విశ్వాసం ద్వారా విమోచించబడుటలో గల బహుమానాలను గూర్చి నేర్చుకొనుడి.
విశ్వాసం ద్వారా విమోచించబడుట అనేది నిరంతరమైన బహుమానమై ఉన్నది. ఇది శాశ్వతమైన, ఎన్నటికీ అంతంకాని క్రీస్తు యొక్క సొంత నీతి యొక్క నిరంతర విరాళమై ఉన్నది, అది దానిలో ఇతర బహుమానాలను కలిగియుంటుంది. |
విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుట సువార్త యొక్క మూలమై ఉన్నది. యహువః పాపులను ఎంతో ప్రేమిస్తాడు, ఆయన విశ్వాసం ద్వారా అంగీకరించే వాళ్ల జీవితాలలో యహూషువః యొక్క నీతిని గూర్చిన గొప్పతనాన్ని వర్తింపజేస్తాడు. మనము తగినంత అర్హులము కానప్పటికీ, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చు ప్రక్రియ పాపిని దైవీక రూపానికి రూపాంతరం చెందించు మరిన్ని బహుమానాలను తీసుకువస్తుంది.
అయినను ఎలోహీం కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు. యహూషువః మెస్సీయ నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము, యహూషువః మెస్సీయ నందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, ఎలోహీం వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. (ఎఫెసీయులకు 2:4 - 9)
విమోచన ప్రణాళిక అనేది మన గత కాలపు పాపాల క్షమాపణ కంటే చాలా ఎక్కువ విషయాన్ని కలిగియుంటుంది. పరిపూర్ణ పునరుద్ధరణ లేకుండా కలిగించు విముక్తి, పూర్తి మోక్షం కాదు. అందువల్ల, యహువః కూడా విశ్వాసులకు ఇంకా ఎక్కువ బహుమానాలను ఇస్తాడు. దైవ కృప యొక్క ఈ బహుమానాలు దైవీక రూపాన్ని ప్రతిబింబించునట్లు ఆత్మను సంపూర్ణంగా పునరుద్ధరించును. ఇది నీతిమంతులుగా తీర్చుటలోని యహువః బహుమానం యొక్క గొప్పతనమై ఉన్నది.
విమోచించుట
యహూషువః చిందించిన రక్తం తన పాపాలను కప్పిపుచ్చును అనే వాగ్దానమును పశ్చాత్తాపపడు పాపి యొక్క విశ్వాసం గ్రహించినప్పుడు, అతడు విమోచించబడుతాడు. ఆ సందర్భంలో, యహువః యహూషువః యొక్క పాపము లేని జీవితం మరియు విమోచన మరణం యొక్క సమస్త ఔన్నత్యాన్ని పశ్చాత్తాపపడు విశ్వాసుల యొక్క లెక్కలోనికి జమ చేస్తాడు. ఇది ఒక బహుమానము. ఇది మంచి క్రియల ద్వారా గాని, స్వీయ-తిరస్కరణ లేదా పశ్చాత్తాపంతో గాని సంపాదించబడదు.1 ఇది ఒక బహుమానము.
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా ఎలోహీం నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
అది యహూషువః మెస్సీయ నందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు ఎలోహీం నీతియైయున్నది.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి ఎలోహీం అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, యహూషువః మెస్సీయనందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
పూర్వము చేయబడిన పాపములను ఎలోహీం తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని యహూషువః మెస్సీయ రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను.
ఎలోహీం ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యహూషువఃనందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. (రోమీయులకు 3:20 - 26)
క్రీస్తు యొక్క నీతిని ఇతర ఏదో ఒకవిధంగా సంపాదించుట అసాధ్యం. మానవుని యొక్క ఏవేని ప్రయత్నాలు లేదా క్రియల ద్వారా రక్షణను సాధించలేము. విశ్వాసం ద్వారా మాత్రమే ఎవరైనా విమోచన పొందగలరు, ఎన్నడూ పాపము చేయనివారిగా యహువః ముందు నిలబడగలరు. విమోచన అనేది ఏదో ఒక్కసారి ఇచ్చు బహుమానం కాదు కూడా. ఇది యహూషువః నీతి యొక్క శాశ్వతమైన విరాళమై ఉన్నది, ఇది యహూషువః యొక్క స్వచ్ఛమైన, పవిత్ర జీవిత, మరియు మరణ త్యాగముతో మన అపరిశుద్ధతను కప్పివేయును.
పరిశుద్ధపరుచుట
ఒక వ్యక్తి విమోచనా బహుమానాన్ని స్వీకరించుటను ఎన్నుకున్నప్పుడు, పరలోక ఆశీర్వాదాల యొక్క తూములు తెరవబడతాయి మరియు ఇంకా ఎక్కువ బహుమానాలు కురిపించబడతాయి. ఈ బహుమాలలో ఒకటి పరిశుద్ధపరచబడుట, లేదా దైవీక రూపంలోనికి రూపాంతరం చెందుట.
యెహెజ్కేలు ఈ విధానాన్ని ఇలా వివరిస్తాడు:
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. (యెహెజ్కేలు 36:25 - 27)
దైవిక ధర్మము అనేది ప్రేమకు సంబంధించిన ధర్మము. యహువః ప్రతి నీతిమంతుడైన విశ్వాసికి ఒక నూతన హృదయం అనే అమూల్యమైన బహుమానమును ఇచ్చును, దానిమీద ఆ ప్రేమ యొక్క ధర్మము లిఖించబడి యుండును. ఈ బహుమానముతో, మీ రహస్య కోరికలు, మీ రహస్యమైన, లోపలి హృదయం శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మీరు పవిత్రతలో ఆనందమును పాపము యెడల ద్వేషమును కనుగొందురు.
ఇది మహిమ పొందుటకు ముందు ఏ సమయంలో అయినా ఎవరైనా పరిపూర్ణతను పొందగలుగుతారని అర్థంకాదు. మనము ఇప్పటికీ మన పడిపోయిన మానవ స్వభావమును మరియు ఇప్పటికీ మానవ శరీరం యొక్క తప్పిదాలను మరియు బలహీనతలను కలిగి ఉంటాము. అయితే, తేడా ఏమిటంటే, తండ్రితో ఏకమై ఉండుట హృదయం యొక్క లోతైన కోరికగా ఉంటుంది.
నిజానికి, ఇది గెత్సెమనేలో ప్రవేశించే ముందు యహూషువః యొక్క చివరి ప్రార్థనై ఉన్నది: మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. (యోహాను 17: 20,21)
కొత్త హృదయం యొక్క బహుమానము రక్షకుని ప్రార్ధనకు యహువః యొక్క సమాధానమై ఉన్నది.
మహిమపరుచుట
మహిమపరుచుట అనేది ప్రణాళికలోని తుది (పట్టాభిషేక) మెరుగుగా ఉన్నది.
విమోచనా వరము పాపులకు యహూషువః రక్తము యొక్క గొప్పతనమును వర్తింపజేస్తుంది మరియు ఎప్పుడూ పాపము చేయకుండా ఉండునట్లు యహువః ముందు నిలబెడుతుంది.
పరిశుద్ధీకరణ అనేది ఒక నూతన హృదయం యొక్క బహుమానం, ఇది వ్యక్తికి పాపం యెడల ద్వేషాన్ని పుట్టిస్తుంది.
మహిమపరుచుట అనేది పడిపోయిన మానవ స్వభావాన్ని తొలగిస్తుంది, మరియు శరీరమును మరియు ఆత్మను పూర్తిగా దైవ రూపంలోనికి మారుస్తుంది.
మహిమపరుచుట అనేది వినయముగల ఒక విశ్వాసిని సంపూర్ణంగా దైవ రూపంలోనికి మార్చగల బహుమానముగా ఉన్నది: “మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి అదోనాయ్ అయిన యహూషువః మెస్సీయ అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. (ఫిలిప్పీయులకు 3:20,21)
మనకు ఈ బహుమానం ఇవ్వబడినప్పుడు ఏమి జరుగును అనేదానిని పౌలు గారు వివరించారు:
మరియు మనము మట్టినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు ఎలోహీం రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. 1(మొదటి కొరింథీయులకు 15:49 - 53)
విమోచనా క్రమములో పరిశుద్ధులకు ఒక క్రొత్త హృదయం ఇవ్వబడింది. ఇప్పుడు, ఈ బహుమానపు నూతన ఆత్మీయ శరీరములు, ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఎన్నటికీ మరణించవు. పరిశుద్ధులు దైవిక రూపమును పూర్తిగా ప్రతిబింబిస్తారు. వారు యహువఃకు కుమారులు, కుమార్తెలు, మరియు ఆయనతో నిరంతరము జీవించుదురు.
రక్షణ ఒక బహుమానమై ఉన్నది! కావున విమోచన, పరిశుద్ధీకరణ, మరియు మహిమపరచబడుట కూడా బహుమానాలే. యహువః ఇచ్చు ప్రేమ బహుమానమును నేడు అంగీకరించండి! మీరు దానిని సంపాదించుటకు ఏమీ చేయలేరు. విశ్వాసము ద్వారా కృతజ్ఞతతో దీనిని అంగీకరించాలి. మీరు ఇలా చేస్తే, యహువః స్వయంగా మిమ్మును సిద్ధం చేయును.
ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు ఎలోహీమే. (ఫిలిప్పీయులకు 2:13)
1 పశ్చాత్తాపం కూడా ఒక బహుమానమే. మీరు పూర్తిగా ఎలోహీంకి లోబడుటను ఇష్టపడలేకపోవుచున్నచో, పూర్తిగా లోబడేలా చేయాలని మీరు ఆయనను అడగవచ్చు. మిమ్మల్ని ఇష్టపడేలా చేయునట్లు, ఒప్పుకొనునట్లు, లోబరుచునట్లు కూడా అడగవచ్చు. మీకు మోక్షానికి ఏది అవసరమో, యహువః దానిని అందించుటకు ప్రతిజ్ఞ చేశారు.