లూసిఫర్, యహువా విరోధి, ఏడవ దినపు సబ్బాతును కనుగొనుటకు వుపయోగించు కేలండరును మార్చివేయుట ద్వారా సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను దొంగిలించాడు. అయితే అతడు మార్చివేసినది అదిమాత్రమే కాదు. చివరికి దినప్రారంభమును కూడా అతడు మార్చివేసెను. ఆధునిక 24-గంటల “దినము’’ అర్ధరాత్రి నుండి ప్రారంభమవుతుంది. యూదులు మరియు శనివారపు సబ్బాతీయులు వారి విశ్రాంతిదినమును శుక్రవారం సాయంకాలమున ప్రారంభిస్తారు. నిజానికి దిన ప్రారంభము ఎప్పుడు అనే దానిని లేఖనము బహిర్గతం చేస్తూవుంది. అయితే అది అర్ధరాత్రి కాదు లేక సూర్యాస్తమయం కాదు.
దినము (day) వేకువ (dawn)తో ప్రారంభమవుతుంది మరియు సాయంత్రం చిరుచీకటి (dusk) పడునప్పుడు ముగుస్తుంది. రాత్రి (night) చంద్రుడు మరియు నక్షత్రాలు ద్వారా ఏలబడును, అందువలన, దినము/ day (తెలుగులో పగలు అని వ్రాయబడినది) సూర్యోదయానికి ముందు నక్షత్రాలు అదృశ్యమయ్యేటప్పుడు ప్రారంభమై - సూర్యాస్తమయం తర్వాత అవి మళ్ళీ కనిపించినప్పుడు ముగుస్తుంది.
రాత్రినేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును. (కీర్తనల గ్రంథము) 136:9
పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యహువః ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యహువః అని ఆయనకు పేరు. (యిర్మీయా) 31:35
రాత్రి చిరుచీకటి (dusk) పడునప్పుడు ప్రారంభమవుతుంది మరియు వేకువ (dawn) తో ముగుస్తుంది. ఒక కేలండరు తేదీకి ఒక దినము/day/పగలు సమానార్థం కాదు. దీనికి విరుద్ధంగా ఒక కేలండరు తేదీ దినము/day/ పగలు మరియు రాత్రి/night రెండిటినీ కలిగియుండును, మరియు అది వేకువనే ప్రారంభమవుతుంది. రాత్రి/ night ఒక కేలండరు తేదీలో రెండవ సగం అయితే దినము/day/పగలు అనేది మొదటి సగం మాత్రమే.
సృష్టిలో మొదటి వారము వెలుగు కమ్మని సృష్టికర్త పలకగా ప్రారంభ మాయెను. ఈ ప్రపంచములో; మొదటి వారములో మొదటి దినము వెలుగును సృష్టించడముతో ప్రారంభమాయెను.
“మరియు ఎలోహీం వెలుగును చీకటిని వేరుపరచెను....[యహువః] వెలుగును day/దినమనియు (తెలుగులో పగలని వ్రాయబడినది), చీకటిని night/రాత్రనియు పిలిచెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.’’ (ఆదికాండము 1:4 and 5, NKJV).
యహువా చీకటినుండి వెలుగును వేరుపరచినప్పుడు ఆయన వెలుగును day/దినమని (తెలుగులో పగలని వ్రాయబడినది) పిలిచెను మరియు ఆ దినమును అస్తమయము, ఉదయము కలసి పూర్తి చేసినట్లుగా వర్ణించెను.
“అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.” (ఆదికాండము 1:5, KJV).
మోషే ఆదికాండమును వ్రాస్తున్నపుడు అతనికి రాత్రి అనే పదము లేకపోలేదు. అయితే అస్తమయము, ఉదయము ఈ రెండు పరివర్తనా సమయములూ కలిసి ఒక దినమును ఏర్పరచినట్లు అతడు ఆదికాండములో వ్రాసెను. దినము అర్ధరాత్రియో లేక అస్తమయమునో దినము మొదలైనట్లయితే, ఆయన అస్తమయము-ఉదయము కలిసి పూర్తి దినమును ఏర్పరచినట్లు వ్రాసి యుండెడివాడు కాడు.
దినము అస్తమయంతో ప్రారంభమవుతుందని చెప్పేవారికి లేవికాండము 23:32 ఒక ముఖ్యమైన ఆధారము.
“సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.” (లేవి 23:32b, KJV).
అయితే ఈ వాక్యమును సందర్భానుసారముగా చదివినపుడు స్పస్టమయ్యేది ఏమిటంటే, ఇది ప్రతి దినానికీ వర్తించదు. లేవికాండము 23:26-32 లో ప్రాయశ్చితార్ధ దినమును గూర్చిన యహువః యొక్క సూచనలు ఉన్నవి. ఒకవేళ ప్రతి దినమూ సాయంకాలముతో మొదలయినట్లయితే, అలాంటప్పుడు ప్రాయశ్చిత్త దినమును ఒక సాయంకాలము ముందునుండి ప్రారంభించమని ఇశ్రాయేలీయులతో ఆయన చెప్పనవసరము లేదు.
“ప్రాయశ్చితార్ధ దినము” కేలండరులో రెండు తేదీలలో కొనసాగుతుంది: తొమ్మిది మరియు పది.
“యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము . . . . అది మీకు మహా విశ్రాంతిదినము . . . మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను." (లేవీయకాండము 23:27,32).
ఒకవేళ దినాలు సాయంకాలము నుండి మొదలయినట్లయితే, మోషే సహజంగా ఏడవ నెల పదియవ దినము ప్రాయశ్చితార్ధ దినం అని చెప్పాలి. వెలుగు రావటముతో దినము ప్రారంభమవుతుంది. అది నిజము అని తొమ్మిది పగటిని తొమ్మిది సాయంకాలము వెంబడించుట నిరూపిస్తుంది. సాయంకాలము తొమ్మిదో దినమును “ప్రారంభించ” గలగదు. అసలు సాయంకాలము ఏ దినమునూ ప్రారంభించ లేదు, చివరికి ఏడవ దినపు విశ్రాంతి దినమును కూడా!
సూర్యుడు పగటిని ఏలుటకు ఇవ్వబడెను. దినం వెలుగు రావడముతో ప్రారంభమై, వెలుగు పూర్తిగా పోయిన తరువాత, సూర్యుడు ఏలుటకు ఎమాత్రమూ వెలుగు లేనపుడు ముగియును. శతాబ్దాల తరువాత రక్షకుడు ఇలా అడిగెను: “పగటికి/day/దినముకు 12గంటలున్నాయి కదా అని”! (యోహాను 11:9). ఆయనతో ఎవ్వరూ వాదించలేదు. వెలుగు రావటముతో దినము ప్రారంభమవుతుందని అక్కడ అందరూ ఎరుగుదురు. దినము యొక్క గంటలు 12 భాగాలుగా (సూర్య గడియారంపై) విభజింపబడి ఉండేవి. గంటల నిడివి వేసవిలో పెద్దవిగాను, చలికాలంలో కురచగానూ ఉండెను. ప్రతి దినానికి పన్నెండు గంటలు మాత్రం తప్పక ఉంటాయి.
సువార్తలలో ఆయన సిలువ వేయబడుట, సమాధి చేయబడుట, తిరిగి లేచు సమయములు దిన ప్రారంభము తెల్లవారుజామున అని తెలియజేస్తుండెను.
“విశ్రాంతిదినము గడచిపోవుచున్న సమయములో వారములో మొదటిదినముకు తెల్లవారుచుండగా, మగ్డలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూచుటకు వచ్చెను.” (మత్తయి 28:1, KJV)
అంటే వారంలో మొదటి దినము తూర్పున వెలుగు కలుగువరకు ప్రారంభమవలేదు. అందువలన సిలువ వేయబడిన సాయంకాలమున, విశ్రాంతిదినము సుర్యాస్తమయ సమయంలో ప్రారంభమవలేదు: సబ్బాతు రోజున దేహములు సిలువపై ఉండుటకు యాజకులు, అధికారులు ఇష్టపడుటలేదు అని లేఖనములు తేటగా తెలియజేయుచున్నవి.
“ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దిమున సిలువ మీద వుండకుండునట్లు, కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేసిన మొదటి వాని, రెండవ వాని కాళ్ళను విరుగ గొట్టిరి. వారు యహూషువః నొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుందుట చూసి ఆయన కాళ్ళు విరుగగొట్ట లేదు...” (యోహాను 19:31-33, KJV).
సాధారణముగా సిలువలో మరణించుటకు కొన్ని దినముల సమయం పడుతుంది. ఖైదీలను చంపుటకు తొందరపడుటకు గల ప్రధాన కారణం, విశ్రాంతిదినం ప్రారంభం కాకాముందే వారిని సిలువపైనుండి వేరుచేయాలి గనుక.
“[యహుషువ] శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి, పిలాతునొద్దకు వెళ్లి, [యహుషువః] దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతనికప్పగింప నాజ్ఞాపించెను.యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి, . . .క్రొత్త సమాధిలో దానిని వుంచి...వెళ్ళిపోయెను. ” (మత్తయి 27:57-60, NKJV).
ఇది సమయమును తీసుకొనెను.
- యోసేపు పిలాతుయొద్దకు వెళ్లి దేహమును అడిగెను. (మత్తయి28:58)
- దినముల సమయం తీసుకునే సిలువ మరణ శిక్షలో ఆయన అంత త్వరగా మరణించాడని పిలాతు నమ్మలేక, మరణమును నిర్ధారించుటకు శతాధిపతిని పంపెను. (మార్కు 15:44,45).
- యోసేపు వెళ్లి నారవస్త్రములు తీసుకుని, గొల్గోతాకు వచ్చి, దేహమును దించుట ప్రారంభించెను. (మార్కు 15:46).
- నికోదేము ఆదేహమును సమాధికి సిద్ధపరచుటకు 150 సేర్ల ఎత్తు బోళమును,అగరును తీసుకుని అక్కడుకు చేరెను. (యోహాను 19:39)
- పరిమళాలను పూయుటకు, పరిశుభ్రమైన నారబట్టలు చుట్టుటకు ముందు దేహమును బాగుగా కడిగి శుద్దిచేయుట. (యోహాను 19:40)
- తరువాత ఆ దేహమును దగ్గరలో వున్న యోసేపు యొక్క సొంత సమాధిలో ఉంచుట.(మత్తయి 27:59, 60)
ఒక బైబిలు దినము, అరుణోదయమున సూర్యుని ముందస్తు కాంతి ప్రవేశంతో (సూర్యోదయానికి ముందు) ప్రారంభమవుతుంది. |
ఇది చాలా సుదీర్గమైన ప్రక్రియ, ఆ రాత్రి పూర్తిగా పట్టెను. విశ్రాంతిదినము సాయంకాలమున ప్రారంభమవలేదు ఎందుకంటే సరిగ్గా అదే సమయానికి అరిమతయ యోసేపు దేహం నిమిత్తము పిలాతు వద్దకు వెళ్ళెను.
ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. గనుక సాయంకాలమైనప్పుడు, అరిమతయ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి [యహుషువ] దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై ఎలోహీం రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. (మార్కు 15: 43, NKJV).
రక్షకుని సమాధి చేయుట విశ్రాంతి దిన ప్రారంభ సమయానికి కొంచెము ముందు ముగిసెను.
అతడు [అరిమతయ యోసేపు] దానిని క్రిందికి దించి, సన్నపు నార బట్టతో చుట్టి, తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు. ఆదినము సిద్ధపరచు దినము; విశ్రాంతిదినారంభము కావచ్చెను. (లూకా 23:53, 54, KJV)
“ఈ వాక్యంలో ప్రారంభమాయెను అన్న పదము ఎఫిపోస్కో అను గ్రీకు పదమునుండి భాషాంతరము చేయబడినది. దీనర్ధము: వెలుగు ప్రారంభము; అరుణోదయము; ఇది #2017, . . (epiphauo) కు ఒక రూపము. దీనర్ధము ప్రకాశించుట; వెలుగు ఇచ్చుట. ఎందుకంటే వారు దేహమును దించుటకు అనుమతి పొందునిమిత్తం సూర్యాస్తమయం వరకు ఆగుట; క్రిందికి దించుట; శుభ్రపరచుట; బోళము పూయుట; నార బట్టలు చుట్టుటకు రాత్రి సమయమంతా వారికి పట్టెను. వారు ఆ పనిని సబ్బాతు ప్రారంభ సమయానికి (వెలుగు కలుగునప్పటికి) గాని పూర్తిచేయలేదు. (eLaineVornholt and L. L. Vornholt-Jones, ది గ్రేట్ కేలండర్ కాంట్రవర్సీ, p. 40.)
యహువః వెలుగును సృజించిన తరువాత చేసిన మొదటి పని వెలుగునుండి చీకటిని వేరుచేయుట. తరువాత ఆ రెండు భాగాలకు పేర్లు పెట్టెను. మొదటి భాగమైన వెలుగునకు day/దినము (తెలుగులో పగలు అని వ్రాసారు) అనియు, రెండవ భాగమైన చీకటికి night/రాత్రనియు పేర్లు పెట్టెను. లేఖనాల యొక్క సూత్రము ఏమిటంటే, ఎలోహీం జతపరచిన దానిని మనుష్యుడు వేరుచేయరాదు (మార్కు 10:9). అదే విధంగా ఎలోహీం వేరుచేసిన దానిని మనుష్యుడు జతపరచరాదు. అర్ధరాత్రి లేక సాయంకాలం నుండి దినము ప్రారంభమవునని చెప్పువారు సృష్టికర్త వేరుచేసిన దానిని కలుపుతున్నారు.
కాలములను, ధర్మములను మార్చివేయుట ద్వారా లూసిఫర్ అతిశయిస్తున్నాడు. ఆరాధనా “దినము” ను, ఆదినమును కనుగొనుటకు ఉపయోగించు కేలండరును, చివరికి దిన ప్రారంభమును కూడా మార్చివేయుట ద్వారా అతడు సృష్టికర్తకు మాత్రమే చెందవలసిన ఆరాధనను దొంగిలించాడు. (దానియేలు 7:25, KJV)
తప్పునుండి మరియు సాంప్రదాయము నుండి విడుదల పొందండి. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ నిజమైన సబ్బాతును పునరుద్ధరిస్తున్న సత్యాన్వేషులతో మీరును భాగస్తులు కండి.
“నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ద పరచు యహువఃను నేనే అని తెలిసికొనునట్లు, అది తరతరములకు నాకును మీకును గురుతగును.” (నిర్గమకాండము 31:13, KJV)