ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన కంటెంట్ [వ్యాసాలు / ఎపిసోడ్లు] చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
సంఘ సభ్యులు సంఘంలో తమకు ప్రకటించబడు “యహూషువః” ను జాగ్రత్తగా పరిశీలించకుండా అంగీకరిస్తారు. ఒక వ్యక్తి ఆవిర్భావాన్ని గూర్చిన ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి తన మూలం ద్వారా నిర్వచించబడతాడు. “మీరు ఎక్కడి నుండి వచ్చారు?” అని ఎవరైనా అడిగినప్పుడు మనం తరచుగా ఈ సమాచారం కోసం ప్రయత్నిస్తాము.
యహువః కుమారునికి సంబంధించి అడగవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న అతని ఆవిర్భావం గురించి. అతడు ఎక్కడ నుండి వచ్చాడు, ఎప్పుడు మరియు ఎలా? నిత్యత్వమందంతటను ఉనికిలో ఉన్న వ్యక్తికి మరియు తల్లి గర్భంద్వారా ఉనికిలోనికి వచ్చిన వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.
|
యహువః కుమారునికి సంబంధించి అడగవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న అతని ఆవిర్భావం గురించి. అతడు ఎక్కడ నుండి వచ్చాడు, ఎప్పుడు మరియు ఎలా? మానవుని వలె కనిపించుటకు ముందు నిత్యత్వమందంతట యహువః వలె నిత్యము ఉనికిలో ఉన్న వ్యక్తికి మరియు తల్లి గర్భంద్వారా ఉనికిలోనికి వచ్చిన వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజమైన మానవుడు, నిర్వచనం ప్రకారం, తన తల్లి గర్భమందు ఉనికిని ప్రారంభిస్తాడు!
ఒక దేవదూతగా ఉద్భవించి, తరువాత తనను తాను తగ్గించుకొని, లేదా యహువః ద్వారా ఒక పిండం వలె తగ్గించబడి, స్త్రీ నుండి జన్మించిన వ్యక్తికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. యహూషువః ఎప్పుడూ, ఎన్నడూ దేవదూత కాదని హెబ్రీయులకు 1: 5 మరియు 13 వచనాలు రెండుసార్లు నిశ్చయంగా చెప్పుచుండెను! అయితే యహూషువః నిజానికి మిఖాయేలు అనే దేవదూత అని చాలా విరుద్ధంగా ప్రకటించే ఏడు మిలియన్ల మంది యెహోవా సాక్షులను ఇది నిరోధించలేదు. ఇలాంటిది, భారీ స్థాయిలో మోసపూరితమైన శక్తి!
వాగ్దానం చేయబడిన మెస్సీయగా అర్హత పొందాలంటే యహూషువః ఒక మానవ వ్యక్తిగా, ఒక సాధారణమైన, దావీదు రాజు యొక్క రక్త సంబంధమైన వారసుడై యుండాలి. ఈ విషయాన్ని కీర్తన 132: 11 మరియు 89: 35-37 (లూకా 1:69) స్పష్టం చేస్తున్నాయి. మెస్సీయ ఇశ్రాయేలు దేశపు రాజవంశం యొక్క ప్రత్యక్ష, శరీర సంబంధమైన వారసుడై యుండాలి. యహూషువః యొక్క చట్టబద్దమైన తండ్రిగా యోసేపు మరియు అసలు తల్లిగా మరియ వీరిద్దరి వంశావళులు సువార్తలలో కనబడినట్లుగా దావీదు కుమారుడైన నాతానుతో సంబంధం కలిగియున్నవి. (లూకా 3: 31).
మెస్సీయ నిజానికి ఇశ్రాయేలు యొక్క అంతిమ మరియు చివరి రాజ పాలకుడు, మరియు అతడు యుద్ధాలవలన-పాడైయున్న మన ప్రపంచానికి శాంతిని కలిగించబోవుచున్నాడు. ఇది రాబోయే రాజ్యాన్ని గూర్చిన మొత్తం సువార్తకు కేంద్ర బిందువు. ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును. (యెషయా 9: 6). మీ చుట్టూ చూడండి మరియు ఇది ఇంకా జరగలేదని తెలుసుకోండి! కానీ త్వరలో జరుగుతుంది.
లూకా ఒక ఖచ్చితమైన, విద్యావంతుడైన క్రైస్తవ చరిత్రకారుడు, అతడు క్రైస్తవ విశ్వాసం యొక్క ఖచ్చితమైన విషయాలను క్రమపరుచుటకు నిశ్చయించుకున్నాడు. (లూకా 1: 3-4). అందువలన ఒకే ఒక్క నిజమైన విశ్వాసంగా అందించబడియున్న క్రైస్తవ వాస్తవాల యొక్క సంపూర్ణ ఖచ్చితత్వానికి థియోఫిలస్ (లూకా ఇతడికి వ్రాసెను) పునః భరోసా ఇవ్వగలడు.
లూకా యొక్క ప్రేరేపిత మాటలను కలిగి ఉండుట ద్వారా, నిజమైన యహూషువఃను మరియు నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని సహజమైన సరళతతో నిర్వచించుట ద్వారా ఇన్ని సంవత్సరాల తరువాత మనం కూడా ఎంతో ఆశీర్వదించబడ్డాము.
ఆశ్చర్యకార్యం ద్వారా తన తల్లి గర్భంలో ఉనికిలోకి వచ్చిన, అద్భుతంగా జన్మించిన, (లూకా 1:35; మత్త. 1:18, 20, 1 యోహాను 5:18) పూర్తిగా మానవుడు, దావీదు వంశస్థుడు, రెండవ ఆదాము అయిన యహూషువఃను నమ్ముటకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది కీలకమైన విషయం.
ఈ వ్యాసంలో నేను చెప్పదలచినది ఏమిటంటే, యహువః కుమారుడైన యహూషువః యొక్క ఆవిర్భావమును గూర్చి లూకా ద్వారా చక్కగా రూపొందించబడిన వృత్తాంతం తెలివిగా అణగదొక్కబడెను, వాస్తవానికి సంఘ జనులచేత తిరస్కరించబడెను, వారు వారికి తెలియకుండానే మరియు పరిశీలన చేయకుండానే సంఘంలో యహూషువఃను గూర్చి దీర్ఘకాలికంగా బోధింపబడుతున్న సంప్రదాయాన్ని స్వీకరించారు మరియు స్వీకరిస్తున్నారు, అలా లూకా (మరియు మత్తయి) ఇచ్చిన వృత్తాంతాన్ని నిరాకరిస్తూ, నిర్మూలిస్తూ మరియు తిరస్కరిస్తున్నారు.
ఇది "గుర్తింపు" యొక్క చాలా తీవ్రమైన విషయం మరియు తప్పుడు "గుర్తింపు". ఈ విషయం బెరయలో ఉన్నవారివలె మనం కూడా హృదయపూర్వకంగా దర్యాప్తు చేయుటకు అర్హమైనది. (అపొస్తలుల కార్యములు 17:11).
బైబిల్ యొక్క నిజమైన యహూషువః యొక్క గుర్తింపును గూర్చి ఇంతటి భారీ వర్తమానానికి సంబంధించి స్పష్టమైన అవగాహనకు అవసరమైన కీలకమైన గుర్తింపు వాస్తవాలను తెలియజేయుటకు గాబ్రియేలు దూతను పంపించుటలో యహువః తగినట్లుగా చర్యలు తీసుకొనెను. దేవదూతలు మాట్లాడునప్పుడు మనం అత్యంత శ్రద్ధ వహించాలి!
|
బైబిల్ యొక్క నిజమైన యహూషువః యొక్క "గుర్తింపు" ను గూర్చి ఇంతటి భారీ వర్తమానానికి సంబంధించి స్పష్టమైన అవగాహనకు అవసరమైన కీలకమైన గుర్తింపు వాస్తవాలను తెలియజేయుటకు గాబ్రియేలు దూతను పంపించుటలో యహువః తగినట్లుగా చర్యలు తీసుకొనెను. దేవదూతలు మాట్లాడేటప్పుడు మనం అత్యంత శ్రద్ధ వహించాలి! దేవదూతలు సంభాషించేటప్పుడు, వారు సులభంగా గ్రహించగలిగే పదాలతో తగినంత నైపుణ్యం కలిగి ఉంటారని మనం తెలుసుకోవాలి.
పండితులైన నిపుణులకు మాత్రమే అర్థమయ్యేలా మెదడును-విచ్ఛిన్నంచేసే, విప్పలేని-పజిల్ గా ఉండునట్లు బైబిలు ఎప్పుడూ ఉద్దేశించబడలేదు! మీరు, యహువః మరియు యహూషువఃల యొక్క అంకిత ప్రేమికుడిగా ఉంటే, యహూషువః ఎవరో అర్థం చేసుకోవచ్చు! మరియు మీరు ఒక పెద్ద గజిబిజిలో మరియు సులభమైన భాష యొక్క అపార్థంలో మిగిలిపోవడం బాధాకరం.
రెండు ముఖ్యమైన సందర్భాలలో యహువః తరపున మాట్లాడుటకు గాబ్రియేలు నియమించబడినట్లు మనకు గుర్తు. మొదట దానియేలు 9 లో, యెరూషలేము మరియు దేవాలయం యొక్క వినాశకరమైన స్థితిపై తీవ్ర దుఃఖంలో ఉన్న దానియేలు, తన సొంత పాపాలను మరియు తన దేశం యొక్క పాపాలను క్షమించి ఇశ్రాయేలుకు శాంతిని మరియు కాపుదలను తిరిగి దయచేయమని యహువఃను వేడుకుంటాడు. యహువః పక్షమున మాట్లాడుటకు గాబ్రియేలు దూత అసాధారణమైన రీతిలో సందర్శించి దానియేలు యొక్క ఉద్రేకపూర్వక అభ్యర్ధనలకు సమాధానం ఇస్తాడు. యెరూషలేము తిరిగి నిర్మించబడుటకు “ఎంతకాలం” పట్టును అనే తన నిరంతర ప్రశ్నకు సమాధానంగా దానియేలుకు ఆశీర్వాద భరోసా ఇవ్వబడింది. 70 వారములు, 490 సంవత్సరాలు ముగిసిన తరువాత, సమస్తం చక్కబడునని అతనికి చెప్పెను. యెరూషలేము మరియు ఇశ్రాయేలు పునరుద్ధరించబడును.
ఒక అద్భుతమైన కార్యం కోసం గాబ్రియేలు పంపబడిన మరొక సమానమైన సందర్భం, యోసేపునకు ప్రధానం చేయబడిన యువ యూదురాలైన కన్య మరియను అతడు సందర్శించిన సందర్భం. ప్రజా వంశావళిలో నిశితంగా నమోదు చేయబడ్డ వీరు దావీదు రాజ వంశపు సభ్యులు. ఆ సమయంలో రాజకుటుంబంగా పరిపాలించనప్పటికీ, ఆ కుటుంబంలో మెస్సీయ జన్మించవలసి ఉంది. మొత్తం గ్రంథం యొక్క సమగ్రత ప్రమాదంలో ఉంది.
వాగ్దానం చేయబడిన మెస్సీయ ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఉద్భవించెనో వివరించుటలో లూకా చాలా స్పష్టంగా ఉన్నాడు. గమనించదగ్గ మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, గర్భం దాల్చబడుటకు ముందు త్రిత్వ భగవంతునిలో “ముందుగా” ఉన్న రెండవ వ్యక్తి జన్మించుటను గూర్చి లూకా వివరించుటలేదు! ఒకరి సొంత సంప్రదాయాలను లూకా ఖాతాలోనికి చొప్పించి చదువుట గందరగోళంగా ఉంటుంది, అలా దానిని మార్చడం, తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన విషయం. ఇది పవిత్ర లేఖనాలతో అన్యాయంగా వ్యవహరించటయే. మరియలో అద్భుతంగా గర్భం దాల్చబడిన మరియు జన్మించిన యహువః కుమారుడైన యహూషువః గర్భం దాల్చబడుటకు ముందే ఉనికిలో ఉండెననే ఎటువంటి ఆలోచననైనా లూకా ఉద్దేశపూర్వకంగా మినహాయించాడు! మీ సంఘం లూకా సువార్తను తప్పుగా చదవడం యహూషువః యొక్క "గుర్తింపు" గందరగోళానికి కారణమౌతుందా?
ఇక్కడ లూకా యహువః కుమారుడైన యహూషువః యొక్క ఆరంభమును, అలా ఆయన యొక్క గుర్తింపును గూర్చి చాలా ముఖ్యమైన సంఘటనను వివరించాడు. గాబ్రియేలు దూత యొక్క సూటియైన మాటలను, అతని వృద్ధ భార్య అయిన ఎలీసబెతు సాధారణ ఆలోచనకు విరుద్ధంగా గర్భవతియై బాప్తీస్మమిచ్చు యోహానును కనును అనే మాటలను నిరాకరించినందుకు, జెకర్యా తొమ్మిది నెలలపాటు మాట్లాడలేకుండా శిక్షించబడుటను లూకా మొదట గుర్తుచేసుకున్నాడు: (లూకా 1: 18-20).
ఎలీసబెతు యొక్క ఆరవ నెలలో మరియకు గాబ్రియేలు దూత యొక్క ఆశ్చర్యకరమైన ముఖ్యమైన దర్శనం కలిగింది. (లూకా 1:26). తన ఇంట్లో ఒక ప్రధాన దేవదూత కనిపించుట పట్ల సహజంగానే భయపడిన మరియకు దేవదూత ఇలా భరోసా ఇస్తాడు: మరియా, భయపడకుము. (లూకా 1:30). (లూకా 1:30).
వాగ్దానం చేయబడిన మెస్సీయ ఉనికిలోకి ఎలా, ఎప్పుడు వచ్చును అనే విషయాన్ని గాబ్రియేలు సులభమైన, స్పష్టమైన మరియు సంక్షిప్త భాషలో వివరిస్తాడు. బైబిలు వాక్యాలు మనందరికీ శక్తివంతమైన, నిర్మాణాత్మక సమాచారంగా అందించబడతాయి, వాదనకు లేదా వివాదానికి ఖచ్చితంగా కావు!
పరిశుద్ధాత్మ, సర్వోన్నత యహువః శక్తి మరియను కమ్ముకొనును; గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఎలోహీం కుమారుడనబడును. మరియు "ఖచ్చితంగా ఆ కారణం చేత" (డియో కై/dio kai), జన్మించవలసిన, జన్మించిన వ్యక్తి "యహువః కుమారుడు అని పిలువబడును" (లూకా 1:35).
|
ఇది నిశ్చయాత్మకమైనది మరియు నిర్ణయాత్మకమైనది మరియు సమస్త నమ్మకానికి అర్హమైనది. ఏకీకృతమైనది మరియు ఆధారమైనది. ప్రతి కొత్త నిబంధన రచయిత యహూషువః ఎవరో అనే తన అవగాహనను గాబ్రియేలు యొక్క ఈ ప్రేరేపిత సూచనలపై ఆధారం చేసుకున్నాడు. నేటివలె నిస్సహాయంగా గందరగోళంగా ఉన్న సంప్రదాయ దృక్పథాన్ని కొత్త నిబంధన ప్రదర్శించలేదు. ఈ గందరగోళాన్ని బట్టి ఏదో భయంకరమైన తప్పు జరిగిందని మనం గ్రహించాలి! ఇది సమస్య కావచ్చు?
"క్రైస్తవ లోకానికి క్రైస్తవ మతం గురించి పూర్తిగా తెలియకపోవుట వలన దానినుండి దూరమైపోయి ఉన్నది" (సోరెన్ కీర్కెగార్డ్, టైమ్ మ్యాగజైన్, డిసెంబర్ 16, 1946 లో ఉదహరించబడింది).
రాజవంశ రక్తంతో ఉన్న ఒకరి గర్భంలో గర్భం ధరించబడి మరియు జన్మించుట ద్వారా మెస్సీయ స్పష్టంగా దావీదుతో సంబంధం కలిగి ఉంటాడు, మరియు ఆ వ్యక్తి, గర్భం ధరించబడి, జన్మించాడు కాబట్టి, యహువః కుమారుడు అవుతాడు, ఖచ్చితంగా ఈ సులభమైన కారణంతో - పరిశుద్ధాత్మ శక్తి [యహువః యొక్క సృజనాత్మక శక్తి] వలన జరిగిన జీవ అద్భుతం వలన యహువః యహూషువః యొక్క తండ్రి యాయెను. ఈ అద్భుతం యహూషువః తల్లియైన మరియలో జరిగింది. ఈ విధంగా, మరియ కుమారుడు/ యహువః కుమారుడు రెండవ మరియు చివరి ఆదాముగా అర్హత సాధిస్తాడు, అతడు [ఆదాము] కూడా యహువః కుమారుడు (లూకా 3:38).
యహూషువః జన్మ కథనాలకు సంబంధించి దివంగత రేమండ్ బ్రౌన్ యొక్క అద్భుత మరియు వివరణాత్మక ఖాతాను మరియు వ్యాఖ్యానాలను కలిగి ఉండుట ద్వారా మనము ఆశీర్వదించబడ్డాము. ఇది లూకా మరియు మత్తయి సువార్తల నుండి యహువః కుమారుడైన యహూషువః మెస్సీయ యొక్క ఆవిర్భావాన్ని గూర్చిన వివరాల యొక్క శాస్త్రీయ విశ్లేషణ.
బ్రౌన్ ఒక అద్భుతమైన వాస్తవాన్ని సూచించాడు! దైవత్వంలోని రెండవ సభ్యుని విషయంలో లూకా ఇచ్చిన వివరణను తుడిచిపెట్టి, దానిని మార్చి, వివరించిన సంఘ సంప్రదాయాన్ని ఎత్తి చూపాడు. బ్రౌన్ వ్యాఖ్యలు అత్యవసర పునరాలోచనకు కారణమవ్వాలి. అవి హెచ్చరికకు కారణమవ్వాలి. తరువాత సాంప్రదాయం ద్వారా చరిత్ర మార్చబడినప్పుడు, యహువః కుమారుడు మానవులందరి వలె తన తల్లి గర్భమందు ప్రారంభం కాలేదు అనే అన్య ఆలోచనను ప్రవేశపెట్టుట ద్వారా లూకా మరియు గాబ్రియేలుల యొక్క మాటలకు ప్రాథమికంగా అస్పష్టత సంభవించెనని బ్రౌన్ అభిప్రాయపడ్డాడు.
బ్రౌన్ ఇలా అంటాడు, “ముందుగా ఉనికిలో ఉన్న … [యహూషువః] గర్భమందు పడుట భూసంబంధమైన జీవితానికి ప్రారంభం, అంతేకాని యహువః కుమారుని ఆవిర్భావానికి ప్రారంభం కాదు.” అలా, కుమారుని "ముందస్తు ఉనికి" అనే తరువాత వచ్చిన ఆలోచన యహువః కుమారుని ఆవిర్భావాన్ని గూర్చి లూకా ఇచ్చిన వృత్తాంతానికి విరుద్ధంగా ఉంది, మరియు దానిని రద్దు చేసింది. బ్రౌన్ సరిగ్గా ఇలా అంటాడు, "కన్యక గర్భం ధరించుటను, ఇకపై యహువః కుమారుడు పుట్టుటగా కాక, ముందుగా ఉనికిలో ఉన్న కుమారుడు "అవతరించుట" గా చూడబడింది, మరియు ఇది సనాతన సిద్ధాంతంగా మారింది” (ది బర్త్ ఆఫ్ మెస్సీయ, పే. 141). ఈ అద్భుతమైన విషయం నుండి మా పాఠకులకు సంతృప్తికర దిగ్బ్రాంతిని పొందుదురని నేను ఆశిస్తున్నాను.
సంఘ సభ్యులు విశ్వసించాల్సిన పరిస్థితి వచ్చిన సనాతన వీక్షణకు [తరువాత వచ్చిన వీక్షణకు] లూకా యొక్క ఖాతా ప్రత్యక్షంగా విరుద్ధంగా మరియు సరిపడనట్లుగా ఉంది . . . . . మరో మాటలో చెప్పాలంటే, లూకా మరియు గాబ్రియేలు దూతలు, యహువః కుమారుని ఆవిర్భావాన్ని గూర్చి నిజమైన వృత్తాంతాన్ని వెల్లడిస్తున్నారని ఇకపై విశ్వసించబడరు!
|
సంఘ సభ్యులు విశ్వసించాల్సిన పరిస్థితి వచ్చిన సనాతన వీక్షణకు, తరువాత వచ్చిన వీక్షణకు లూకా యొక్క ఖాతా ప్రత్యక్షంగా విరుద్ధంగా మరియు సరిపడనట్లుగా ఉంది. బ్రౌన్ చెప్పినట్లుగా, తరువాత వచ్చిన" పూర్వ ఉనికి" సిద్ధాంతం ప్రామాణిక సనాతన విశ్వాసంగా మారిన వెంటనే, "కన్యక గర్భం ధరించుటను ఇకపై [యహువః] కుమారుడు ఆవిర్భవించుటగా చూడలేదు." మరో మాటలో చెప్పాలంటే, లూకా మరియు గాబ్రియేలు దూతలు యహువః కుమారుని ఆవిర్భావాన్ని గూర్చి నిజమైన వృత్తాంతాన్ని వెల్లడిస్తున్నారని ఇకపై విశ్వసించబడలేదు! యహువః కుమారుడైన, యహూషువః యొక్క ఆవిర్భావం మరియు "గుర్తింపు" తీవ్రంగా మార్పులు చేయబడెను. లూకా, గాబ్రియేలు మరియు బైబిలును “సనాతన ధర్మం” వ్యతిరేకించెను మరియు అధిగమించెను! ఈ మార్పును నిజంగా… లేఖనం నుండి నిష్క్రమించుటగా మరియు యహువః కుమారుని విషయంలో కొత్త మరియు భిన్నమైన గుర్తింపును విధించుటగా చూడాలి. యహువః కుమారుడిని వేరేలా గుర్తించుట వలన ఎవరూ భయపడలేదా? “భిన్నమైన యహూషువః”, “భిన్నమైన క్రీస్తు” యొక్క అక్రమ చొరబాటు ఎవరికీ కనిపించలేదా? “సంఘం” మీరు ఊహించిన దానికంటే ఎక్కువ “నేర స్థలం” కావచ్చు!
యహువః కుమారుని గూర్చన ఈ క్రొత్త బైబిలేతర మూలం మరియు గుర్తింపు యహువః గాబ్రియేలు ద్వారా ప్రకటించిన లేఖనాలను మార్చివేసింది, మరియు ఆ క్రొత్త బైబిలేతర వృత్తాంతం అన్ని వర్గాలలో సనాతన ధర్మంగా మరియు ప్రమాణంగా మారింది! నిజమైన యహువః కుమారుని గుర్తింపునకు సంబంధించి లూకా మరియు మత్తయిలతో చోటుచేసుకున్న చొరబాట్లు వలన కలిగే పరిణామాల గురించి కొద్దిమంది ఆలోచించినట్లు తెలుస్తోంది.
మెస్సీయ యొక్క జననం విషయంలో రేమండ్ బ్రౌన్ తన దృక్కోణంలో ఎంత ఆలోచనతో ఉన్నారో మనము చూశాము. లూకా మరియు గాబ్రియేలులను సాంప్రదాయం నిరాకరించుటకు కారణమైన సూక్ష్మమైన మార్పును ఆయన ఎత్తి చూపారు. సాంప్రదాయం చొరబడిన తర్వాత లూకా యొక్క ఖాతా సంఘంలో మాట్లాడుటకు అనుమతించబడలేదు. సాంప్రదాయం లూకా మరియు గాబ్రియేలులను ముంచివేసెను, ఈ రోజు వరకు ముంచివేస్తుండెను.
లూకా ప్రకారం, మరియ ద్వారా యహువః కుమారుడైన యహూషువః ఉనికిలోకి తీసుకురాబడెను, ఆయన అద్భుతం ద్వారా జన్మించెను, యహువః యొక్క ప్రత్యేక కుమారునిగా జన్మించెను. యహూషువః తాను ఉనికిలోకి వచ్చినప్పటినుండి యహువః కుమారుడు. అనగా మరియ గర్భంలో పడినప్పటినుండి/ పుట్టినప్పటినుండి. ఇది పారదర్శకంగా స్పష్టంగా ఉంది కావున ఎటువంటి వాదనను రేకెత్తించకూడదు. గాబ్రియేలుతో మరియ వాదించలేదు, లేదా అతడిని తప్పుగా అర్థం చేసుకోలేదు, కాని ఈ రోజు చాలా మంది గాబ్రియేలు మాటలలోని సత్యాన్ని మెదడు విచ్ఛిన్నం చేసే వాదనలో పాతిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు!
లూకా యొక్క సరళమైన ఖాతాకు విరోధంగా ప్రవేశించిన “నేర దృశ్యాన్ని” బ్రౌన్ గమనించాడు.
"కొంతమంది సంఘ ఫాదర్లు మరియు మధ్యయుగ వేదాంతవేత్తలు లూకా 1:35 లోని 'యహువః యొక్క పరిశుద్ధాత్మ మరియు యహువః శక్తి' వరుసగా త్రిత్వములోని మూడవ మరియు రెండవ వ్యక్తులను సూచిస్తుండెనని భావించారు, కావున ఆ శక్తి, రెండవ వ్యక్తి, మరియమ్మ గర్భంలో 'మాంసము' ను తీసుకొనుటకు దిగివచ్చెను. మనం చూడగలుగుతున్నట్లుగా, "ముందస్తు ఉనికి" కలిగియున్న కుమారుడు అవతరించుటను గూర్చి లూకా ఆలోచించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.” (పేజి 290).
అంతులేని వాదనకు మరియు అపరిష్కృతానికి మరియు తరచుగా భయంకరమైన పిడివాదానికి కారణం నిజంగా సంఘ సంప్రదాయమే, ఇది మనందరినీ గ్రంథం నుండి దూరం చేసింది.
|
త్రిత్వ భగవంతుని యొక్క అన్యమత తాత్విక ఆలోచనలతో లూకా యొక్క జాబితా ఎలా కప్పివేయబడెనో బహిర్గతం చేయబడాలి మరియు తిరస్కరించబడాలి. సంఘ నాయకులకు లూకా 1:35 ఎంత ఇబ్బంది కలిగించిందో బ్రౌన్ వ్యాఖ్యానించాడు. లూకా 1: 35 లోని “గనుక” యొక్క అన్ని ముఖ్యమైన అర్థాలపై ఆయన వ్యాఖ్యానించారు. యహూషువః కన్యకకు జన్మించుట వలన అతడు యహువః కుమారుడని ఇది స్పష్టంగా సూచిస్తుంది.
“ఇది అనేక మంది సనాతన వేదాంతవేత్తలను ఇబ్బందికి గురిచేసింది, ఎందుకంటే "పూర్వ/ముందస్తు-ఉనికి" [త్రిత్వ] క్రైస్తవ సిద్ధాంతం, అనగా, ముందుగా ఉన్న వ్యక్తిని పవిత్రాత్మచేత మరియ గర్భం ధరించుట దేవుని కుమారుని ఉనికిని తీసుకురాదు. అలాంటి క్రైస్తవ సిద్ధాంతం గురించి లూకాకు తెలియదు. లూకా భావన దైవిక కుమారత్వానికి సంబంధించినది” (పేజి 291).
లూకా మరియు లేఖనం మరియు రెండవ శతాబ్దం నుండి పిడివాదంగా వృద్ధిచెందిన సాంప్రదాయానికి మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉంది.
"వేదాంత శాస్త్రం" తో లూకా లేఖనాల యొక్క స్పష్టమైన వైరుధ్యాన్ని తప్పక గుర్తించాలి, ఎందుకంటే ఇది గత 1900 సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం మొత్తాన్ని ప్రశ్నిస్తుంది. రేమండ్ బ్రౌన్ ఇలా ముగిస్తాడు:
“ఈ వరుసను ప్రారంభించే 'గనుక' అనే పదంలోని అర్థాన్ని నివారించుటకు ప్రయత్నించే [బైబిలును నివారించుటకు ప్రయత్నించు!] వేదాంతవేత్తలను నేను అనుసరించలేను. శిశువును గర్భం ధరించుట కుమారుని ఉనికిలోకి తీసుకురాదని అది అప్పటికే దేవుని కుమారుడైన వానిని దేవుని కుమారుడని పిలుచుటకు మాత్రమే మనకు వీలు కల్పిస్తుందని వారు వాదిస్తున్నారు.”
బ్రౌన్ తన బైబిల్ ఫలితాలను ఇలా సంగ్రహించాడు: “రెండు కథనాలు యేసు తాను గర్భంలో పడిన మొదటి క్షణం నుండి మాత్రమే దేవుని కుమారుడు అనే [నిజమైన యహూషువః యొక్క గుర్తింపును ఎలా నిర్వచించాలి అనే] క్రైస్తవ సిద్ధాంతపు అంతర్దృష్టిని అభివృద్ధి చేస్తాయి” (పేజి 561). అంతకంటే ముందు కాదు!
వాస్తవానికి ఇది సూటిగా మరియు వాస్తవంగా నిజం, మరియు చరిత్ర, బైబిల్ మరియు విశ్వాసం యొక్క నిజమైన యహూషువఃను గూర్చిన అసలైన "గుర్తింపు" యొక్క అసలైన విషయాలను పరిశీలనచేయుచున్న పాఠకులను అది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
వ్యత్యాసం చాలా సులభం: లూకా మరియు మత్తయి ఇద్దరూ యహువః కుమారుడైన మెస్సీయ యొక్క ప్రాథమిక గుర్తింపు విషయంలో మరియనందు యహువః చేసిన ఆశ్చర్యకార్యంపై ఆధారపడ్డారు. సంబంధం తార్కికమైనది మరియు ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. దాని అర్థం నిజంగా తొలగించరానిది. బైబిలులోని కొన్ని ఇతర రచనలలో తరచుగా కనబడునట్లు అర్థమగుటకు కష్టంగా ఉండు, గందరగోళ భాష నుండి గాబ్రియేలు దూరంగా ఉన్నాడు.
అంతులేని వాదనకు మరియు అపరిష్కృతానికి మరియు తరచుగా భయంకరమైన పిడివాదానికి కారణం నిజంగా సంఘ సంప్రదాయమే, ఇది మనందరినీ గ్రంథం నుండి దూరం చేసింది.
|
అంతులేని వాదనకు మరియు అపరిష్కృతానికి మరియు తరచూ భయంకరమైన పిడివాదానికి నిజంగా సంఘ సంప్రదాయమే కారణం, ఇది మనందరినీ గ్రంథం నుండి దూరం చేసింది. సాంప్రదాయాన్ని పక్కన పెట్టినచో, మనందరం లూకా, మత్తయి మరియు గాబ్రియేలుల యొక్క ప్రేరేపిత వాక్యాలతో నేరుగా సన్నిహిత ఆనందాన్ని అనుభవించవచ్చు.
అప్పుడు మనం మత్తయి మరియు లూకాలకు వ్యతిరేకంగా యోహానును వాడుటను మానుకుంటాము. మత్తయి మరియు లూకా లేఖనాలను తికమకకు గురిచేసే విధంగా మనము యోహాను 1:1 వద్దకు వచ్చి దానిని చదవము. యోహాను యహువః యొక్క ప్రణాళికను మరియు రూపకల్పనను తెలియజేస్తన్నట్లు కనిపిస్తాడు: వాక్యం, వాక్యం కాదు, ఆది నుండి. ఇది ఇశ్రాయేలీయుల మరియు యహూషువః ల యొక్క మతవిశ్వాసాన్ని ఉల్లంఘించే రెండవ యహువః (కుమారుడు) ఉనికి కోసం కాదు. (మార్కు 12:29; యోహాను 17: 3) మరియు ఇది యహువఃకు మరియు మెస్సీయకు [కీర్తన 110: 1 లోని “నా ప్రభువు” అదోని అని వ్రాయబడిన, దైవము కానటువంటి మెస్సీయకు] మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని నిరాకరిస్తుంది. ఇది క్రొత్త పాతనిబంధనల నుండి చాలా ఇష్టమైన వచనం మరియు ఇది అన్ని ఆదేశాలలో అతి ముఖ్యమైనది మరియు ఇది మార్కు 12:29, యోహాను 17: 3 లలో యహూషువః అతి ముఖ్యంగా ధృవీకరించిన అన్ని ఆదేశాల విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోకుండా హెచ్చరిక అవరోధంగా పనిచేయాలి. యహువః ఒకే దైవిక వ్యక్తి, కాబట్టి ఆయన వేలాది ఏకవచన వ్యక్తిగత సర్వనామాలతో వర్ణించబడెను!
నేర దృశ్యం గురించి మరిన్ని: “నంక్ స్టాన్స్”
భూమిపై ఉన్న అది ఏమిటి, మీరు బాగా అడగవచ్చు? ఇది (“ఇప్పుడు నిలబడి ఉండెను”) అనే లాటిన్ పదబంధం, ఇది యహువః అన్ని కాలాలలో ఉండెను అను ఆలోచనను వివరించుటకు వాడబడుతుంది!
"నంక్ స్టాన్స్" అనగా "ఇప్పుడు శాశ్వతమైనది", శాశ్వతత్వం ఇప్పటికీ వర్తమానంలో నిలబడి ఉండెను అనే ఆలోచన. శాశ్వతంగా ఉంటూ చరిత్ర అంతటా జరిగుతున్న దానిని చూస్తుండుటను శాశ్వతంగా ఉండుట అని మీరు ఊహించవచ్చు, కాని నంక్ స్టాన్స్ అనగా మీరు అంతం లేని సమయాన్ని ఒకే క్షణంలో అనుభవించినట్లుగా ఉండుట. కాబట్టి నంక్ స్టాన్స్ ను గ్రహించిన ఒక్కడైయున్న యహువఃకు జరిగినదంతా తెలుస్తుంది మరియు అదే క్షణంలో శాశ్వత కాలమంతటా జరుగబోయేది కూడా తెలుస్తుంది. ఇది అతని ముందు విస్తరించబడియున్న సమయాన్ని మరొక కోణంలో లేదా వేరొక విధంగా చూడగలిగినట్లుగా ఉంటుంది.
ఇప్పుడు క్లిష్టమైన స్థానానికి వచ్చాం! మన పాఠకులను ఇక్కడ ఆగి ఆలోచించనీయండి! కీర్తన 2: 7 లో, యహువః కుమారుని పుట్టుక గురించి ఒక అద్భుతమైన ప్రకటన చదివాము. ఈ క్రింది ప్రతిపాదనను యహువః స్వయంగా చెప్పాడు:
"నీవు [మెస్సీయ] నా కుమారుడవు: నేడు నిన్ను కనియున్నాను = నిన్ను ఉనికిలోకి తీసుకువచ్చాను."
మీరు ప్రొటెస్టంట్ లేదా కాథలిక్ నేపధ్యం గల సంఘానికి వెళ్ళినప్పుడు, పుట్టుక కోసం చెప్పబడిన “నేడు”, అనేది కుమారుడు ఉనికిలోకి వచ్చిన ఒక దినము కోసం కాదని (కీర్త. 2: 7; LXX Ps. 110: 3 లో పునరావృతమైంది), కానీ అది ఒక అంతంలేని రోజు [ఎందుకంటే యాహువఃతో "నేడు" లేదు!] అని నమ్ముటకు మీకు మీరుగా కారణమోతారు.
ఈ వాదనను యహూషువః యహువః యొక్క శాశ్వతమైన కుమారుడు, ఆయనకు ప్రారంభం లేదు అనే నమ్మకాన్ని సమర్థించుటకు 4 వ శతాబ్దానికి చెందిన సంఘ ఫాదర్లు రూపించారు. వారిలో ఒక సంఘ ఫాదర్ ఇలా వ్రాసెను: “కుమారుడు ప్రారంభం లేని ఆరంభాన్ని కలిగియున్నాడు.”
సంఘాలలో కూర్చొని వింటున్న జనులు తమకు ప్రకటించబడిన విశ్వాసపు పునాదిపై చాలా తక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వారికి తెలుసా లేదా పట్టించుకోరా …?
|
ఇప్పుడు క్లిష్టమైన ప్రశ్న: “ప్రారంభం లేని ఆరంభం” అనే భావన మరియు యహువఃతో “నేడు” అనే దాని సహచర ఆలోచన అంతములేని సమయాన్ని సూచిస్తుంది అనుట నిజాయితీగల మరియు గౌరవప్రదమైన భావనేనా? లేదా తేలికైన భాష యొక్క అస్పష్టత మరియు గందరగోళమా?
ఒక ఔషధ కంపెనీ కొత్త చికిత్సకు సంబంధించి తన ఉత్పత్తులను విక్రయించుట గుర్తుకు వస్తుంది. కానీ అక్కడ ప్రజలకు తెలియకుండా దాచబడిన కొన్ని భయంకరమైన దుష్ప్రభావాలు ఉంటాయి. సంఘంలో జనులు తమకు ప్రకటించబడిన విశ్వాసంపై చాలా తక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. యహువఃను గూర్చిన తమ కేంద్రక సిద్ధాంతమైన, యహూషువః అనగా కుమారుడైన యహువః, “శాశ్వతంగా జన్మించిన కుమారుడు” అనే సిద్ధాంతాన్ని రూపించిన రూపకర్తలు మరియు సూత్రదారులు మిమ్మల్ని కుమారుడైన యహువఃను విశ్వసించునట్లు చేయుట ద్వారా, “యహువఃతో నేడు” అనగా 'ఈ రోజు' అని అర్ధం కాదు అని స్వయంచాలకంగా నమ్మునట్లు చేస్తుండెనని వారికి తెలుసా లేదా పట్టించుకోరా …? హేతుబద్ధమైన, తెలివైన మానవులకు “ప్రారంభం లేని ఆరంభం” అనేది సరైన పదబంధంగా అనిపిస్తుందా? మిలియన్ల మంది విశ్వాసులు వెనుకాడకుండా కేంద్ర సిద్ధాంతంగా ప్రకటిస్తున్న "1 + 1 + 1 = 1" ఎలా అవుతుంది?
ప్రపంచ ప్రఖ్యాత క్రైస్తవ సిద్ధాంతకర్త డాక్టర్ జేమ్స్ డున్ మాటలను ఆలోచించుటకు మిమ్మల్ని ఆహ్వానించుట ద్వారా మనం ముగించుకుందాం: “క్రమంగా సమ్మతించడం మరియు విశ్వాసం ఉన్నత-భక్తి స్థాయికి వ్యాప్తి చెందడం ద్వారా ''జనాదరణ పొందిన అన్యమత మూఢ విశ్వాసం ప్రసిద్ధ క్రైస్తవ మూఢ విశ్వాసంగా మారే అవకాశం ఎప్పుడూ ఉంది." (క్రిస్టాలజీ ఇన్ ది మేకింగ్, పేజి 251).
ఇది ఆంథోనీ బజార్డ్ రాసిన వ్యాసం నుండి తీసుకోబడినది. WLC వ్యాసం కాదు. (http://thehumanYahushua.org/2016/02/01/losing-luke-and-jumping-to-john/)
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.