర్వాదాన్ని కోరినందువల్ల యహువఃతో సరైనవారిగా ఉన్నవారు.
ఒక మనిషి యహువః యొక్క పరలోక వైభవము, కీర్తి, మరియు దైవిక శక్తి ద్వారా అధిగమింపబడిన సంఘటనలు గ్రంథంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అయితే వారు ఏ దిశలో పడిరో అనేది చూచినప్పుడు, అది ఎల్లప్పుడూ ముందుకు, ప్రార్థన చేయుటకు వారి ముఖాల వైపునకు జరిగినది. ఉదాహరణకు: "నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.
10.అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి "(దానియేలు 10: 9-10, KJV)
నేడు ఆత్మలో ప్రజలు వధించబడుచున్నప్పుడు సంభవించునది ఏదైనా ఇంత కంటే భిన్నముగా ఉంది. దానియేలు పడిపోయినప్పుడు, ఆ దేవదూత తనను బలపర్చడానికి వెంటనే చేరుకున్నాడు. యోహాను కూడా యహువః శక్తి అతన్ని ఆవరించినప్పుడు వెంటనే బలోపేతం చేయబడ్డాడు: "నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను-భయపడకుము; "(ప్రకటన 1:17, KJV)
ఆత్మలో వధించు సువార్త నాయకులు మరియు విశ్వాస-స్వస్థత నాయకులు యహువః శక్తితో ఆవరించబడిరి చెప్పుకుంటున్నవారిని బలపరుచుటకు వెళ్ళుటలేదు. బదులుగా, వారు "వారి" శక్తి యొక్క ప్రదర్శనలో ఉన్నట్లుగా కనిపిస్తారు. నిజానికి, వారిలో చాలామంది వెనుకకు పడినవారు గాయపడకుండునట్లు కాపాడుటకు "చేతితో కాచువారిని" కలిగి ఉన్నారు.
తగ్గించుకొను మరియు అణుకువగల వాని పోలివుందా?
ఇలాంటి జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఇంతకు క్రితం కొన్నిసార్లు ప్రజలు హాని చేయబడిరి. ఎల్లా పెప్పార్డ్ కుటుంబం ఆమె 'పునరుజ్జీవన-సభల’ వద్ద గాయపడుట వలన అది ఆమె మరణంనకు కారణమాయెనని ఆరోపిస్తూ సువార్తికుడు బెన్నీ హిన్ పై బహుళ-మిలియన్ డాలర్ల దావా వేసింది.
"పెప్పార్డ్, 85, సెప్టెంబరు 23, 1986 న ఆమె హిప్ (తుంటి భాగంవద్ద) విరిగిన తరువాత ధమనులు మూసుకుపోవుట వలన ఆసుపత్రిలో చేరినప్పుడు మరణించారు. అప్పటికి 15 రోజుల క్రితం ఫెయిత్ టాబర్నికల్ వద్ద పునరుజ్జీవన సభల సమయంలో ఆమెకు ఈ ఎముక విరిగింది." 3
హిన్ యొక్క ఆశీర్వాదాన్ని అందుకోవడం కోసం పెప్పార్డ్ వరుసలో వేచి ఉన్నపుడు, తన ముందు నిలబడి ఉన్న వ్యక్తిని హిన్ కొట్టడంతో ఆ వ్యక్తి వెనక్కు వెళ్లి, ఆమెను క్రిందకి త్రోసి ఆమె తుంటి విరగగొట్టెను.
ఆమెకు వైద్య సహాయం అందించుటకు బదులు, వేదిక నుండి తొలగించి చర్చి ముందు భాగంలో ఒక సీటులో ఉంచునట్లు అతడు ఆజ్ఞాపించాడు. దావా వేసిన వ్యక్తి చెప్పెను.
పెప్పార్డ్ కు వైద్య సహాయాన్ని అందించాలని ఒక వ్యక్తి సూచించినప్పుడు, ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం; హాన్ అతడిని ఆపివేసాడు మరియు ఇలా చెప్పాడు, "ఆమెను ఒంటరిగా వదిలేయండి. దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడు." 4.
హన్ పాల్గొన్న మరొక సంఘటనలో, అతని కుమారుడు మరియు ఇద్దరు అంగ రక్షకులు కలిసి ఒక చెవిటి మరియు మూగ మనిషిని, కొంత నీటితో వేదిక వద్దకు వచ్చి ఆశీర్వాదాన్ని కోరినప్పుడు, అతడిని కొట్టి మరియు వేధింపులకు గురిచేసినందుకు అరెస్టు చేయబడ్డారు.
21 సంవత్సరాల హెస్స్టీఫెన్సన్ అరౌజోకు, ... ఉత్తర బ్రెజిల్‌లోని మనాస్ నందు మత సభల సమయంలో జరిగిన ఆ సంఘటన తర్వాత ఆసుపత్రి చికిత్స పొందవలసి వచ్చింది.
ముగ్గురు మనుష్యులు Mr. అరౌజో ను ఒక ట్రైలర్ లో బంధించి మరియు భౌతికంగా దాడిచేసి హింసంచెనని అనుమానించిన పోలీసులు జాషువా హిన్ 21 ను, బెన్నీ హిన్ యొక్క ఇద్దరు అంగరక్షకులతో పాటు నిర్బంధించారు....
వారు వేదిక దగ్గరలో ఉంచబడిన ఒక ట్రైలరులోనికి అరౌజోను తీసుకువెళ్లి, అక్కడ అతన్ని దానిలో బంధించి, అతడు ఎవరోననే విషయంను చెప్పమని కొడుతూ గుద్దుతూ హింసించిరి.
ఆ మనిషి తమ ప్రశ్నలను వినలేడు లేదా స్పందించలేనందున, భౌతిక దాడి కొనసాగింది, పోలీసులు చెప్పారు.
ఆందోళన చెందిన సామాన్య ప్రజలు పోలీసులను పిలిచిన తర్వాత వ్యూహాత్మక దళ అధికారులు ట్రైలరు వద్దకు వెళ్ళిరి.5
ఇది యహూషువః యొక్క లేదా అపొస్తలులలో ఏ ఒక్కరి యొక్క చర్యలకైనను పూర్తిగా భిన్నంగా ఉంది! ఒకప్పుడు ఇటువంటి కార్యాలలో పాల్గొన్న రాబర్ట్ లిచోవ్ ఇప్పుడు దాని యొక్క లోపాలను గూర్చి ప్రజలకు వెలుగులోకి తెచ్చుటకు, అతడు ఇలా వ్రాసెను:
స్పష్టమైన ప్రశ్న ఇలా ఉంది - దేవుడే ప్రజలను క్రింద పడగొట్టి ఉంటే, మనము వారిని చేతితో కాయవలసిన అవసరం ఎందుకు? ... ప్రత్యక్షంగా పవిత్ర ఆత్మ యొక్క ఉనికి మరియు శక్తి వలన ఇది జరుగుతుందని వారు వివరించెదరు. అలా అయితే, అతడు [ఆయన] ... సార్వభౌమంగా ఆ వ్యక్తిని క్రింద పడద్రోయునప్పుడు తన దీవెన ద్వారా ఆ వ్యక్తి గాయపడకుండా చూడటానికి తగినంత శక్తివంతమైన వాడు కాదా? ఈ సంఘములు కాపు కాయువారిని ఎందుకు నియమించుదురంటే, (1) ప్రజలు అనేకసార్లు నకిలీగా పడిపోతున్నారని వారికి తెలుసు, ఇది ముందుగా నిర్మాణం చేయబడిన ప్రతిస్పందన. (2) వారు సొంతవిగా చెప్పుకున్న విశ్వాసాలపై వారు విశ్వాసముంచరు. స్పష్టంగా దేవుడు తన ప్రజలను కాపాడుకోవటానికి తగినంత గొప్పవాడు కాదు.
అంతేకాదు, సహోదరులతో పాటు సోదరీమణులు కూడా ... కాపు కాయువారి వెనుక లేదా పక్కన, పొడవైన వస్త్రములను పట్టుకుని నిలబడి యుండుటను చూస్తాము. మహిళల [sic] కాళ్ళు మరియు శరీరాలపై ఈ వస్త్రములను కప్పుట వారి పరిచర్యలో భాగం. ఎందుకు? ఎందుకంటే ఎన్నో సార్లు స్త్రీలు ఆత్మలో వధించబడినపుడు, వారు చాలా అసభ్యకరమైన స్థితిలో పడిపోతారు.
కొందరు మహిళలు, దురదృష్టవశాత్తు తమ దుస్తులు పడిపోయినప్పుడు వారి శరీరాలు కొంచెం బయటపడును, మరియు వారి కాళ్ళు తగని కోణాల్లో బహిర్గతవుతాయి. ప్రభువు ఈ తన కుమార్తెలను ఇబ్బంది పెట్టినప్పుడు మనము వారి అవమానాన్ని త్వరగా కప్పవలసి వస్తుంది. ఇది నిజంగా [యహువః ఎలోహిం] తన కుమార్తెలకు ఇలా చేయునా?6
స్వేచ్ఛను పొందుట
యహూషువః వాగ్దానం చేశాడు, "మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును." (యోహాను 8:32, KJV) ఈ కార్యంలో చురుకుగా పాల్గొన్న వారిలో ఎక్కువమంది మోసగించుటను మానుకొనిరి. ఇప్పుడు వారు ఈ వింత నమ్మకం గురించి ఇతరులను హెచ్చరిస్తున్నారు. మార్క్ హావిల్లే అలాంటి వ్యక్తియే. తనను బయటకు తీసుకుని వచ్చినది ఏమిటి అని అడిగినప్పుడు, హావిల్లే తాను లేఖనాలను చదివితినని సమాధానమిచ్చెను.7
ఈ అభ్యాసానికి బైబిలు మద్దతు ఇస్తుందని నమ్మని మరొక సహోదరుడైన మైక్ రైట్, ఈ నమ్మకానికి గల మరొక సమస్యను సూచించెను: సామాజిక ఒత్తిడి. అతడు వ్రాసెను:
బెన్నీ హిన్ ఒక అల్పాహార ప్రార్థన వద్ద మాట్లాడారు మరియు అతడు మా బల్లకు ఇతర వైపునున్న నా తల్లి కోసం చేసిన ప్రార్థనను నేను వీక్షించాను. ఈ జూనియర్ సూపర్ స్టార్ తో కలిసి పనిచేస్తున్న పూర్తి సువార్త వ్యాపారవేత్తల బృందం అధ్యక్షుడి చుట్టూ అంగరక్షకుల సమూహం వలె, గొప్ప అంచనాలను మరియు ఉత్సాహాన్ని పెంచుతూ, మరియు వారు చేరుకున్న పద్ధతిలో కేవలం అధికారాన్ని మరియు గౌరవాన్ని వెలిబుచ్చుతూ గుంపు మధ్యగా నడిచిరి.
అమ్మ ఆత్మలో వధింపబడ లేదు, కానీ ఆమె నాకు చెప్పారు - బెన్నీ తన చేతిని ఆమె నుదిటిపై తిరిగి మోపి ఎక్కువసేపు త్రోసి ఉంటే - ఆమెకు బహుశా జరిగి ఉండేదని. అయితే పవిత్ర ఆత్మ యొక్క ఈ (అనుకొనుచున్న) అద్భుత చర్యతో ఆశీర్వదించబడుటకు ఆమెకు 'విశ్వాసం తగినంతగా లేదు, లేదా చూపించలేదు, లేదా తగినంత నీతిమంతురాలు కాదు' అని ఆమెకు కొంతవరకు కలిగిన ఇబ్బందికర స్పందన. (ఇది నిస్సందేహంగా అపరాధం తాలూకా నా మొదటి అభిప్రాయం - మరియు తరచుగా ఈ అపరాధం స్పష్టంగా - ఆశించేవారిపై/ గ్రహీతపై మోపబడుతుంది).8
ఒక ఆశీర్వాదం లేదా స్వస్థతను కోరు వారు, ఆత్మ శక్తికి తమ భౌతిక స్పందనను ప్రదర్శించేందుకు వారిపై భౌతికంగా ఒత్తిడి కలిగించబడుతుంది. ఒకవేళ వారికి అది జరగకపోతే, ఆ వ్యక్తికి తగినంత విశ్వాసం లేకపోవుట లోపముగా ఉండెనని (ఆ వ్యక్తి ద్వారా మరియు ఆ వ్యక్తిని చూసేవారి ద్వారా) ఊహించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక రాజ్యంలో విశ్వాసులు భరించుటకు తీసుకురాబడిన సామాజిక ఒత్తిడి. రైట్ విచారంగా గమనించడం ద్వారా ఇలా ముగించాడు:
నేను మీకు ముప్పై సంవత్సరాల విలువైన కధలను తిరిగి చెప్పగలను, మరియు వాటన్నింటికీ ముగింపు ఏమిటంటే మనము (తెలియకుండా) లేదా మంచిగా తెలిసిన వ్యక్తులచే మోసగింపబడిన ఒక హాస్యనాటకంలో పాల్గొన్నాము. ఇప్పుడు [యహ్ యొక్క] వాక్యాన్ని వివరంగా చదివిన తరువాత, మేము ఆత్మలో వధించబడుట యొక్క బోధను స్పష్టంగా ఖండించాము. బైబిలులో ఎక్కడా ఇది ఆచరణలో లేదు, మరియు కేవలం [యహ్] యొక్క శత్రువులు మాత్రమే ఆవరించు శక్తి ద్వారా వెనక్కి పడునట్లు చేయుచుండిరి. పేర్కొనబడిన ప్రతి ఇతర సంధర్భంలోను, [యహువః] సమక్షంలోనికి తేబడిన మనుష్యులు తమ ముఖభాగం వైపుగా ముందుకు ఇష్టపూర్వకంగా సాష్టాంగపడిరి, (వినయపూర్వకమైన ఆరాధనలో) - లేక, ... వారు మరణించిరి. 9
మనస్సు పైగా మనస్సు
"ఆత్మలో వధించబడిన" అనుభవం గూర్చిన సాక్ష్యములు తరచుగా పెద్ద సభలలో లేదా సువార్త ప్రయత్నాల సమయంలో, తరచుగా బోధకుడు స్వస్థత నిమిత్తం ఒక ప్రత్యేక సమయంను కేటాయించినపుడు ఇవ్వబడుతుంటాయి. అతడు లేదా ఆమె చుట్టూ తిరుగుతూ, ఒక అనారోగ్య వ్యక్తి యొక్క నుదుటి మీద తన చేతిని వేయగా, తరువాత ఆ వ్యక్తి వెనుకకు పడిపోవును. బెన్నీ హిన్ వంటి కొంతమంది "విశ్వాస స్వస్థతలు చేయువారు", పవిత్ర ఆత్మ యొక్క శక్తికి ఎకసెక్కమును/జోకును కూడా జత చేస్తారు, గుంపుపై తన సూటు జాకెట్టును ఊపుట వలన లేక వారిమీద ఊదుట వలన, ఊహించలేని విధంగా, వారు నేల కూలుదురు.
ముందుగా ప్రస్తావిం చబడిన మార్క్ హావిల్లేను ఒక ఇంటర్వ్యూలో ఆత్మలో వధింపబడుటను గూర్చి అడిగినప్పుడు. అతడు క్రింది జాబితా చెప్పెను:
- ప్రజలు సూచించబడుదురు. ఒక వ్యక్తి ఒక సూచించిన మనోస్థితి లోనికి లేదా మార్చబడిన స్పృహలోకి నడిపింపబడగలడు, ఇక్కడ వారు బోధకుని [స్వస్థపరచువాని] మరియు వారి చుట్టూ ఉన్న ప్రతిచర్యలకు ప్రభావితం కావడానికి మొగ్గుదురు.
- కార్యక్రమ నాయకులు వ్యక్తి యొక్క హృదయ స్పందనతో సంబంధం కలిగివుండే సంగీతంను ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయుదురు. స్తుతి మరియు ఆరాధన సంగీతంలోని ధ్వని హృదయ-ప్రసరణ వ్యవస్థతో సర్దుబాటు అవుతుంది.
- మనోరంజకులు సమూహ క్రియాశీలత యొక్క శక్తిని అర్థం చేసుకునిరి. అందుకే హాస్యనటులు మరియు రాక్ స్టార్లు కార్యక్రమంలో “వేడి (ఉద్రేకం) పుట్టించుట” వంటి ప్రారంభ కార్యములను చేయుదురు. సమూహ క్రియాశీలతలు కూడా విశ్వాస స్వస్థతలు చేయువారికి అనుకూలంగా పనిచేయును. మీ నుదుటిపై స్పర్శించినప్పుడు మీరు పడుటాన్ని చూచుటకు ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ ఎదురుచూచుదురో, అప్పుడు చాలా మంది ప్రజలు పడెదరు.
- పునరావృత సంభాషణ పద్ధతులు, మరియు కొన్ని గొంతుల యొక్క స్వరములు, ప్రభావితయ్యే మనస్సులను ప్రేరేపించగలవు. ఒక ఎరిక్సోనియన్ హిప్నాసిస్ కు సంబంధించిన నాడీ-భాషా కార్యకలాపం, ఎరిక్సోనియన్ వశీకరణలు పెంతెకోస్తు కానటువంటి క్రైస్తవ మత శాఖలను ముట్టడించెను, కొందరు పాస్టర్లు వారి సమాజాలకు గర్వంగా తమ సామర్ధ్యాలను చూపుటకు వారిని వశీకరణ చేయుదురు.
- ఇటువంటి ఏర్పాటులలో ప్రజలు వశీకరణ చేయబడటానికి అవకాశం ఉంది. ఆవిధంగా కొంత కాలం వరకు, వారి నొప్పి చాలా బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, అధ్యయనాలను అనుసరించి చూస్తే, అత్యధికులు మొదటిసారిగా నయం చేయబడిరని అనుకొనెదరు, అయితే నిజానికి, ఆది వాస్తవం కాదు అని తెలుస్తుంది.
చార్లెస్ ఎస్. ప్రైస్ బ్రిటీష్ కొలంబియాలో పునరుద్ధరణను చేపట్టినపుడు, అందులో 350 మంది తాము నయం చేయబడిరని విశ్వసించారు. అయితే, ఆరు నెలల తరువాత, ఒక అనుసరణ అధ్యయనం చాలా కలతపెట్టే ఫలితాలు వెల్లడించింది. స్వస్థత ద్వారా నయం చేయబడిన 350 మందిలో 301 మంది ఇప్పటికీ అనారోగ్యంతో ఉన్నారు, 39 మంది వాస్తవానికి చనిపోయారు మరియు ఐదుగురు మతిస్థిమితం కోల్పోయారు. కేవలం ఐదుగురు మాత్రమే నయం చేయబడినట్లు పేర్కొన్నారు.10
ఖచ్చితముగా ఇవే పద్ధతులు, తూర్పు మతాలలోను మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ మార్మిక సంప్రదాయాల్లోను ఉపయోగించబడుతున్నాయని హర్విల్లే అంగీకరించాడు.
సాతాను తనకు తాను వెలుగు దూతగా మార్పుచెందగలడని పౌలు హెచ్చరిస్తూ, ఇలా పేర్కొన్నాడు: "ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు, గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. (2 కొరింథీయులకు 5: 14-15, KJV). ఇదియే ఖచ్చితంగా పెంటెకోస్టల్ కదలికలలో జరుగుతుందని చెప్పవచ్చు: మార్చబడిన స్పృహలోకి నడిపింప బడుట, ఆధ్యాత్మిక మైమరుపు, వశీకరణ మొదలగునవి. వీటిలో క్రైస్తవ పదజాలాన్ని ఉపయోగించడం, "యేసు" కు ప్రార్ధించడం, "పునరుజ్జీవనం" కోసం పిలుపు, "విశ్వాసము" కలిగి ఉన్నవారిని హెచ్చరించడం వంటివి చేయుచూ, ఈ క్రైస్తవ గురువులు వెలుగు వస్త్రాల క్రింద క్షుద్ర ఆచరణలను ధరించెదరు.
పవిత్ర ఆత్మ శక్తికి ఆపాదించబడిన ‘విశ్వాస స్వస్థత’ మరియు ఇతర బహిరంగ ప్రదర్శనలు సుదీర్ఘకాలంగా చుట్టూ ఉన్నప్పటికీ, టొరంటో, కెనడా, 1994 లో టొరంటో విమానాశ్రయ చర్చిలో జరిగిన ఈ సంఘటన ఒక పెద్ద పునరుద్ధరణను పొందింది. ఈ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన పాల్ గోల్డి11 , మొదట్లో అది నిజాయితీగా యహువః వలనే అని నమ్మాడు. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు కుక్కలవలె అరవటం లేదా పవిత్ర ఆత్మ యొక్క అధికారం క్రింద జంతువులులా వ్యవహరించేటప్పుడు, ఇది నిజంగా యహువః వలనేనా అని ప్రశ్నించుకోవటం ప్రారంభించాడు. అతను హెచ్చరించాడు:
నేడు, నేను ఇది చాలా చీకటి సంబంధించినదని అని చెబుతాను ... నేడు, నేను ఆ ఆత్మ ఒక తప్పుడు ఆత్మ, ఒక నకిలీ ఆత్మ మరియు లేఖనాల యొక్క పవిత్ర ఆత్మ కాదు అని నమ్మెదను. ... నేను ఇది నిజమైనదని గాని పవిత్ర ఆత్మ నిజమైన బయలుపాటు అని గాని ఎప్పుడూ చెప్పను, ఎందుకంటే ఆ సంఘం యొక్క ఫలం కుళ్ళినదని నేను చెబుతా. ... పవిత్ర ఆత్మ, అతని పేరును బట్టి, పవిత్రమై ఉండెను. ఆయీ ప్రజలను ఏదేని అపవిత్రమైన దానిని చేయాలని ప్రోత్సహించడు.
ప్రజలు ... [యహ్] యొక్క పోలికలో తయారు చేయబడ్డారు. మనుష్యులను జంతువులవలె నడపడం ద్వారా [యహువః] మనుష్యుల విలువను ఎందుకు తగ్గించును? ఈ సమావేశాలలో పవిత్ర గ్రంథానికి విరుద్ధంగా ఏదైనా ఉన్నట్లయితే అది [యహువః] కు విరుద్ధం ఎందుకంటే [యహ్] మార్పు లేని వాడు కావున . ... దీనికి హత్తుకొన వద్దు; ఇది తేలికైన విషయం అని అనుకోకండి. ... ఇది [యహ్]ది కాదు ... ఇది దెయ్యం యొక్క పథకం మరియు ... ఇది పురుషులు, స్త్రీలు మరియు దానిని స్వీకరించే పిల్లలందరినీ పూర్తిగా నాశనం చేయును.12
నేడు "ఆత్మలో వధించబడిన" వారి మధ్యలో చూపబడుతున్న ఏ (సమూహంగా చేయు) నీచమైన దృశ్యాలు, ప్రారంభ విశ్వాసుల మధ్య జరిగినట్టు లేఖనములలో సూచించబడలేదు. యహువః పవిత్రంగా ఉండినట్లే బైబిల్ ఆరాధన పవిత్రమైనది. యహ్ యొక్క ఆనందం వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవాన్ని ఎప్పుడూ నాశనం చేయదు. ఆత్మ యొక్క ఫలములలో ఒకటి స్వీయ నియంత్రణయై ఉంది. ఆయన మీ వ్యక్తిత్వంలోకి చేర్చాలని ప్రయత్నిస్తున్న దానిని యహువః క్రియాశీలంగా నాశనం చేయునా?
మన బోధకుడైన యహూషువః యొక్క స్వస్థత స్పర్శను నిజంగా అనుభవించిన వారికి "ఆత్మలో వధించబడుట" అని చెప్పబడే వారి యొక్క అనియత మరియు అప్రతిష్ట ప్రవర్తన విరుద్ధంగా ఉంది: వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరమునుండి యహూషువఃను చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి యహూషువా, సర్వోన్నతుడైన ఎలోహ కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయననీ పేరేమని వాని నడుగగా వాడునా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుకఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యహూషువః వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యహూషువః నొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. (మార్కు 5: 1-15) గమనిక: యహువః తీసుకువచ్చే పరివర్తన "ఆత్మలో వధింపబడిన వారు" అనుభవించిన దానికి వ్యతిరేకమైనది. పై భాగంలో, యహువః యొక్క ఆత్మ, దయ్యం పట్టిన మనిషి యొక్క అస్థిరమైన ప్రవర్తనను నిశ్శబ్దం చేసెను మరియు అతనిలో ఒక సంపూర్ణ మనస్సును పునరుద్ధరించెను. ఆత్మలో వధించబడుట అను బైబిలేతర అభ్యాసాన్ని సమర్ధించువారు దీనికి వ్యతిరేకతను ప్రదర్శిస్తారు; వారు ఒక సంపూర్ణ మనస్సును దాని స్థితి నుండి నిర్లక్ష్యం మరియు క్రమరహిత భావోద్వేగపు ప్రవర్తనా స్థితికి రూపాంతరం చేయుదురు.
|
నిజమైన బైబిలు ఆధ్యాత్మికత.
విశ్వాసులను లేఖనం ఇలా హెచ్చరిస్తుంది: సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును (కీడుగా కనబడు ప్రతిదానికి) దూరముగా ఉండుడి. (1 థెస్సలొనీకయులకు 5:21,22). నిజమైన, బైబిలు సంబంధమైన ఆధ్యాత్మికత స్థితికి తిరిగి రమ్మని క్రైస్తవులను యహువః నేడు పిలుచుచుండెను. సర్వోన్నతునితో నిజమైన సంబంధం అల్లరి సమూహంతో రాదు. ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక అనుభవము వ్యక్తిగతంగా వస్తుంది, నిశ్శబ్దంలో ఉన్నప్పుడు, ఒంటరి ఆత్మ ఒక చిన్న స్వరమును వినగలుగును.
పర్వతమును బద్దలు చేసిన ఆ గొప్ప గాలిలో యహువః లేడని హోరేబు పర్వతం మీద ఏలియా చెప్పబడెను. ఆయన భూమిని కదిలించడానికి కారణమైన ఆ భూకంపంలో లేడు. ఆయన ఒక అగ్ని తుఫాను యొక్క గజిబిజి గందరగోళం కాదు. బదులుగా, అందరి సృష్టికర్త తన సేవకునితో మాట్లాడటానికి, ఇంకా చిన్న స్వరంలో మాట్లాడటానికి ఎంచుకున్నాడు. (1 రాజులు 19: 11-12 చూడండి.)
నేడు ఇది మనకు పాఠంగా ఉంది. ఆయనతో సన్నిహితమైన, వ్యక్తిగత అనుబంధం కొరకు నీ హృదయం యొక్క ఆశ ఆయనకు తెలుసు. ఆయన దానిని అసంతృప్తిగా వదిలివేయడు. నీ హృదయంలో ఆ కోరిక ఆయనచేత విత్తబడింది!
మీ ఉదాహరణను రక్షకుని వలే ఉండనీయుడి. "ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. "(మార్కు 1:35, NKJV). మీరు రద్దీగా ఉన్న అపార్ట్మెంట్లో నివసించవచ్చు. మీరు విశ్వాసులు కాని కుటుంబ సభ్యుల మధ్య ఉండవచ్చు. కానీ మీరు కూడా మీ స్వంత ఒంటరి స్థలానికి వెళ్ళగలరు.
బహుశా మీ ఒంటరి స్థలం మీ పడకగది కావచ్చు. బహుశా అది మీ సొంత గది అవవచ్చు. బహుశా అది పార్కు లోని నిశ్శబ్ద మూలలో ఒక బల్ల కావచ్చు. బహుశా అది కిరాణా దుకాణపు పార్కింగు స్థానానికి చాలా చివరిలో నిలిపిన మీ కారు కావచ్చు. బహుశా మీకు కావలసిన నిశ్శబ్దంను స్నానాల గదిలో మీకు మీరు గడియ పెట్టుకొని కూడా పొందవచ్చు. మీరు ఆయన నుండి చిన్న స్వరమును వినుటకు నిశ్చలమైన స్థలాన్ని ఎక్కడ కనుగొనినా, మీ తండ్రి మీ దగ్గరికి వస్తాడు మరియు మీతో మాట్లాడతాడు.
"ఆత్మలో వధించబడుట" అనే అభ్యాసం భావోద్వేగ ఉత్సాహం మీద ఆధారపడుతుంది.
ఒక ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు వారు ఒక అతీంద్రియ అనుభవం నిమిత్తం సత్యాన్ని వదులుకున్నారు. ఇది ఒక బైబిలు అనుభవము కాదు, కానీ ఒక మానవాతీత శక్తి కావచ్చు. అలా చేయుట ద్వారా వారు ఏ విధమైన పరీక్ష చేయకుండా అజాగ్రత్తతో ఈ మోసంనకు దారి తెరచెదరు... ప్రజలు బైబిలు రుజువు కోసం ఎప్పుడూ పరీక్షించకుండా ఆశీర్వాదం యొక్క ముసుగులో, ఒక అతీంద్రియ అనుభవం కొరకు సత్యాన్ని వదిలిపెడుచున్నారు.13
దైవిక సత్యం భావోద్వేగాలపై ఆధారపడదు, కానీ మనసులపై పనిచేస్తుంది. యహువః ఇలా అంటున్నారు, "రండి, మన వివాదం తీర్చుకొందుము." (యెషయా 1:18, KJV) హేతుబద్ధంగా వేదాంతశాస్త్రంతో లేఖనాలను సరిపోల్చండి. భావోద్వేగంతో వేదాంతశాస్త్రంను పోల్చకూడదు. ఎందుకంటే ఒక రాక్ సంగీత కచేరీలో ప్రేక్షకులు అనుభవించిన అనుభూతి యొక్క ఏకత్వం మరియు ఆనందంతో, మీరు శిబిరంలో 2,000 మంది ఇతర శిష్యులతో కలిసి పాడటం వలన కలిగునది సమానంగా ఉంటుంది.
భావోద్వేగం దేనికీ రుజువుగా ఎన్నటికీ ఆమోదించబడదు, రక్షణకు ముఖ్యమైనది మరొకటి ఉంది. రక్షణకు యహువః నందలి పశ్చాత్తాపం మరియు విశ్వాసం అవసరం, స్పృహతప్పించే మైమరపు లేక భావోద్వేగాలు కాదు.
మీరు ఇలాంటి అహేతుకమైన, భావోద్వేగ ప్రదర్శనలలో పాలుపంచుకున్నట్లయితే దయచేసి, ఇది బైబిలు సంబంధమైనది కాదని తెలుసుకొనుటకు మా మాటలను బట్టి తీసుకోవద్దు. మీయంతట మీరే లేఖనాలను చదవండి! యహువః వాక్యం ద్వారా సమస్త విషయాలను నిరూపించండి. ఆయన మాటలతో ఏకీభవించని సమస్తమును ప్రక్కన పెట్టి మరియు మేలైన దానిని పట్టుకోండి. యహువః ఎల్లప్పుడూ తనకు దగ్గరగా ఉండుటకు ఆశపడే ప్రతి ఒక్కరి ఆత్మ-ఆకలిని సంతృప్తి పరుస్తాడు.
1 J. F. C. హెకెర్, ఎపిడెమిక్స్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్. p. 127.
2 మాట్ స్లిక్, "ఆత్మలో వధించబడుట అంటే అర్థం ఏమిటి?" క్రిస్టియన్ అపోలోటిక్స్ అండ్ రీసెర్చ్ మినిస్ట్రీ.
3 http: //newsok.com/article/2225326
4 Ibid.
5 http: //www.dailymail.co.uk/news/article-2280403/Evangelist-Benny-Hinns-son-arrested-brilil-beating-deaf-dumb-manfathers-events.html
6 http: //www.ovrlnd.com / FalseDoctrine/slaininthespirit.html.
7 https: //www.youtube.com/watch v = YCJ9v_-aJho?
8 http: //www.bereanresearchinstitute.com/03_Doctrines/D.0003_Slain_in_the_Spirit.html, ప్రాముఖ్యత అందించబడింది.
9 Ibid., ప్రాముఖ్యత అందించబడింది.
10 నాదెర్ మిఖాయిల్, ది టొరంటో బ్లెస్సింగ్ అండ్ స్లేయింగ్ ఇన్ ది స్పిరిట్, చూడండి http://www.ukapologetics.net/slain.htm.
11 https://www.youtube.com/watch?v=FfmAIxz1yBs&spfreload=5 చూడండి. ఆడియో కొద్దిగా అస్పష్టంగా మరియు తయారు చేయట కష్టమయినందున పాల్ యొక్క ఇంటిపేరు, తప్పుగా ఉండవచ్చు.
12 ఐబిడ్.
13 http://www.letusreason.org/Pent14%20.htm