ఆశ్చర్యకరమైన సంఖ్యలో క్రైస్తవులు వారి ఆధ్యాత్మిక జీవితంలో రహస్య పరిణామవాదులు. |
నీవు సృష్టివాదినా? లేక పరిణామవాదినా?
ఇది న్యాయమైన ప్రశ్న. బైబిలును నమ్ముతున్నానని చెప్పుకుంటూ పరిణామ క్రమానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని కూడా నమ్మే క్రైస్తవులు ఉన్నారు.
కానీ సృష్టి మరియు పరిణామం రెండూ భూమిపై జీవము పుట్టుకకు సంబంధించిన సిద్ధాంతాల కంటే ఎక్కువ. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసిన విమోచన మరియు పవిత్రీకరణ గురించిన సత్యాలను కూడా అవి వెల్లడిస్తాయి.
విశ్వం యొక్క మూలాలు
సృష్టివాదం అనగా, విశ్వం మరియు దానిలోని సమస్తము శూన్యం నుండి యః మాట ద్వారా సృష్టించబడెను అనే నమ్మకము.
పరిణామం అనేది దీనికి పూర్తిగా వ్యతిరేకం. వేల సంవత్సరాలుగా జరిగిన ప్రగతిశీల అభివృద్ధి ద్వారా భూమిపై జీవితం ఉనికిలోకి వచ్చిందని పరిణామక్రమ సిద్ధాంతం చెబుతుంది. ఇది గ్రంథానికి విరుద్ధం:
యహువః వాక్కు చేత ఆకాశములు కలిగెను;
ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను;
ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. (కీర్తనల గ్రంథము 33:6 మరియు 9 చూడండి.)
ఇది గ్రహించవలసిన ఒక ముఖ్యమైన వాస్తవం ఎందుకంటే ప్రపంచం ఎలా ఉనికిలోకి వచ్చెనో మీరు అర్థం చేసుకుంటే, విమోచన మరియు పవిత్రీకరణ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది.
చూసినది చూడని దానిని వెల్లడిచేయును
లోతైన, ఆధ్యాత్మిక పాఠాలను వెల్లడించడానికి యహువః భూమిని రూపొందించారు. పౌలు దీనిని అర్థం చేసుకున్నాడు: ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. (రోమీయులకు 1:20 చూడండి.)
యః యొక్క మాట ద్వారా శూన్యం నుండి ప్రపంచం ఎలా సృష్టించబడెనో, అలాగే, సృష్టికర్త వాక్యం ద్వారా పాపి హృదయం కూడా పునః-సృష్టించబడెను.
గ్రంథంలోని అత్యంత శక్తివంతమైన, విశ్వాస స్పూర్తినిచ్చే సత్యాలలో ఒక దాని వద్ద పరిణామక్రమం కొట్టివేయబడుతుంది, మరియు అది: యః ఏమి పలికెనో అది జరిగెను. తక్షణమే.
యెషయా 55 ఈ ముఖ్యమైన వాస్తవాన్ని, ఎండిన బంజరు భూమిని గొప్ప ఉత్పాదక వ్యవసాయ భూములుగా మార్చే క్రియాశీల కారకంగా వర్షం ఎలా పనిచేస్తుందో అనే ఉదాహరణను ఉపయోగించి వివరించుచుండెను.
వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి
అక్కడికి ఏలాగు మరలక
భూమిని తడిపి
విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును
కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో
ఆలాగే నా నోటనుండి
వచ్చు వచనమును ఉండును
నిష్ఫలముగా నాయొద్దకు మరలక
అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును
నేను పంపిన కార్యమును సఫలముచేయును. (యెషయా గ్రంథము 55:10-11)
యహువః మాటకు తాను సెలవిచ్చు దానిని నెరవేర్చగల శక్తి ఉంది.
తక్షణం? లేక క్రమంగా?
మానవ హృదయం యొక్క పునః-సృష్టి, ప్రపంచ సృష్టి వలె, పూర్తిగా యః యొక్క శక్తి ద్వారా జరుగును. యః యొక్క సృష్టి శక్తిని లేఖనం వివరిస్తుంది: ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. (కీర్తనల గ్రంథము 33:9, KJV)
సృష్టిలో, యః మాటలకు ఫలితాలు ఎప్పుడు కనిపించాయి? ఆయన వెలుగును కోరినప్పుడు, ఆయన వెలుగు కలుగునుగాక అని పలికెను, అయితే ఆ వెలుగు ఎప్పుడు కనిపించెను? ఐదు నిమిషాల తరువాత? ఒక గంట తరువాత? లేక ఆయన మాట మాట్లాడిన తక్షణమే కాంతి కనిపించిందా?
"వెలుగు కలుగునుగాక" అని యహువః చెప్పుటకు మరియు వెలుగు వాస్తవానికి కనిపించుటకు మధ్య కనీసం ఒక సెకను కాలం ఉందని మీరు తలంచినా, అప్పుడు మీరు ఒక పరిణామవాది, అనగా మీరు ఇప్పుడున్న ప్రపంచం యొక్క సృష్టి ఒక ప్రక్రియ ద్వారా వచ్చిందని నమ్మువారు.
ఇప్పుడు ఈ సూత్రాన్ని మీ ఆధ్యాత్మిక జీవితపు విమోచనా కార్యానికి వర్తింపజేయండి.
- విశ్వాసం ద్వారా విమోచన అనేది మీ క్రైస్తవ జీవితపు నడకతో ప్రారంభమవునని, అయితే, అది మీ దినదిన భక్తి ద్వారా మాత్రమే సంపూర్ణమవునని మీరు విశ్వసిస్తున్నట్లయితే …
- మీరు విమోచించబడిన పిమ్మట, యః యొక్క శక్తి మరియు మీ సొంత శ్రద్ధగల ప్రయత్నం సహాయంతో ప్రలోభాలను జయించుట ద్వారా మీ విమోచనా స్థితి కొనసాగించబడునని మీరు విశ్వసిస్తున్నట్లయితే…
- విమోచనా స్థితిని కాపాడుకొనుటకు, చేయదగిన మరియు చేయకూడని నిర్దిష్ట పనుల యొక్క సుదీర్ఘ జాబితాకు కట్టుబడి ఉండాలని మీరు విశ్వసిస్తున్నట్లయితే …
… అప్పుడు, సహోదరి సహోదరులారా, మీరు పరిణామవాదులు.
ఇది పూర్తయిన ఒప్పందం! ఇప్పుడు!
ఒక విశ్వాసి తనకు బదులుగా రక్షకుడు మరణించెనని విశ్వాసం ద్వారా అంగీకరించినప్పుడు, యహూషువః యొక్క పాపములేని జీవితం యొక్క యోగ్యతను యహువః తీసుకొని దానిని విశ్వాసికి అందజేస్తాడు. యః విశ్వాసిని నీతిమంతుడని ప్రకటిస్తాడు. తక్షణం ఆ విశ్వాసి ఎన్నడూ పాపము చేయనివానివలె యహువః ఎదుట నిలబడతాడు. ఇది విశ్వాసం ద్వారా విమోచన. యహూషువఃను మన ప్రత్యామ్నాయంగా కలిగి మనము ఇప్పుడు యహువః శాంతితో ఉన్నాము.
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యహూషువః మెస్సీయ ద్వారా ఎలోహీంతో సమాధానము కలిగియుందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, ఎలోహీం మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము. (రోమీయులకు 5:1-2.)
ఇప్పుడు, విమోచించబడిన తరువాత, మీరు యహువఃతో శాంతిని ఎప్పుడు కలిగి ఉంటారు?
మీరు ధూమపానం మానేసినప్పుడు?
మీరు బూతు చిత్రాలు చూడటం మానేసినప్పుడు?
మీరు మీ కోపాన్ని విడిచిపెట్టినప్పుడు?
కొన్ని రహస్య పాపాలకు సంబంధించిన ప్రలోభాలను మీరు విజయవంతంగా ఎదిరించినప్పుడు?
కాదు! యః యొక్క మాట ప్రకారం-తాను సెలవిచ్చినదానిని చేయగల శక్తిని కలిగియున్న వాక్యం ప్రకారం-మీరు ఇప్పుడు యఃహువఃతో శాంతి కలిగియున్నారు.
నీతిమంతునిగా ప్రకటించబడెను
యహువః మిమ్మల్ని విమోచించినప్పుడు, (నీతిమంతుడని ప్రకటించినప్పుడు), ఆ క్షణంలోనే, ఆయన కుమారునిలో పరిపూర్ణమైనవారిగా, ఆయన మిమ్మును అంగీకరిస్తాడు. నీతిమంతులుగా ప్రకటించబడటానికి మీరు పవిత్రమయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. విమోచన అనేది కృప యొక్క బహుమానము మరియు ఇది పవిత్రీకరణ ప్రక్రియను ప్రారంభిస్తుంది.
యహూషువః ఎక్కడికి వెళ్ళినా ఈ సత్యాన్ని బోధించాడు: ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యహూషువః వారి విశ్వాసము చూచి కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.” (మత్తయి 9: 2 చూడండి.) గమనించండి: “ఉన్నవి” అనేది ప్రస్తుత (Present tense) క్రియ! యహూషువః ఆ వ్యక్తికి చెబుతున్నాడు, "ఈ క్షణంలోనే నీ పాపములు క్షమించబడి ఉన్నవి!"
వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో యహూషువః ఇలా చెప్పారు: అందుకు యహూషువః నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుము. (యోహాను 8:11). మరియు లోబడే శక్తి ఆ ప్రేమపూర్వక ఆజ్ఞలో ఉంది.
యహువః వద్ద శాంతితో
యోహాను 1:12 ఏమి వెల్లడిస్తుందంటే, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, ఎలోహీం పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది పవిత్రీకరణ! మరియు పాపిని నీతిమంతునిగా ప్రకటించిన క్షణం ఇది ప్రారంభమవుతుంది.
నీవు భవిష్యత్తులో పాపానికి దూరంగా ఉండటం ద్వారా నీవు ఎంత క్షమాపణ పొందితివో అనేది నిరూపించబడిన తర్వాత నీవు విమోచింపబడుదువని నమ్ముతున్న, ఒక పరిణామవాదివా?
లేదా నీవు యః యొక్క విమోచన మరియు పవిత్రీకరణ బహుమానమును ఈ క్షణమే అంగీకరించడానికి సిద్ధంగా మరియు ఇష్టంగా ఉన్న సృష్టివాదివా?
విమోచన మరియు క్షమాపణ సంపాదించుకొనుటకు మిమ్మల్ని మీరు పవిత్రంగా చేసుకోగలిగేదానికన్నా చేయుటకు మరి ఏమీ లేదు, అయితే ఇది ఇప్పుడే అందుబాటులో ఉంది. మీరు పరిశుద్ధపరచబడుటకు, విమోచించబడుటకు మరియు యః యొక్క బిడ్డగా మారే శక్తిని పొందుటకు ముందు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇది మీకు, ఈ క్షణం, ఇప్పుడే అందుబాటులో ఉంది.
మనము ఎలోహీం పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము ఎలోహీం పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.
ప్రియులారా, యిప్పుడు మనము ఎలోహీం పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. (1 మొదటి యోహాను 3:1-2)