కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
పిలిప్పీయులకు 4: 19. (రిస్టోర్డ్ నేమ్స్ స్క్రిప్చర్)
జార్జ్ ముల్లర్ విశ్వాసాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. అతను ఒకసారి ఇలా అన్నాడు, "ప్రార్థన మరియు విశ్వాసం ద్వారా ఎంత సాధించవచ్చో ఉదాహరణ చూపుటకు నా జీవితమంతా ఆనందంగా అంకితం చేశాను." ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ వీధుల్లో నివసిస్తున్న నిరాశ్రయులైన పిల్లలను చూసుకొనుటకు అనాథాశ్రమాలను నిర్మించు ఆలోచనను యహువః తన హృదయంలో ప్రేపించెను. తన జేబులో కేవలం రెండు షిల్లింగ్స్ (50 సెంట్లు) తో, జార్జ్ ముల్లర్ దానిని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు ఎక్కడినుండి రాబోతుందో అతనికి తెలియదు, అయితే అది అతని సమస్య కాదు. యహువః సంకల్పం అతనికి తెలుసు. మార్గం చూపించుట యహువః యొక్క భాగం. దానిని ఆచరణలో పెట్టటం అతని భాగం.
జార్జ్ ముల్లర్ (1805-1898), నిజమైన విశ్వాస యోధుడు, యః యొక్క వాగ్దానాన్ని వస్తువు చేతిలో ఉన్నంత వాస్తవమని నమ్మాడు, అది అల్మరాలో ఆహారం అయినా లేదా అతని సంచిలోని డబ్బు అయినా. |
ముల్లర్ తన దైవిక ఎలోహిమ్ నందు ప్రతిదీ విశ్వసించాడు. అతడు తన అవసరతలను ఎవరికీ చెప్పకూడదని ప్రారంభంలోనే అభ్యాసం చేసాడు - మరియు అతనికి చాలా అససరాలు ఉండేవి. అతడు తన పరలోక తండ్రికి మాత్రమే చెప్పేవాడు. ఈ వినయపూర్వకమైన విశ్వాసం గల వ్యక్తి ద్వారా, యహువః ఐదు గొప్పవైన, గ్రానైట్ భవనాలను నిర్మించాడు, అవి 2,000 మంది అనాథలను ఉంచగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఒక రోజు, పిల్లల తదుపరి భోజనానికి ముల్లర్ దగ్గర ఆహారం గాని డబ్బు గాని లేవు. అతడు ప్రార్థనలో మోకరిల్లి, తన అవసరాన్ని తన పరలోకపు తండ్రి ముందు ఉంచాడు, విశ్వాసం ద్వారా వాగ్దానం నెరవేరుతూ, ఎవరో డబ్బు బహుమతితో తలుపు తట్టారు. తన వాగ్దానాలను ఆయన ఎప్పుడూ నిలబెట్టుకొనునని యహువః మరోసారి నిరూపించాడు. పిల్లలు తమ తదుపరి భోజనాన్ని సమయానికి తిన్నారు.
సంవత్సరాలు తరబడి, అతని గొప్ప పనికి మద్దతుగా మిలియన్ డాలర్లకు సమానమైన ధనం అతనికి ఇవ్వబడింది - అన్నీ అతని అవసరాలను ఒక్క ఆత్మకు కూడా చెప్పకుండానే జరిగెను, వీటిలో చాలా వరకు అత్యవసరమైనవి ఉండెను. ముల్లర్ తన జీవితాన్ని యహువః యొక్క మంచితనాన్ని మరియు శక్తిని వెల్లడించడానికి అంకితం చేసాడు, ఆయన మాటను అనుసరించి, నిబంధనను నిలబెట్టుకొనే ఎలోహిమ్ యొక్క వాగ్దానాలపై నమ్మకం ఉంచే వారందరి తరపున అతడు పని చేసేవాడు. బలమైన విశ్వాసం కలిగి ఉండాలని కోరుకునే ఎవరికైనా విశ్వాస సంబంధమైన పరీక్షలు తప్పనిసరి అని ఆయన గుర్తించారు.
"బలమైన విశ్వాసాన్ని నేర్చుకొనుట గొప్ప పరీక్షలను భరించుటను" ముల్లెర్ గమనించాడు. "తీవ్రమైన పరీక్షల మధ్య గట్టిగా నిలబడటం ద్వారా నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను."
విశ్వాసం ఒక మొక్క అని చెప్పబడుతుంది, దానిని పోషించిన యెడల అది త్వరగా పెరుగుతుంది మరియు ముల్లెర్ యొక్క విశ్వాసం ఈ ప్రకటన యొక్క సత్యాన్ని రుజువు చేసింది. ఏ సమయంలోనైనా, అతడు ఎదుర్కొంటున్న అత్యవసర పరిస్థితులతో సంబంధం లేకుండా, ముల్లర్ యహువఃను విశ్వసించుటను ఎంచుకున్నాడు. అతడు ఇలా అన్నాడు, "మీరు ఆయనతో నడిచి ఆయన వైపు చూచి, ఆయన నుండి సహాయం ఆశించినట్లయితే, ఆయన మిమ్మల్ని ఎప్పటికీ విఫలం కానీయడు." ముల్లర్ యొక్క విశ్వాసం పరిస్థితులతో సంబంధం లేకుండా విశ్వసించుటకు ఎంచుకున్న అతని అనుభవం యొక్క ఫలితం. "ప్రభువు నన్ను విఫలం చేస్తే, అది మొదటిసారి అవుతుంది" అని అతను చెప్పాడు.
ఒక చిన్న ఇశ్రాయేలీయురాలైన అమ్మాయి అపహరణ చేయబడి బానిసగా అమ్మబడుటను యహువః నిరోధించలేదు, కాని ఆయన ఆమె యొక్క జీవితాన్ని ప్రధానుడైన నామాను ద్వారా దేశం మొత్తానికి సాక్ష్యమిచ్చాడు. (డారెల్ ట్యాంక్ అనుమతితో వాడబడెను, darreltank.com) |
గ్రంథం యహువః తనకు లోబడియున్న ఉన్న పిల్లలతో పనిచేయుటను తెలియజేసే ఇలాంటి అనేక కథలతో నిండి ఉన్నది. బైబిల్ లో నమోదు చేయబడిన ప్రతి కథకు ప్రధాన కారణం విశ్వాసుల హృదయాలలో విశ్వాసాన్ని ప్రేరేపించుటయే. ఎర్ర సముద్రం వద్ద అద్భుత విడుదల మొదలుకొని తన ఋణాలన్ని తీర్చువరకు నూనె రెట్టింపు అయిన విధవరాలు యొక్క కథ వరకు, గడిచిన యుగాల చరిత్ర యొక్క ఈ సంఘటనలన్నియు విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ప్రేరేపించడానికి ఉద్దేశించబడియున్నవి. గడిచిన యుగాలలో ఆయనపై విశ్వాసం కలిగి ఉన్న తన ప్రజల కోసం గొప్పగా పనిచేసినవాడు, నేడు కూడా అదే విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
యః యొక్క నిజమైన ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కొనెను. దానియేలు బందీగా పట్టుబడి యూదా శత్రువుల ఆస్థానంలో నపుంసకుడు అయ్యాడు. యోసేపు అన్యాయంగా చెరసాల పాలయ్యాడు. యోబు తన పిల్లలను, తన సంపదను, ప్రతిష్టను కోల్పోయాడు. ఎస్తేరు తన కుటుంబం నుండి తీసుకొనబడి, ఆమె కంటే చాలా సంవత్సరాలు పెద్దవాడైన అన్యమత రాజుకి భార్యగా చేయబడెను!
చెడు విషయాలు జరగకుండా యహువః ఆపడు. “విశ్వాసుల యొక్క గొప్పతనాన్ని” తెలియజేసిన ప్రఖ్యాత హెబ్రీయులు 11 అధ్యాయం, అధిగమించలేని ఇబ్బందులను మరియు పరీక్షలను ఎదుర్కొని, విజయం సాధించిన విశ్వాసులకోసం ఉదాహరించెను - వారి తమ సొంత బలంతో కాక, యహువః వాగ్దానాలపై ఆధారపడటం ద్వారా విజయం సాధించారు. వీరు విశ్వాస వీరులు.
వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి; అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,గొఱ్ఱెచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు . . . . . ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున, మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యహూషువః వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయులు 11: 33-12: 2 1)
ప్రతి వ్యక్తికి కావలసిన గొప్ప అవసరసరత దైవిక వాగ్దానాలపై విశ్వాసం అని బైబిల్ కథలు బోధిస్తాయి. ఎదురయ్యే పరీక్షలు మరియు ఇబ్బందులు విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని బోధించుటలోని పరలోకం యొక్క బోధలు. ఈపరీక్షలలో గల ప్రతి అవసరాన్ని తీర్చుటకు యహువః శక్తి సరిపోతుంది. ఆ శక్తి ప్రతి అత్యవసర పరిస్థితిని పరిష్కరించగలిగినంత గొప్పది. ఒక వ్యక్తి విశ్వాసం కలిగి ఉండెనో లేదో అనేది మాత్రమే ఇక్కడ పరిమితి, ఎందుకంటే "నమ్మువానికి సమస్తమును సాధ్యమే". (మార్కు 9:23) అయితే "విశ్వాసములేకుండ ఎలోహీంకి ఇష్టుడైయుండుట అసాధ్యము; ఎలోహీం యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (హెబ్రీయులు 11: 6)
భూమి చరిత్ర యొక్క ఈ చివరి దినాలలో, విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలపరచుటకు ఈ బైబిల్ కథలు ఇవ్వబడ్డాయి. పురాతన క్యాలెండర్ ద్వారా లెక్కించిన ఏడవ రోజు సబ్బాతు యొక్క జనాదరణ లేని సత్యంతో యః ప్రజలు ప్రపంచమంతటి ముందు నిలబడాలి. నాల్గవ ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యతను గ్రహించి పాటించుటకు లోబడువారందరికీ ఒక నిర్దిష్ట రోజున ఆరాధించడం ముఖ్యం అయితే, ఆ రోజును లెక్కించడానికి ఉపయోగించే క్యాలెండర్ కూడా (సమయ-కొలత) సరైన పద్ధతి అయి వుండాలి అని వారు గ్రహించాలి.
నిరంతర వారముల చక్రం ఉన్న సౌర క్యాలెండర్‌ను ఉపయోగించడంలో ప్రపంచమంతా ఐక్యంగా ఉన్నందున, మరొక క్యాలెండర్ ద్వారా ఆరాధించాలనే నిర్ణయం ఒకనికి వెను వెంటనే ఇంతకు ముందు చూడని సమస్యలను ఉత్పత్తి చేస్తుంది. నిజమైన బైబిల్ సబ్బాతు రోజున ఆరాధించాలనుకొనే చాలా మందికి ప్రధాన భయం ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉండుట. ఇది అప్పుల్లో ఉన్నవారికి మరికొన్ని ఇతర ఇబ్బందులకు దారితీస్తుంది: నా కారు వాయిదా నేను ఎలా చెల్లించాలి? నేను నా ఇంటిని కోల్పోతానా? నా విద్యార్థి రుణాల సంగతేంటి? నాకు చాలా ఉన్నాయి!
ఇవన్నీ చాలా నిజమైన ఆందోళనలు. యః ప్రజలు చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ఎవరికైనా గొప్ప అవసరం విశ్వాసం యొక్క ఆవశ్యకత. ఆకాశం పడిపోయినప్పటికీ, కదిలించబడని విశ్వాసం. యహూషువః తన అనుచరులకు పదేపదే ఉపదేశించిన ఒక విషయం ఏమిటంటే, వారిలో విశ్వాసం లేకపోవుట గూర్చి: “అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారు?” (మత్తయి 8:26). ”అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివి? (మత్తయి 14:31). “మీ విశ్వాసం ఎక్కడ?” (లూకా 8:25)
దీనికి వేరుగా, విశ్వాసాన్ని కనుగొన్న చోట మాత్రం ఆయన వెంటనే దానిని ఆజ్ఞాపించెను. “కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను” (మత్తయి 9:22). “అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను” (మత్తయి 15:28) “వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను” (మార్కు 10:52). యహువః ఒక వ్యక్తి కోసం పని చేయడానికి ఎంత సిద్దంగా ఉండెననే విషయం నేరుగా ఆ వ్యక్తి సాధనచేయుచున్న విశ్వాసానికి సమానంగా ఉంటుందని బోధించాలనుకొనెను.
"విశ్వాసం" అనేది మతపరమైన వర్గాలలో తరచుగా వినియోగించబడుతున్న పదాలలో ఒకటి, అయినప్పటికీ అది ఏమిటనేది చాలా అరుదుగా అర్థం చేసుకోబడుతుంది. విశ్వాసం అనుభూతి కాదు. మంచి భావోద్వేగాలతో నిండినట్లు అనిపిస్తే తప్ప వారి ప్రార్థనలు వినబడవని ప్రజలు సందేహిస్తారు కాని అది విశ్వాసం కాదు. మీకు భయం అనిపించినప్పుడు, అది శాంతి కాదు; మీకు దుఃఖం వచ్చినప్పుడు, ఆనందం కాదు; మీరు బలహీనంగా ఉన్నప్పుడు, బలంగా లేరు; విశ్వాసాన్ని సాధన చేయుట మీ కర్తవ్యం.
నిజమైన విశ్వాసం “నమ్మిక; మరొకరు ప్రకటించిన సత్యానికి మనస్సు యొక్క అంగీకారం [ఒప్పందం], ఇతర ఆధాం లేకపోయినా, అతని అధికారం మరియు నిజాయితీపై ఆనుకొనుట; మరొకరు చెప్పే లేదా సాక్ష్యమిచ్చే తీర్పుయే సత్యం.” 2 విశ్వాసం కేవలం యహువః మాటను తీసుకుంటోంది, ఆయన చెప్పినదానిని నమ్ముటను ఎంచుకొంటుంది. అదనపు ఆధారాలు అవసరం లేకుండా, ఆయన ఎవరు (సర్వ ప్రేమమూర్తి); మరియు ఆయన ఏమిటి (సర్వ శక్తిమంతుడు) అనే దానిపై ఆధారపడి విశ్వసించును.
ఒక రోజు, రోమా శతాధిపతి తన సేవకుడిని స్వస్థపరచమని యహూషువఃను కోరాడు.
[యహూషువః] నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా,
ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
[యహూషువః] ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
అంతట [యహూషువః] ఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. (మత్తయి సువార్త 8:7-10, 13).
శతాధిపతి యహూషువః సహాయం కోరినప్పుడు, రక్షకుడు వెంటనే స్పందించాడు: “నేను వచ్చెదను.” శతాధిపతి ఆశ్చర్యపోయెను. ఒక ఇశ్రాయేలీయుడు తనలాంటి, అన్యజనుని, ఇంట్లో ఇష్టపూర్వకంగా అడుగు పెడతాడని అతడు ఊహించలేదు. అతడు త్వరగా సమాధానం చెప్పాడు, “ఓహ్, వద్దు. అది అవసరం లేదు. నీవు మాటమాత్రము సెలవిమ్ము, నా సేవకుడు బాగుపడును.”
“దానినే" యహూషువః "విశ్వాసం” అని అన్నారు.
"విశ్వాసం అనగా రుజువు లేకుండా నమ్ముట కాదు, నిలుపుదల/రిజర్వేషన్ లేకుండా నమ్మటం."
|
లేఖనం అనేది ఖచ్చితంగా విశ్వాన్ని ఉనికిలోకి పిలిచినప్పుడు యహువః పలికిన మాట. తాను చెప్పునది చేయగల శక్తి యహువః వాక్యానికి ఉందని మీరు విశ్వసించినప్పుడు, మరియు ఆయన చెప్పినదానిని ఆయన చేయునని విశ్వసించుటను మీరు ఎంచుకున్నప్పుడు, మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఆయన సబ్బాతు దినాన ఆరాధించుట ద్వారా తమ సృష్టికర్తను గౌరవించే వారందరూ ఇబ్బందులను ఎదుర్కొను సమయంలో యహువః ప్రజలకు అన్నింటికన్నా ఎక్కువ అవసరం ఇదే.
సుందరమైన విషయం ఏమిటంటే, విశ్వాసం అనేది యహువః ఇచ్చిన బహుమానం! ఒకవేళ వారు ఎక్కువ అడిగితే, వారు ఎక్కువ పొందుదురని నమ్మునట్లు ఆయన ప్రతి ఒక్కరికీ తగిన విశ్వాసాన్ని అనుగ్రహించును. అయితే, అది వృద్ధి చెందుటకు అనుగ్రహించును.
మీ జీవితంలో అది నిజం కావడానికి ముందే విశ్వాసం పరీక్షించబడాలి మరియు ప్రయత్నించబడాలి. “మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. . . . ” (రోమా 8:28). కాబట్టి ఏది ఏమైనా, [యహువః] దైవఘటన యొక్క పరివర్తనా శక్తి పరిపూర్ణ విశ్వాసాన్ని వాస్తవంగా మారుస్తుంది. విశ్వాసం ఎల్లప్పుడూ వ్యక్తిగత మార్గంలో పనిచేస్తుంది, ఎందుకంటే [యహువః] యొక్క ఉద్దేశ్యం తన పిల్లలలోగల పరిపూర్ణ విశ్వాసం వాస్తవంగా మారుటను చూడటం. 3
మీకు విశ్వాసం అవసరమని యహువఃకు తెలుసు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసుకొనుటలోని యః యొక్క సామర్థ్యంపై దృఢమైన విశ్వాసాన్ని పెంపొందించే ఏకైక మార్గం, ఏ మానవ ప్రయత్నాల ద్వారా పరిష్కరించబడని సమస్యలను కలుగియుండుట. విశ్వాసం సాధ్యరూపకమైన మార్గంలో పనిచేయకపోతే అది నిజంగా విశ్వాసం కాదు. మానవీయంగా సాధ్యమయ్యే దానిలో [యహువః] కీర్తి ఉండదు. మానవ శక్తి ఎక్కడ ముగుస్తుందో అక్కడ విశ్వాసం మొదలవుతుంది.” --జార్జ్ ముల్లర్. మీరు సబ్బాతు పాటిస్తే మీరు కోల్పోయే ఉద్యోగం, లేదా మీ ఉద్యోగం పోగొట్టుకుంటే మీ ఇల్లు లేదా కారును కోల్పోయే ఒక పరీక్ష: ఇలా సమస్య ఏదైనా మీరు పరిష్కరించగలిగేది అయితే, లేదా మీ పరిచయస్తులలో ఎవరైనా మీ కోసం పరిష్కరించగలిగేది అయితే, అది మీ విశ్వాసాన్ని వృద్ధిచేయలేదు.
"విశ్వాసం మానవీయంగా జయించగల సమస్యలలో క్రియచేయదు. మానవీయంగా సాధ్యమయ్యే దానిలో [యహువక] కీర్తి లేదు. మానవ శక్తి ఎక్కడ ముగుస్తుందో అక్కడ విశ్వాసం మొదలవుతుంది."
|
విధేయత ఫలితంగా మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా, యహువఃకు దాని గురించి అంతా తెలుసు. ప్రతి పరీక్ష మీలో పరలోకపు తండ్రిపై విశ్వాసాన్ని మరియు ఆధారపడటాన్ని అభివృద్ధి చేయడానికి “అనుకూలీకరించిన రూపకల్పన”, ఇది ముందుకు రాబోయే ప్రయత్న దినాలలో మీకు అవసరం. చక్కని ఇంటిని పోగొట్టుకొని దేశంలో ఒక సాధారణ గృహసముదాయము లేదా చిన్న రేకుల ఇంటిలో నివసించడం మంచిది, అప్పుడు చూపబడిన యహువః యొక్క చిత్తానికి విధేయత చూపుట మంచిది. కఠినమైన విధేయతతో జీవించే వారు మాత్రమే వాగ్దానాలను పొందగలరు.
ప్రతి అత్యవసర పరిస్థితిని అధిగమించుటకు మరియు ప్రతి అవసరాన్ని తీర్చుటకు యహువః వాగ్దానాలను అందించాడు. ఆయన వెల్లడించిన చిత్తానికి విధేయత చూపడంలో మీరు చేయగలిగినదంతా చేసినప్పుడు, ఇక మీ వంతు నమ్ముటను ఎంచుకొనుటయే ఎందుకంటే ఆయన మీ ఎలోహా అయిన యహువః మరియు ఆయన అబద్ధమాడనేరడు. మానవుడు అధిగమించుటకు కష్టమైన సమస్యలను కలిగి లేకుండా ఆయన దైవిక నడిపింపుపై మీ విశ్వాసం పెరగదు. మీరు ఎదుర్కొంటున్న పరీక్షలు మీలో విశ్వాసాన్ని పెంపొందించే అవకాశాన్ని కల్పించే ఉద్దేశ్యంతో కలుగుచున్నవి, తద్వారా అది వృద్ధి చెందుతుంది! , వ్యాయామం లేకుండా కండరాలు పెరగవు, అంతకంటే ఎక్కువగా పరీక్ష లేకుండా విశ్వాసం పెరగదు.
మన విశ్వాసం బలోపేతం కావాలని మనము కోరుకుంటే, మన విశ్వాసం పరీక్షించబడే అవకాశాల నుండి మనం తగ్గిపోకూడదు, కానీ, శ్రమల ద్వారా బలపడాలి.”
|
ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితి ప్రత్యేకమైనది కాబట్టి, ప్రతి వ్యక్తి పరిస్థితులకు వర్తించే ఒక సలహా లేదు. మీ ఇబ్బందులు మీ సామర్థ్యానికి మించి ఉండటానికి, లేదా అందుబాటులో ఉన్న వనరులకు మించి ఉండటానికి ఒక కారణం ఉంది. మానవుడు తాను కోరుకున్న సహాయాన్ని అందించాలని చేయాలని యహువః ఉద్దేశించలేదు. తన పిల్లలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు సమాధానాలు మరియు డబ్బును అందించడానికి ఏ వ్యక్తిని లేదా డబ్ల్యుఎల్‌సి వంటి ఏ సంస్థను యహువః అనుమతించదు. మీ సమస్యలు యః పై విశ్వాసం పెంపొందించుకొనుటలో మీకు సహాయపడుటకు రూపొందించబడ్డాయి, కానీ మీ స్నేహితుల జ్ఞానంపై లేదా ఇతర వనరులపై ఆధారపడుటకు కాదు.
మీరు ఎదుర్కొనే కష్టాలు మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్నవాటికంటే భయంకరంగా ఉండవచ్చు; ప్రమాదాలు, చాలా నిజమైనవి. వీటన్నిటిలో, మీ సురక్షితమైన మార్గం విధేయత మరియు విశ్వాసం. ప్రతి పరీక్షలోను యహువః కృప యొక్క ఉద్దేశ్యాలు మిమ్మల్ని ఆయనకు దగ్గర చేయడమే.
[యహువః] సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు. (విలాపవాక్యములు 3:31-33)
యః మీ ఋణాలన్నీ తుడిచిపెట్టగలడు. ఆయన మీ జేబులో ధనమును సృష్టించగలడు. కానీ అది విశ్వాసాన్ని పెంపొందించదు మరియు విశ్వాసం మీ యొక్క గొప్ప అవసరత. మానవ శక్తితో అధిగమించలేని సమస్య దైవిక నడిపింపు మరియు జోక్యం ద్వారా పరిష్కరించబడినప్పుడు మాత్రమే విశ్వాసం పెరుగుతుంది.
మనకు ఎదురయ్యే అత్యంత కష్టమైన సమస్యలలో, మనం మన అవివేక చర్యల ద్వారా మనపైకి తెచ్చుకున్నామని అనుకునేవి:
- మనము ఆ పెద్ద, ఖరీదైన ఇంటిని నిర్మించకుండా ఉండవలసింది.
- నేను ఆ రుణం తీసుకోకుండా ఉండవలసింది.
- మేము పాత కారును మరమ్మతు చేసి ఉండాల్సింది, క్రొత్తదాన్ని కొనుగోలు చేయకుండా ఉండాల్సింది.
- నేను పాఠశాల రుణాలను ఎక్కువగా ఎందుకు తీసుకున్నాను?
మీరు తిరిగి చెల్లించటానికి వాగ్దానం చేసి, కాగితాలపై సంతకం చేసినప్పుడు, మీరు మీ మాటను నెరవేర్చకపోతే, మీరు సృష్టికర్తను అగౌరవపరుస్తారు అనే ఆలోచన మీలో ఉంటుంది. మీరు మీ ఉద్యోగాలను కోల్పోయి, రుణాలను తిరిగి చెల్లించలేకపోతే, మీరు యహువః యొక్క ప్రేమపూర్వక నడిపింపుపై నమ్మకం కోల్పోకూడదు. “రక్షింపనేరక యుండునట్లు యహువః హస్తము కురుచకాలేదు; విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు.” (యెషయా 59:1). ఆయన నడిపింపుకు గల కారణాలను మనం అర్థం చేసుకోకపోయినా మనం ఇంకా అనుసరించాలి, విధేయులవ్వాలి.
మన పాత్రలను మెరుగుపరచడానికి మనకు అత్యంత అవసరమైనవి మన యొక్క అనేమైన అనుభవాలు. పరిస్థితులతో సంబంధం లేకుండా విశ్వాసపాత్రంగా, నమ్మకంగా ఉండిపోయిన యోబు లాంటి సాక్షి యహువఃకు అవసరమగుట కూడా మనం చూసాము. లోయల లోతుల ద్వారా మీరు నడిపించబడుట ఇతరుల ఆత్మల రక్షణ కోసం కూడా కావచ్చు.
యహువః సంకల్పం కాని ఇబ్బందులు మరియు చిక్కుల్లో మనంతట మనమే వెళ్లి చిక్కుకున్న పరిస్థితులలో కూడా, మనం తండ్రి వద్దకు వచ్చి కుమారుని పేరు మీద ప్రార్థన చేయవచ్చు, అది మనకు అనుసరించుటకు సురక్షితమైన ఒక మార్గాన్ని కనుగొనేలా జ్ఞానాన్ని ఇస్తుంది.
ఆయనను అడిగు వారందరికీ యహువః జ్ఞానాన్ని వాగ్దానం చేశాడు.
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు ఎలోహీంను అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక యహువః వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. (యాకోబు 1:5-8)
మన ప్రార్థనలకు మనం ఇష్టపడే విధంగా సమాధానం ఇవ్వడానికి యహువః చాలా సిద్దంగా ఉన్నారు. దివాలా తీసే పరిస్థితి, ఉద్యోగం కోల్పోవడం, ఇల్లు లేదా ప్రతిష్ట కూడా కోల్పోవడం ఇదంతా ఒక వ్యక్తిని అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకొని యహువఃపై పూర్తిగా ఆధారపడేలా చేస్తుంది. మీ అనుభవం ఇలాంటిదే అయితే, ఆయన మృదువైన ప్రేమగల తండ్రి అని తెలుసుకొని, విశ్వాసాన్ని మరియు విధేయతను కొనసాగించండి.
గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును;
తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి,
రొమ్మున ఆనించుకొని మోయును,
పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
(యెషయా గ్రంథము 40:11)
"విశ్వాసం అనేది [యహువః] గుణశీలతపై గల ఆలోచనపూర్వకమైన నమ్మిక, ఆయన మార్గాలు ఏక కాలంలో మీకు అర్థం కావు."
|
ప్రతి పరిస్థితిలోనూ యహువఃను విశ్వసించడం సురక్షితం, భవిష్యత్తును ఆయన చూడగలిగినంతగా చూడగలిగి మరియు ఆయన మన జీవితాల్లో చేస్తున్న అద్భుతమైన ప్రణాళికను చూడగలిగితే, మనం ఎన్నుకునే విధంగా మాత్రమే ఆయన ఎల్లప్పుడూ నడిపిస్తారని మనకు అర్ధమవుతుంది.
సర్వశక్తిమంతుని యొక్క శక్తి ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగలదు. అందువలన, విధేయతను నిరాకరిస్తతే ఎటువంటి క్షమాపణ ఉండదు - సత్యానికి విధేయత చూపుట వలన మీ ఉద్యోగం, మీ ఇల్లు, మీ కారు, మీ ప్రతిష్ట, మీ వివాహం లేదా మీ జీవితం కూడా పోయినప్పటికీ విధేయతను నిరాకరించరాదు.
మీరు శోధనలో ఉన్నారా? ఆయన విడిపించును. మీరు బలహీనంగా ఉన్నారా? ఆయన బలపరుచును. మీరు అజ్ఞానులుగా ఉన్నారా? ఆయన జ్ఞానోదయం చేయును. మీరు గాయపడిరా? ఆయన నయం చేయును. “నక్షత్రముల సంఖ్యను [యహువః] నియమించియున్నాడు, వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు" కీర్తన 147: 4, 3. “నా యొద్దకు రండి” అనేది ఆయన ఆహ్వానం. మీ ఆందోళనలు మరియు పరీక్షలు ఏమైనప్పటికీ, మీరు మీ సమస్యలను [ఆయన] ముందు పరచండి. మీ ఆత్మకు ఓదార్పు దొరుకుతుంది. ఇబ్బంది మరియు కష్టం నుండి మిమ్మును మీరు విడిపించుకొనుటకు మార్గం తెరవబడుతుంది. మీరు బలహీనులని మరియు మరింత నిస్సహాయులని మీకు తెలుసు, మీరు ఆయన బలంతో బలపరచబడుదురు. మీ భారాలు బరువుగా ఉంటాయి, వాటిని భారాన్ని మోయువానిపై మోపుటతో మరింత ఆశీర్వదించబడతారు. రక్షకుడు వాగ్దానం చేసిన విశ్రాంతి షరతులపై ఆధారపడి ఉంటుంది, అయితే ఈ షరతులు స్పష్టంగా చెప్పబడ్డాయి. వారు అన్నింటికీ కట్టుబడి ఉండగలరు. ఆయన విశ్రాంతి ఎలా దొరుకునో ఆయన మనకు చెబుతాడు. 4
“విశ్వాసం అనేది స్పష్టంకాని-భవిష్యత్ లో చాలా కాలంపాటు నమ్మగల సామర్థ్యం కాదు. ఇది కేవలం యహువః ను ఆయన వాక్యము ద్వారా నమ్మి తదుపరి దశను తీసుకుంటుంది.”
|
అన్ని విషయాలలో యహువఃకు విధేయులైనవారికి అనంతమైన ప్రేమ బహూకరించే ప్రతి వాగ్దానాన్ని సొంతం చేసుకునే హక్కు ఉంది. మీ ఏకైక ప్రశ్నలు, యహువః ఏమి ఆదేశించారు? మరియు ఆయన వాగ్దానం ఏమిటి? మీరు వీటిని తెలుసుకుంటే, ఒకరికి లోబడి, మరొకదానిని నమ్ముతారు.
• రుణాల విషయంలో పున పునఃచర్చ కోసం అడగడానికి భయపడకండి. యః ఆ విధంగా పని చేయవచ్చు.
• రెండవ- పార్ట్ టైమ్ ఉద్యోగం విషయంలో చాలా గర్వం చూపకండి.
• తగ్గించుకొనుటకు అయిష్టతను చూపకండి, మీ ఇంటిని అమ్మి మరియు సగం చెల్లించాల్సిన చిన్నదానితో లేదా అద్దెకు తీసుకునే దానితో సంతృప్తి చెందండి. అంగట్లో రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు ఎవరూ కొనుగోలు చేయకపోతే, యః మీయొద్దకు కొనుగోలుదారుని పంపగలడు.
• నిరుద్యోగం ఎక్కువగా ఉన్నప్పుడు మరియు ఉద్యోగాలు అందుబాటులో లేనప్పుడు, మీకు ఉద్యోగం కల్పించుటకు ఆయన మార్గాలను ఏర్పాటు చేయవచ్చు.
యహువః వ్యక్తిగత విశ్వాసాన్ని పెంపొందించుటకు వ్యక్తిగత సమస్యలను అనుమతించును. ఇది మీకు మీరుగా తీర్చుకోలేని చాలా పెద్ద సమస్యగా ఉండాలి, ఎందుకంటే ఇది సమాధానం పొందుటకు మిమ్మల్ని ఆయన వైపుకు నడిపిస్తుంది. విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా సమాధానం పొందినప్పుడే, మీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. ప్రతి పరీక్ష మరియు కష్టాలలో, ప్రార్థనను ఆహ్వానించండి.
విధేయతా మార్గాన్ని అనుసరించుట ద్వారా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు లేఖనం ఒక మార్గాన్ని అందిస్తుంది: “ఎల్లప్పుడూ సంతోషించండి, ఎడతెగకుండా ప్రార్థించండి, ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలపండి.”
చార్లెస్ స్పర్జన్ (1834-1892) తన జీవితకాలంలో 10,000,000 మందికి పైగా ప్రజలకు బోధించాడు, సర్వశక్తిమంతుని వాక్యాన్ని విశ్వసించాలని వారిని కోరాడు. |
ఉదార వేదాంతశాస్త్రం యొక్క అతిక్రమణలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ప్రభావవంతమైన పరిచారకుడు చార్లెస్ స్పర్జన్ ఇలా వ్రాశాడు:
స్త్రీ పురుషులు [యహువః] ను ఒక విషయం అడిగారు మరియు దానిని కలిగి ఉన్నారు; వారు సింహాసనం వద్దకు వెళ్ళారు, మరియు ఒక వాగ్దానాన్ని వారు పొందారు, మరియు అది నెరవేరకుండా తిరిగి రాలేమని వారు చెప్పారు, మరియు సర్వశక్తిమంతుని [యహువః] సింహాసనం నుండి విజేతలుగా తిరిగి వచ్చారు; ప్రార్థన ప్రపంచాన్ని కదిలించే చేతిని కదిలిస్తుంది. "ప్రార్థన యః యొక్క నాడి," ఇది ఆయన చేతిని కదిలిస్తుంది; కావున అది అలా వుంది. నిశ్చయంగా, ప్రార్థనలో, నమ్మకమైన హృదయ శక్తిలో, “ఆయన నాలో బలం సమకూర్చును” అనే వచనం యొక్క చక్కనైన నెరవేర్పు ఉంది . . . . క్రైస్తవుడా, వెళ్లుము, ఎందుకంటే “ఆయన నీలో బలాన్ని నింపును”
"నేను బలహీనంగా ఉన్ననూ,
ఆయన శక్తి ద్వారా, నేను సమస్తమును చేయగలను.” 5
మీ సమస్త ప్రశ్నలకు ఏ మానవుడు సమాధానం కలిగి లేడు. మీ సమస్యలన్నిటికి డబ్ల్యుఎల్‌సి పరిష్కారం కలిగిలేదు. విశ్వాసం ద్వారా నడుచుట మరియు యహువః మీ సమస్యలను ఎలా పరిష్కరించునో చూచుట మీ ధర్మము. శత్రువు యొక్క సమస్త దాడులను ఎదుర్కొను మీ రక్షణ ఆయుధం ప్రార్థన.
“ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము" అని [యహువః] చెప్పుచుండెను. (కీర్తన 50:15). మన అయోమయాలను, అవసరాలను, మరియు మన దైవిక సహాయం యొక్క అవసరతను ఆయన యొద్ద చెప్పుటకు ఆయన పిలుచుచుండెను. తక్షణం ప్రార్థనలో ఉండాలని ఆయన మనకు ఆదేశిస్తాడు. ఇబ్బందులు తలెత్తిన వెంటనే, మన నిష్కపమైన, హృదయపూర్వక విజ్ఞాపణలను ఆయనకు అర్పించాలి. మన ప్రార్థనల ద్వారా [ఎలోహీమ్] పై మనకున్న బలమైన విశ్వాసానికి గల రుజువును చూపుతాము. మన అవసరం యొక్క పరిస్థితి మనం ప్రార్థన చేయుటకు దారి తీస్తుంది, మరియు మన పరలోకపు తండ్రి మన ప్రార్థనల ద్వారా కదిలించబడతాడు.
విశ్వాసమే విజయం! తరచుగా తమ విశ్వాసం విషయంలో నిందలకు లేదా హింసకు గురయ్యే వారు [యహువః] తాము విడిచిపెట్టబడినట్లు తమలో తాము భావిస్తారు. మనుష్యుల దృష్టిలో వారు చిన్నవారుగా ఉన్నారని, అన్ని రూపాలలో వారి శత్రువులు వారిపై విజయం సాధిస్తున్నారని అనిపిస్తుంది. అయినప్పటికీ వారు తమ మనస్సాక్షులను కోల్పోకూడదు. మీ తరపున బాధపడి, మీ ఇబ్బందులను, బాధలను భరించినవాడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు.
[యః] పిల్లలు ఒంటరిగా మరియు రక్షణ లేకుండా విడిచిపెట్టబడలేదు. ప్రార్థన సర్వశక్తిమంతుని యొక్క చేతిని కదిలిస్తుంది . . . .
మన జీవితాలను ఆయన సేవించుటకు అప్పగించినట్లయితే, మనం ఎప్పుడూ [యహువః] ద్వారా సదుపాయం కల్పించబడని స్థితిలో ఉంచబడము. మన పరిస్థితి ఏమైనప్పటికీ, మన మార్గాన్ని నిర్దేశించడానికి మనకు ఒక నడిపించు ఉంది; మన అయోమయాలు ఏమైనప్పటికీ, మనకు ఖచ్చితంగా ఆలోచనకర్త ఉన్నారు; మన దుఃఖం, ఒంటరితనం లేదా మరణం, ఏమైనప్పటికీ, మన యెడల సానుభూతి చూపు స్నేహితుడు ఉన్నారు. మన అజ్ఞానంలో మనం తప్పు చేస్తే [యహువః] మనల్ని వదలడు. ఆయన స్వరం, స్పష్టంగా ఇలా చెబుతుంది, "నేను మార్గమును, సత్యమును మరియు జీవమును." యోహాను 14: 6. "దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.” (కీర్తన 72:12).
తనకు సమీపంగా వచ్చి తనను నమ్మకంగా సేవించువారి ద్వారా యహువః గౌరవించబడునని ఆయన ప్రకటించాడు. "ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు." యెషయా 26: 3. సర్వశక్తిమంతుని చేయి మనలను ముందుకు మరియు ఇంకా ముందుకు నడిపించుటకు విస్తరించి ఉంది. ముందుకు సాగండి, [రక్షకుడు] చెప్పారు; నేను మీకు సహాయం చేయుదును. నా నామ మహిమ నిమిత్తం మీరు దేనినడిగిన, అది మీరు పొందుకుంటారు. మీ వైఫల్యం కోసం చూస్తున్న వారి ముందు నేను గౌరవించబడుదును. వారు నా మాట యొక్క విజయాన్ని గొప్పగా చూసెదరు. "మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురు." (మత్తయి 21:22).
శ్రమపడుచున్న లేదా అన్యాయంగా బాధింపబడుచున్న వారందరూ [యహువః] కు మొరపెట్టనీయుడి. హృదయాలు రాతివలె ఉన్నవారి నుండి దూరంగా ఉండండి మరియు మీ విన్నపములు మీ సృష్టికర్తకు తెలియజేయండి. వివేకవ హృదయంతో ఆయన వద్దకు వచ్చువారిని ఆయన ఎన్నడూ తిరస్కరించడు. హృదయపూర్వక ప్రార్థన ఒక్కటి కూడా వ్యర్ధమవదు. ఆకాశ గాయక బృంద గీతాల మధ్య, యహువః బలహీనమైన మానవుడి ఏడుపు వింటాడు. మనము మన హృదయ కోరికలను మన యేకాంత గదులయందు విన్నవిస్తాము, మనము మార్గమందు నడుచునప్పుడు ప్రార్థన చేసుకుంటాము, అయితే మన మాటలు విశ్వానికి చక్రవర్తియైనవాని సింహాసనానికి చేరును. అవి ఏ మానవ చెవికి వినబడవు, కానీ అవి నిశ్శబ్దంగా మరణించవు, లేదా జరుగుతున్న కార్యకలాపాల ద్వారా అవి వ్యర్థంగా మిగిలిపోవు. ఆత్మ కోరికను ఏదీ ముంచివేయదు. ఇది వీధుల యొక్క రణగొణ ధ్వనులకు పైగా, జనసమూహాల గందరగోళానికి పైగా, స్వర్గపు ఆస్థానానికి చేరుతుంది. మనము మాట్లాడుతున్నది యహువఃతో, మరియు మన ప్రార్థనను ఆయన వినును.
“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి (నమ్మకము, తీరము) యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది."
|
మీరు అత్యంత అర్హత లేనివారిగా భావిస్తున్నారా, మీ పరిస్థితిని యహువః కు అప్పగించుటకు లోబడండి. లోక పాపముల నిమిత్తం ఆయన తనంతట తన కుమారుని అర్పించినప్పుడు, ఆయన ప్రతి ఆత్మ యొక్క పరిస్థితికి బాధ్యత తీసికొనెను. "తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?" (రోమా 8:32). మనలను ప్రోత్సాహించుటకు మరియు బలపరుచుటకు ఇచ్చిన దయగల వాగ్ధానాలను ఆయన నెరవేర్చడా? 6
మీకు నిజమైన సబ్బాతును తెలియజేసిన వ్యక్తి, మీ విధేయతను సులభతరం చేయడానికి మిమ్మల్ని విడిపించు వ్యక్తి కాదు. విధేయతకు, దాని స్వభావం ప్రకారం, ఏదైనా వెల చెల్లించుకోవాల్సి ఉంటుంది. "మరియు ఆయన అందరితో ఇట్లనెను; ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. (లూకా 9:23). అందరూ మోయవలసిన సిలువ విధేయత అనే సిలువ - మరియు అది ఒక శిలువ. సిలువ వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది - ఇది ప్రతి వ్యక్తికి తన ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన వాటిని అనుసరించి రూపొందించబడుతుంది.
పరలోక రాజ్యాన్ని సంపాదించుకొనుటకు సమస్తమును వదులుకోవలసిన అవసరం ఉందని యహూషువః స్పష్టంగా హెచ్చరించాడు. దానిని వదులుకొనుటకు సిద్ధంగా ఉండట మాత్రమే కాదు, వాస్తవంగా అలా చేయాలి.
పరలోకరాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.
మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్య మైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. (మత్తయి 13:44-46)
రక్షణ ఒక ఉచిత బహుమానం, కాని అవిధేయతను కొనసాగించుటను ఎంచుకొనువారెవరును దానిని పొందలేరు. జయించుటకు తగినంత సదుపాయం అందరికీ కల్పించబడి యున్నందున, దానిని పోగొట్టుకుంటే సమస్తమును క్షమింపబడకుండా మిగిలిపోతాయి. ప్రజలు విధేయత అనే సిలువను మోయుటను ఇష్టపడకపోవుటకు గల ప్రధాన కారణం గర్వం. వారు వినయపూర్వకమైన నివాసం కంటే తమ సౌకర్యవంతమైన ఇంటిని ఇష్టపడతారు. వారు మంచి జీతం వచ్చే ఉద్యోగంతో వచ్చు ప్రతిష్టను ఇష్టపడతారు. ఒకవేళ తమ చెల్లింపులు ఆగిపోతే సంభవించు ఉద్యోగ నష్టాన్ని, లేదా ఇల్లు మరియు కారును కోల్పోయే పరిస్థితుల వలన కలుగు ఇబ్బందులను వారు ఇష్టపడరు.
మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుట యహువఃకు సులభం. ఆయన వనరులు అపరిమితమైనవి! అయితే, పాపులు ఆయనపై విశ్వాసం పెంపొందించుకొనుట కష్టం. తన వాగ్దానాలపై విశ్వాసముంచమని యహువః మిమ్మల్ని ఎప్పటికీ బలవంతం చేయడు. స్వేచ్ఛను ప్రేమించువానిగా, ఆయన ఆ ఎంపికను మీ ఇష్టానికి వదిలివేసెను. "విశ్వాసంతో, నమ్మాలనుకునేవారికి తగినంత వెలుగు ఉంది మరియు నమ్మలేనివారిని అంధులుగా చేయడానికి తగినంత చీకటి ఉన్నాయి." 7
మీ సృష్టికర్త మరియు విమోచకుని విశ్వసించుటకు ఆలోచనపూర్వకంగా ఎంపిక చేసుకోండి. నిత్యజీవము విలువైనది, దానికోసం మీరు సమస్తం కోల్పోయినా. ఎల్లప్పుడూ సంతోషించండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెప్పండి, అన్ని పరిస్థితులలో ప్రార్థనను ఆహ్వానించండి. ఆయన కదల్చలేని పర్వతం లేదు; దాటలేని దూరం లేదు. ఆయన మీ ప్రార్థనలు వింటాడు మరియు చివరికి మీకు గొప్ప ఆశీర్వాదం అయ్యే పరిస్థితులను ఆయన ఆజ్ఞాపిస్తాడు.
"మీకు తెలిసిన సమస్త వెలుగు యొక్క చివరకు చేరుకున్నప్పుడు మరియు తెలియని చీకటిలోకి అడుగు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు, ఈ రెండు విషయాలలో ఒకటి జరుగునని తెలుసుకోవటమే విశ్వాసం: మీరు నిలబడటానికి ఏదో ఒక గట్టి ఆధారం ఇవ్వబడుతుంది, లేదా మీరు తప్పించుకోవటం ఎలాగో తెలియజేయబడుతుంది.”
ఈడ్ టెల్లర్
పర్వతంపై యః
విశ్వాసమే విజయం!
"యహువః మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే"
(1 యోహాను 5:4 రిస్టోర్డ్ నేమ్స్ స్క్రిప్చర్)
1 అన్ని లేఖనాల వచనాలు కింగ్ జేమ్స్ వెర్షన్ నుండి ఇవ్వబడినవి, లేనిచో తెలియజేయబడినవి.
2 “ఫెయిత్,” అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, నోహ్ వెబ్‌స్టర్, ఎడిషన్., 1828.
3 ఓస్వాల్డ్ ఛాంబర్స్, మై అట్ మోస్ట్ ఫర్ హిజ్ హయ్యస్ట్.
4 ఇ. జి. వైట్, డిజైర్ ఆఫ్ ఏజెస్, పేజీ 329.
5 సి. హెచ్. స్పర్జన్, "ఫెయిత్ వర్సెస్ ఫియర్."
6 E. G. వైట్, క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్స్, pp. 172-174.
7 బ్లేజ్ పాస్కల్